Author: admin

భారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మెరుగుపడడంతో ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో థానేలోని ఒక హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి‌బాగవడంతో డిశ్చార్జి అయ్యారు. 52 సంవత్సరాల కాంబ్లీ ప్రజలను మద్యానికి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని నూతన సంవత్సరం సందర్భంగా సందేశాత్మక వీడియో కూడా చేసిన విషయం తెలిసిందే. చెడు వ్యసనాలు జీవితాన్ని నాశనం చేస్తాయని పేర్కొన్నాడు. భారత క్రికెట్ జట్టు జెర్సీ వేసుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన సందర్భంగా ఆయన కనిపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ,అగ్ర దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’.ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అంజలి, కియారా అద్వానీ కథానాయికలుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈచిత్రం నుండి వచ్చిన లిరికల్ సాంగ్స్, టీజర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా ఈచిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేశారు. అత్యద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ సీన్స్, ఆకట్టుకునే పోరాట సన్నివేశాలతో ప్రతి ఫ్రేమ్ లోనూ భారీ తనం ఉట్టి పడేలా శంకర్ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. వెన్నెల కిషోర్, ఎస్.జె.సుర్య, సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. https://youtu.be/zHiKFSBO_JE?si=K-YdrGilWlbwx9Y-

Read More

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఫైనాన్షియల్, ఆటో, ఐటీ రంగాల షేర్ల మద్దతుతో సూచీలు జోరు కనబరిచాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే సెన్సెక్స్ లో కంపెనీల విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు పెరిగింది. ఈరోజు ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1436 పాయింట్ల లాభంతో 79,943 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం ఫ్లాట్ గా ట్రేడింగ్ ముగించింది. 445 పాయింట్లు లాభపడి 24,188 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.75గా కొనసాగుతోంది. ఒకటీ అర మినహా సెన్సెక్స్ లో దాదాపు అన్ని షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

2024 ఏడాదికి ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రకటించింది. నలుగురు క్రీడాకారులకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లు, 32 అర్జునా అవార్డులు, 5 ద్రోణాచార్య అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 17న ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వీరంతా పురస్కారాలను అందుకోనున్నారు. ఖేల్ రత్న కు ఎంపికైన వారిలో హాకీ క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ సింగ్, చెస్ లో ఇటీవల ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచన గుకేష్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్ విభాగంలో మను బాకర్ ఉన్నారు. 32మందికి అర్జున, ఐదుగురికి ద్రోణాచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు. అర్జున పురస్కారాలు దక్కించుకున్నవారిలో 17మంది పారా అథ్లెట్స్ ఉండటం విశేషం. అర్జున అవార్డులు: జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్), అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు (బాక్సింగ్), ప్రణవ్ సూర్మ…

Read More

బీహార్‌,కేరళ రాష్ట్రాలకు కొత్తగా నియమితులైన గవర్నర్లు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకూ కేరళ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్ తాజాగా బీహార్‌ గవర్నర్‌గా ప్రమాణం చేశారు.అయితే ఇన్ని రోజులూ బీహార్‌ గవర్నర్‌ గా పనిచేసిన ‌రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ కేరళ గవర్నర్‌గా ఈరోజు ప్రమాణం చేశారు. కాగా 5 రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే.బీహార్‌ గవర్నర్‌గా ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌,కేరళ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌,ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు,మిజోరం గవర్నర్‌గా జనరల్‌ విజయ్‌ కుమార్‌ సింగ్‌,మణిపూర్‌ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లాను నియమించింది.అయితే గత నెల 24న కొత్త గవర్నర్ల నియమించేందుకు రాష్ట్రపతి భవన్‌ ప్రకటన విడుదల చేసింది.

Read More

బంగ్లాదేశ్ ఇస్కాన్ నేత చిన్మ‌య్ కృష్ణ దాస్ బ్ర‌హ్మ‌చారికి బెయిల్ నిరాక‌రించారు.ఈ మేరకు చిట్ట‌గ్రామ్ మెట్రోపాలిటిన్ సెష‌న్స్ జ‌డ్జి మ‌హ‌మ్మ‌ద్ సైఫుల్ ఇస్లామ్ బెయిల్‌ను తిర‌స్క‌రిస్తూ ..ఆదేశాలు జారీ చేశారు.ఇరు ప‌క్షాల నుండి సుమారు 30 నిమిషాల పాటు వాద‌న‌లు విన్న త‌ర్వాత ఆయ‌న తీర్పు వెలువ‌రించారు.బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకోనున్న‌ట్లు చిన్మ‌య్ త‌ర‌పు న్యాయ‌వాది అపూర్వ కుమార్ భ‌ట్టాచార్జీ తెలిపారు.

Read More

శ్రీలంకలో తీవ్ర స్థాయిలో అవినీతి వ్యాపించి ఉందని అ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే వ్యాఖ్యానించారు.అది చివరికి క్యాన్సర్‌గా మారిందని అన్నారు.అవినీతిని నిర్మూలించాలంటే అందరీ సమష్టి కృషి అవసరమంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రెసిడెన్షియల్‌ సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వ యంత్రాగం,రాజకీయా సంస్థలు,సమాజంలో ఇలా అన్ని చోట్ల అవినీతి వ్యాపించింది.అసమర్థత,అధికార దుర్వినియోగం సహా ఇతర సమస్యలతో దేశం బాధపడుతోంది.దేశమంతటా వ్యాపించిన ఉన్న అవినీతి క్యాన్సర్‌లా మారింది.అవినీతిని నిర్మూలించాలంటే సమష్టి కృష్టి ఎంతో అవసరమని పిలుపునిచ్చారు.నిజాయతీ,శ్రద్ధతో తమ విధులను నిర్వర్తించాలని అధికారులకు సూచించారు.

Read More

కేంద్ర ప్ర‌భుత్వం భార‌త అత్యున్న‌త క్రీడా పుర‌స్కారం మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్ ర‌త్న పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది.2024 ఏడాదికి కాను గొప్ప ప్ర‌ద‌ర్శ‌న‌లు క‌న‌బ‌రిచిన‌ న‌లుగురు క్రీడాకారుల‌ను ఖేల్ ర‌త్న కోసం ఎంపిక చేసింది. స్టార్ షూట‌ర్ మ‌ను బాక‌ర్‌కు కేంద్రం ఈ అవార్డును ప్ర‌క‌టించింది.మ‌నుతో పాటు ఇటీవ‌ల వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్ షిప్ విజేత గుకేశ్ కుమార్, పారా అథ్లెట్ ప్ర‌వీణ్ కుమార్, భార‌త హాకీ జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్‌ల‌కు కేంద్రం ఈ అవార్డ‌ను ప్ర‌క‌టించింది.ఈ నెల 17న ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు కేంద్ర యువ‌జ‌న వ్య‌వ‌హారాలు,క్రీడా శాఖ ప్ర‌క‌టించింది.

Read More

విశాఖపట్నం జైలు ఖైదీలతో కిక్కిరిసిపోతోంది.950 మంది ఖైదీలను ఉంచగల సామర్థ్యం మాత్రమే ఉండగా ప్రస్తుతం 2,076 మంది ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు.ఈ జైలు సామర్థ్యానికి మించి ఖైదీలను ఉంచడంతో పర్యవేక్షణ, వసతుల కల్పన సవాలుగా మారిందని చెబుతున్నారు.ఇప్పుడు ఉన్న ఖైదీలలో శిక్ష ఖరారైన వారి సంఖ్య 440 మాత్రమేనని,మిగతా వారంతా రిమాండ్ ఖైదీలేనని తెలిపారు.ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గదులు సరిపోవడంలేదని, ఇరుకు గదిలో ఇబ్బంది పడుతున్నానంటూ ఓ ఖైదీ తన బంధువులకు చెప్పాడు.దీంతో ఖైదీ బంధువులు ఇటీవల జైలు ఎదుట ఆందోళన చేశారని సమాచారం.ఈ మేరకు 200 మంది ఖైదీలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More

వ్యక్తిగత అవసరాల కోసం ప్రజలు,వాణిజ్య సంస్థలు తమ డెలివరీ సిబ్బంది కోసం విద్యుత్తు వాహనాలను కొనుగోలు చేయడం పెరిగింది.శబ్దం చేయకపోవడం, పొగను వెదజల్లకపోవడం,సంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే,వీటి నిర్వహణ వ్యయం తక్కువ కావడం ఇందుకు ఉపకరిస్తోంది.2024 మొత్తంమీద 11,48,415 విద్యుత్తు ద్విచక్ర వాహనాలు విక్రయమయ్యాయని కంపెనీల గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.2023లో విక్రయమైన 8,60,418 వాహనాలతో పోలిస్తే, గతేడాది అమ్మకాలు 33% పెరిగాయి 2023 డిసెంబరుతో పోలిస్తే, గత నెలలో వీటి విక్రయాలు 2,600 మేర తగ్గినా.. పండగ సీజన్‌లో అధికంగా అమ్ముడవ్వడం కలిసొచ్చింది. విద్యుత్తు ద్విచక్ర వాహన విక్రయాల్లో బజాజ్‌ ఆటో, టీవీఎస్, ఓలా ఎలక్ట్రిక్, ఏథర్‌ ఎనర్జీ, గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ అగ్రగామి సంస్థలుగా ఉన్నాయి. దాదాపు 25 సంస్థలు దేశంలో విద్యుత్తు ద్విచక్ర వాహనాలను గుర్తించదగ్గ రీతిలో విక్రయిస్తున్నాయి..

Read More