Author: admin

ఐదు రూపాయల కుర్‌కురే ప్యాకెట్‌పై రెండు కుటుంబాల మధ్య పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది. ఈ గొడ‌వ‌లో 10 మంది గాయపడగా, చాలామంది పరారీలో ఉన్నారు. ఈ ఘటన క‌ర్ణాట‌క‌లోని దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో చోటుచేసుకుంది. అతీఫుల్లా అనే వ్యక్తి కిరాణా అంగడిలో సద్దాం కుటుంబానికి చెందిన పిల్లలు కుర్‌కురే కొన్నారు.ఎక్స్‌పైరీ అయిన కుర్‌కేరే విక్రయించారని ఆరోపిస్తూ సద్దాం కుటుంబీకులు కిరాణా షాపు వాళ్ల‌ను ప్ర‌శ్నించారు. దీంతో ఇరు కుటుంబాల మ‌ధ్య వాగ్వాదం మొద‌లైంది. అది కాస్త తీవ్ర స్థాయికి చేరుకోవ‌డంతో కొట్టుకున్నారు.ఈక్ర‌మంలోనే అతీఫుల్లాకు చెందిన మ‌నుషులు త‌మ‌ హోట‌ల్‌పై దాడి చేశార‌ని స‌ద్దాం కుటుంబీకులు ఆరోపించారు.ఈ మేర‌కు ఇరు కుటుంబాలు చెన్నగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.రెస్ట్‌ భయంతో 25 మంది పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ బాలచంద్రనాయక్‌ తెలిపారు.కుర్‌కురే కోసం ఇంత గొడవ జరిగిందా అని గ్రామస్తులు షాక్ అయ్యారు.ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో…

Read More

మధ్యప్రదేశ్-ఉత్తరప్రదేశ్ లలో ప్రవహించే కెన్-బెట్వా నదుల అనుసంధాన జాతీయ ప్రాజెక్టు(కెన్- బెట్వా రివర్ నేషనల్ ప్రాజెక్టు)కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతిని పురస్కరించుకుని మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఈరెండు రాష్ట్రాలలో కొన్ని జిల్లాలకు ఇరిగేషన్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి 718 లక్షల రైతుల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. మధ్యప్రదేశ్ లోని 10 జిల్లాలకు చెందిన 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్ లోని 21 లక్షల మందికి తాగునీటి సౌకర్యం అందనుంది‌. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే హైడ్రో పవర్ ప్రాజెక్టు ద్వారా 103 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయవచ్చు. తద్వరా కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాజ్ పేయి శతజయంతిని సందర్భంగా స్మారక తపాలా బిళ్లను,…

Read More

అంతరిక్షంలోని ఓ సుదూర ప్రాంతంలో ఓ మహా బ్రహ్మాండ జలాశయాన్ని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు.ఇది భూమి నుండి 1,200 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న క్వాసర్‌ (బ్లాక్‌ హోల్స్‌ కలిగిన శక్తి ఉత్పత్తి కేంద్రం) చుట్టూ ఇది తిరుగుతున్నట్లు కనుగొన్నారు.ప్రస్తుతం మనం చూస్తున్న కాంతి ప్రయాణం విశ్వం పుట్టిన తర్వాత కొద్ది కాలంలోనే ప్రారంభమైందని ఈ దూరాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.ఒక కాంతి సంవత్సరం అంటే దాదాపు 6 లక్షల కోట్ల మైళ్ల దూరం. అయితే నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీ ఈ జలాశయాన్ని కనుగొందని సమాచారం.భూమిపై ఉండే మహా సముద్రాల్లోని నీటి మొత్తం కన్నా ఈ మహా బ్రహ్మాండ జలాశయంలోని నీరు 140 లక్షల కోట్ల రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.ఈ జలాశయం ఓ సూపర్‌మాసివ్‌ బ్లాక్‌హోల్‌ వద్ద ఉంది.ఇది సూర్యుడి కన్నా 2,000 రెట్లు పెద్దదని పరిశోధకులు వెల్లడించారు.దీని నుండి 1,000 లక్షల సూర్యులతో సమానమైన…

Read More

అతి పురాతనమైన కిలోవెయ అగ్నిపర్వతం భారీ విస్ఫోటనం చెందింది. నిప్పులు కక్కుతూ లావా చిమ్ముతుంది. ఈ అగ్నిపర్వతం నుండి 80 మీటర్ల ఎత్తు వరకు లావా ఎగసిపడుతోంది. అమెరికాలోని హవాయి బిగ్ ఐలాండ్ లో ఇది అత్యంత క్రియాశీలకమైనది. తాజాగా విస్పోటనం చెందిన ఈ కిలోవెయా అగ్నిపర్వతం 1983 నుంచి క్రియాశీలంగా ఉండగా…అప్పుడప్పుడు ఇందులో స్పల్ప స్థాయిలో విస్ఫోటనాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More

తన వ్యక్తిగత జీవితం గురించి బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ మాట్లాడారు.బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తో కలిసి తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. కొన్ని విషయాల్లో తనకు క్రమశిక్షణ లేదాని అన్నారు. సినిమా షూటింగ్స్కు సమయానికి వెళ్లేవాడినన్నారు. పైప్ స్మోకింగ్, మద్యపానం చేసేవాడినని తెలిపారు. తప్పు చేస్తున్నాని ఒకానొక సమయంలో గ్రహించినా వాటిని వదులుకోలేకపోయా. అలాంటి నా జీవితంలో సినిమానే మార్పు తీసుకొచ్చిందన్నారు. సినిమా మెడిసిన్ లాంటిదని పేర్కొన్నారు. సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఏడాదికి ఓ మూవీ చేయాలని అనుకుంటున్నానని చెప్పారు.

Read More

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కౌశిక్ కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అతడు ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు ‘దేవర (Devara) చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అతడికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తాజాగా కౌశిక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు అతడి తల్లి మీడియా తో మాట్లాడారు. తన కుమారుడి చికిత్స కి సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. “నిన్న సాయంత్రం ఎన్టీఆర్ టీమ్ నాకు కాల్ చేసింది. మేం వస్తున్నాం.. డిశ్చార్జ్ చేయిస్తామని చెప్పారు. మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రూ. 12 లక్షల బిల్లు కట్టి, డిశ్చార్జ్ చేయించారు. నా కొడుకు ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. నిన్న నేను మాట్లాడిన మాటల వల్ల ఎన్టీఆర్ అభిమానులు ఫీలైనట్టున్నారు. మీరు అపార్ధం చేసుకున్నారేమో. మీ అందరి ఆశీస్సుల వల్లే…

Read More

కేంద్రప్రభుత్వం పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక పాఠశాలల్లో ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. ఇక మీదట విద్యార్థులు 5, 8వ తరగతుల సంవత్సర పరీక్షల్లో పాసైతేనే పై తరగతులకు అర్హత సాధిస్తారు. లేకపోతే రెండు నెలల్లోగా మళ్లీ పరీక్ష రాసి పాసవ్వాలి. అప్పుడూ పాస్ కాకుంటే చదివిన తరగతే మరోసారి చదవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 5, 8 తరగతులు చదివే విద్యార్థులు పై తరగతులకు వెళ్లాలంటే ఏడాది చివర్లో నిర్వహించే వార్షిక పరీక్షల్లో ఇక పై తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ ఉత్తీర్ణత సాధించని యెడల ఫలితాలు ప్రకటించిన తేదీ నుండి రెండు నెలల్లోపు ఫెయిలైన ఆయా విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. అప్పటికీ విద్యార్థి ఉత్తీర్ణత సాధించకపోతే, తిరిగి అదే తరగతిలో కొనసాగాల్సి ఉంటుంది. ఫెయిల్ అయి తిరిగి అదే తరగతిని మళ్లీ…

Read More

భారత క్రికెట్ లోనే కాకుండా ప్రపంచ క్రికెట్ లోనే మేటి పేస్ బౌలర్ గా కొనసాగుతున్నాడు జస్ ప్రీత్ బుమ్రా. తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్ గా నిలిచాడు. మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను సమం చేశాడు. ప్రస్తుతం 904 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఘనతను అశ్విన్ 2016లో సాధించాడు. ఇక ప్రస్తుత ర్యాంకింగ్స్ లో బుమ్రా తరువాత 856 పాయింట్లతో సౌతాఫ్రికా పేసర్ ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ హేజల్ వుడ్ 852 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు బ్యాటర్లలో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ 895 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మరో ఇంగ్లీష్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 876 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్ సన్ (867), ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ (825) తర్వాతి…

Read More

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఉదయం వాజ్ పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని ‘అటల్ సదైవ్’ లో నివాళులు అర్పించిన ఆయన అనంతరం ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమయ్యారు. తాజాగా ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించారు.రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. పోలవరం, అమరావతికి సాయంపై ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక సాయం అందించి ఆదుకోవాలని ప్రధానికి విన్నవించారు.‌ ఇటీవల ఏపీ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తీసుకొచ్చిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధానికి అందజేశారు. ఇటీవల పార్లమెంటులో జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన పలు…

Read More

ప్రతి 12 సంవత్సరాలకు ‘మహా కుంభమేళా’ జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రయాగ్ రాజ్ 2025 లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దాదాపుగా 45 కోట్ల మంది యాత్రికులు, సాధువులు పర్యాటకులు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో కంటే మరింత అద్భుతంగా ఈ మహా కుంభమేళా జరిగే విధంగా కృషి చేస్తోంది. ఈక్రమంలో ‘అండర్ వాటర్ డ్రోన్’ ను అధికారులు పరీక్షించారు. ఈ ‘మహాకుంబమేళా’ విజయవంతం చేసేందుకు యూపీ ప్రభుత్వం కొత్త సాంకేతికత ఉపయోగిస్తోంది. అందులో భాగంగా అండర్ వాటర్ డ్రోన్ ను పరీక్షీంచినట్లు అధికారులు తెలిపారు. ఇది నీటి కింద వస్తువులను గుర్తించగలదని ప్రమాదవశాత్తు ఎవరైనా మునిగిపోతే డైవర్ల సాయంతో ఆ ప్రాంతానికి చేరుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.

Read More