Author: admin

ఏపీ ఫైబర్ నెట్ ను ప్రక్షాళన చేస్తున్నట్లు ఛైర్మన్ జీ.వీ.రెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఫైబర్ నెట్ నుండి అక్రమంగా డబ్బులు చెల్లించారని డబ్బును తిరిగి చెల్లించేందుకు 15 రోజుల వ్యవధి ఇచ్చామని తెలిపారు. ఆ వ్యవధిలోగా డబ్బు చెల్లించకుంటే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అర్హత లేని వారిని గత ప్రభుత్వం ఫైబర్ నెట్ లో నియమించిందని గత ప్రభుత్వం నియమించిన 410 మందిని తొలగించనున్నట్లు పేర్కొన్నారు. వేతనాల పేరుతో ఫైబర్ నెట్ నుండి కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని మండిపడ్డారు. కక్షతో, దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదని లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని తెలిపారు. అవసరం మేరకు ఉద్యోగులను తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

Read More

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నేడు జరిగింది. ఈసమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు బిఆర్ నాయుడు అధ్యక్ష‌త‌న, టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఈ స‌మావేశం జ‌రిగింది. ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు టీటీడీ ఆల‌యాలు, ఆస్తుల గ్లోబల్ విస్తరణ కోసం నిపుణుల‌తో క‌మిటీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు నిర్ణయం. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించేందుకు ఆమోదం. స్విమ్స్ ఆసుపత్రిలో రోగుల‌కు మరింత మెరుగైన‌ వైద్య సేవలు అందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. కాలిన‌డ‌క దారుల‌లో వ‌చ్చే భ‌క్తుల‌కు మేర‌కుగైన వైద్య సౌక‌ర్యం అందించేందుకు గాను అవ‌స‌ర‌మైన సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్లు, న‌ర్సులు, పారా మెడిక‌ల్ సిబ్బంది,…

Read More

ఈరోజు న్యూ ఢిల్లీలో హడ్కో సీఈవో సంజయ్ కుల్ శ్రేష్ట తో మరియు జిందాల్ సా చైర్మన్ పీఆర్ జిందాల్ తో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. అమరావతికి రుణ సమీకరణ ప్రక్రియ పై సంజయ్ కుల్ శ్రేష్ఠతో చర్చించారు. ఇప్పటికే రాజధాని కోసం 11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హాడ్కో అంగీకారం తెలిపింది. అనంతరం రాష్ట్రంలో మరిన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై పృథ్వీరాజ్ జిందాల్ తో మంత్రి నారాయణ చర్చించారు. గత టీడీపీ హయంలోనే జిందాల్ సంస్థ గుంటూరు,విశాఖలో రెండు ప్లాంట్ లు ఏర్పాటు చేసిందని తెలిపారు.

Read More

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 షెడ్యూల్ వచ్చేసింది. 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు మ్యాచ్ లు జరుగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్ లకు మినహా పాకిస్థాన్ ఈ సిరీస్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ మోడల్ లో తటస్థ వేదికలపై జరగనున్నాయి. గ్రూప్ ఏ లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉండగా… గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ లు ఉన్నాయి. భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మార్చి 2న న్యూజిలాండ్ తో దుబాయ్ వేదికగా మ్యాచ్ లు ఆడనుంది. Check out the full fixtures for the ICC Champions Trophy 2025. pic.twitter.com/oecuikydca— ICC (@ICC) December 24, 2024

Read More

టాలీవుడ్‌లో ఆన్‌స్క్రీన్ పెయిర్‌గా మంచి పేరు సొంతం చేసుకున్నారు న‌టీన‌టులు ర‌ష్మిక – విజ‌య్ దేవ‌ర‌కొండ‌. గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాల్లో క‌లిసి న‌టించిన‌ప్ప‌టి నుంచి ఈ జంట గురించి ఎన్నో వార్త‌లు పుట్టుకొచ్చాయి. వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని సినీ ప్రియులు మాత్ర‌మే కాకుండా బీటౌన్‌లో తార‌లు కూడా భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయా క‌థ‌నాల్లో నిజం లేద‌ని ఈ జంట ప‌లుమార్లు చెప్పిన‌ప్ప‌టికీ ఆ వార్త‌లు మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా వీరిద్ద‌రూ ముంబ‌యి ఎయిర్ పోర్టులో ద‌ర్శ‌న‌మిచ్చారు. మొద‌ట ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ర‌ష్మిక ఫొటోగ్రాఫ‌ర్ల‌కు న‌వ్వుకుంటూ పోజులిచ్చి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. కొంత‌సేప‌టికి విజ‌య్ దేవ‌ర‌కొండ ఎయిర్‌పోర్టులోకి అడుగుపెట్టారు. దీంతో ఈ జంట మ‌రోసారి వార్త‌లోకి ఎక్కింది. క్రిస్మ‌స్, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో భాగంగానే వీరిద్ద‌రూ విదేశాల‌కు వెళ్తున్నార‌ని .. ఈ జంట క‌లిసి సెల‌బ్రేట్ చేసుకోనుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ముంబ‌యి ఎయిర్ పోర్టు వీడియో…

Read More

భారత స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ ఇటీవ‌ల త‌న‌ని బ్లాక్ చేశాడ‌ని బాలీవుడ్ న‌టుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ రాహుల్ వైద్య తెలిపారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రాహుల్ .. కోహ్లీ అంటే నాకెంతో ఇష్టం. ఇదే విష‌యాన్ని ఇప్ప‌టికే ఎన్నో సంద‌ర్భాల్లో చెప్పా. ఆయ‌న మ్యాచ్‌ల గురించి త‌ర‌చూ పోస్టులు పెడుతుంటా. అలాంటిది ఇటీవ‌ల ఆయ‌న ఇన్‌స్టా వేదిక‌గా బ్లాక్ చేశారు. ఇప్ప‌టికీ అందుకు గ‌ల కార‌ణం నాకు తెలియ‌దు. ఆయ‌న ఎందుకు ఇలా చేశార‌ని ఆలోచిస్తున్నా అని తెలిపారు. రాహుల్ వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి. అది కోహ్లీ చేసి ఉండ‌ర‌ని.. ఆయ‌న పిల్ల‌లు చేసి ఉంటార‌ని నెటిజ‌న్లు భావిస్తున్నారు. కోహ్లీ ఫోన్ ఆయ‌న పిల్ల‌లు అకాయ్‌, వామికా వాడి ఉంటార‌ని.. ఆడుతూ ఆడుతూ అనుకోకుండా ఇలాంటి పోస్టులు పెట్టి ఉంటార‌ని సోష‌ల్‌మీడియా యూజ‌ర్స్ అనుకుంటున్నారు. ఇక‌, కోహ్లీ త‌న కుటుంబంతో క‌లిసి కొంత‌కాలంగా లండ‌న్‌లో ఉంటున్న విష‌యం…

Read More

సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌నను ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే న‌టుడు అల్లు అర్జున్‌ను చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు తాజాగా విచారించారు. ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.30 వ‌ర‌కూ ఈ విచార‌ణ జ‌రిగింది. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌, ఇటీవ‌ల అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్‌మీట్ విష‌యాల‌పై ఆయ‌న్ని ప్ర‌శ్నించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అల్లు అర్జున్ విచార‌ణ సంద‌ర్భంగా ఆయ‌న తండ్రి అల్లు అర‌వింద్‌, మామ చంద్ర శేఖ‌ర్‌, స్నేహితుడు బ‌న్నీ వాస్ త‌దిత‌రులు చిక్క‌డ‌ప‌ల్లి పీఎస్‌కు వ‌చ్చారు. దీంతో పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. మ‌రోవైపు, ఆదివారం అల్లు అర్జున్ నివాసంపై ఓయూజేఏసీ నాయ‌కులు దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న ఇంటి నుంచి ప‌ర‌దాలు ఏర్పాటు చేశారు. తాజాగా వాటిని తొల‌గించారు. పుష్ప 2 బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ సంధ్య థియేట‌ర్‌కు హాజ‌రు కావ‌డంతో…

Read More

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేటి ట్రేడింగ్ ను స్వల్ప నష్టాలతో ముగించాయి. ఉదయం లాభాల్లో కదలాడినా సెషన్ చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా కొద్ది నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో 78,472 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 27 పాయింట్ల నష్టంతో 23,727 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.18గా కొనసాగుతోంది. ఐటీసీ, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టీ.సీ.ఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.

Read More

హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన మనాలీని మంచు కప్పేసింది. క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో ప్రతి సంవత్సరం డిసెంబరు చివరి వారంలో మనాలీకి పర్యటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది. మంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వాహనాలు ముందుకుకదల్లేక భారీగా ట్రాఫిక్ జామ్ కాగా, రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ను పునరుద్దరిస్తున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలీకి పర్యటకులు భారీగా తరలివచ్చారు. హిమాచల్ రాజధాని సిమ్లాలోనూ మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ సీజన్ లో వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతానికి వచ్చాయని అధికారులు తెలిపారు.

Read More

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ధరలు పెరుగుదలకు సంబంధించి కేంద్రంపై మండిపడ్డారు. ప్రజలు పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతోందని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఒక కూరగాయల మార్కెట్ కు వెళ్లిన వీడియో ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. అక్కడ స్థానికులతో మాట్లాడినట్లు తెలిపారు. ధరలు పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వెల్లుల్లి ఒకప్పుడు ₹40, నేడు ₹400!‌ అయిందని పేర్కొన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యుడి వంటగది బడ్జెట్‌ను పెంచుతోందని అన్నారు. ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతుందని దుయ్యబట్టారు. “लहसुन कभी ₹40 था, आज ₹400!”बढ़ती महंगाई ने बिगाड़ा आम आदमी की रसोई का बजट – कुंभकरण की नींद सो रही सरकार! pic.twitter.com/U9RX7HEc8A— Rahul Gandhi (@RahulGandhi) December 24, 2024

Read More