Author: admin

దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను ఫ్లాట్ గా ముగించాలి. ఉదయం లాభాల్లో ప్రారంభమై ఆటో, ఫైనాన్స్ రంగాల షేర్ల మద్దతుతో కొద్దిసేపు నిలకడగా రాణించాయి. అనంతరం క్రమంగా ఇన్వెస్టర్లు ప్రధాన షేర్లలో అమ్మకాలకు ఆసక్తి చూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా సూచీలు ఒడిదుడుకులలో పయనించి చివరికి ఫ్లాట్ గా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 0.39 పాయింట్ల నష్టంతో 78,472 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 22.55 పాయింట్ల లాభంతో 23,750 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.27గా కొనసాగుతోంది. ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్టెల్, అల్ట్రా టెక్ సిమెంట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి.

Read More

విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలేనని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనేనని విమర్శించారు. కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ మోడీ గారికి ఆంధ్రుల హక్కు మీద లేదని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ కు సంబంధించి ఆమె కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి HD కుమారస్వామి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల సహాయం అందించారని స్టీల్ ప్లాంట్ ను బ్రతికించారు. 243 మంది పనిచేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్రానికి.. 26 వేల మంది పనిచేసే విశాఖ స్టీల్ ను ఆదుకోవడానికి మనసు లేదని విమర్శించారు . ఇద్దరు ఎంపీలు ఉండే JD(S) రూ.15వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే.. ఎన్డీయే కు…

Read More

కొత్త చిత్రాల ఎంపికలో సాయిపల్లవి చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది.ఆమె కథలో కొత్తదనంతో ఉంటేనే అంగీకరిస్తుంది.అందుకే సాయి పల్లవి ఒప్పుకునే సినిమాల గురించి ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తారు.ఈ నేపథ్యంలో సాయిపల్లవి తెలుగులో మరో చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.దర్శకుడు వేణు యెల్దండి ‘బలగం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు.ఆయన తన తదుపరి చిత్రంగా ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారు.ఇందులో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని = దిల్‌రాజు నిర్మించనున్నారు. ఈ చిత్రం తెలంగాణ నేపథ్య కథాంశంతో తెరకెక్కబోతుంది అని సమాచారం.ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిసింది.ఈ కథ సాయిపల్లవికి బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించిందని సమాచారం. అయితే ఈ చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ప్రస్తుతం నాగచైతన్యకు జోడిగా సాయిపల్లవి ‘తండేల్‌’ చిత్రంలో నటిస్తుంది.ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలకానుంది.అనంతరం ‘ఎల్లమ్మ’ చిత్రం పట్టాలెక్కుతుందని తెలుస్తుంది.

Read More

పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ..కరెంట్ బిల్లుల పెంపుని నిరసిస్తూ డిసెంబరు 27న రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ పోరుబాట పట్టనున్నట్లు ప్రకటించింది. కాగా, వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలపై వాళ్లే తగ్గించమని వాళ్లే ధర్నాకు పిలుపునివ్వడం హాస్యాస్పదమని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ట్రూ అప్ చార్జీల భారం జగన్ రెడ్డిది కాదా.. రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలను పెంచాలని ఈఆర్సీని కోరింది నిజం కాదా..? పీపీఏలను రద్దు చేసి, సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి విద్యుత్ లోటుకు కారణమైంది జగన్ రెడ్డి కాదా..? అని ప్రశ్నించారు 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ఏపీ జెన్కో సర్వనాశనానికి కారకుడైన జగన్ రెడ్డి తన పాపాలను కప్పిపుచ్చుకోవటానికి ఇలా ధర్నాల పేరుతో ఆడుతున్న డ్రామాలను ఏపీ ప్రజలు నమ్మరని మంత్రి ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు‌. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా సిగ్గులేకుండా…

Read More

దేశంలోని 17 మంది చిన్నారులు విశిష్ట అవార్డులకు ఎంపికయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారికీ పురస్కారాలను అందచేశారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో 17 మంది చిన్నారులు అసాధారణ విజయాలు సాధించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను వారికి ప్రదానం చేశారు. అవార్డులు గెలుచుకున్న పిల్లల్లో దేశభక్తి ఉదంతాలు మన దేశ భవిష్యత్తుపై మన విశ్వాసాన్ని బలపరుస్తాయని రాష్ట్రపతి అన్నారు. దేశభక్తి యువకులను మరియు వృద్ధులను దేశం యొక్క సంక్షేమం కోసం పూర్తి అంకితభావంతో నడిపిస్తుందని ఈసందర్భంగా పేర్కొన్నారు.

Read More

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’.అయితే ఈ చిత్రం ‘హిట్‌’ ఫ్రాంఛైజీలో వస్తున్న మూడో చిత్రమిది.ఈ చిత్రానికి శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా కశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని.. అర్జున్‌ సర్కార్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు.నిన్న క్రిస్మస్‌ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని స్టెలిష్‌ లుక్స్‌తో కనిపిస్తున్నారు.కశ్మీర్‌ షెడ్యూల్‌లో యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కిస్తున్నామని, ఇవి సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని చిత్రబృందం తెలిపింది.వచ్చే సంవత్సరం మే 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్‌ అందిస్తున్నాడు. Merry Christmas to each one of you🎁 #HIT3 pic.twitter.com/WO2VmdvofX— Nani (@NameisNani) December 25, 2024

Read More

తిరుమల తిరుపతి దేవస్థానం వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు.ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో పి.ఎం.ఎస్‌.ప్రసాద్ టీటీడీ (TTD) ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు కోటి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలను విరాళంగా అందించారు.అయితే ఈ విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.ఇటీవల తిరుపతికి చెందిన వ్యాపారి ఒకరు స్వామివారికి కోటి రూపాయలను అందజేసిన సంగతి తెలిసిందే.

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు.ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎంని కలిశారు.ఈ సమావేశంలో టిక్కెట్ ధరల పెంపు,బెనిఫిట్‌ షోలు,అల్లు అర్జున్‌ అరెస్టు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.సంధ్యా థియేటర్‌ ఘటన,అల్లు అర్జున్‌ అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రితో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సమావేశం సందర్భంగా సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిపాదనలు ఇవే …! * ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు సినిమా ఇండస్ట్రీ సహకరించాలి. * డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలి. * డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల్లో హీరోలు, హీరోయిన్లు కచ్చితంగా పాల్గొనాలి. * సినిమా టికెట్లపై విధించే సెస్సును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెట్‌ * స్కూల్స్‌ నిర్మాణానికి వినియోగించాలి. * కులగణన సర్వే ప్రచార కార్యక్రమానికి…

Read More

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు (నాలుగో టెస్టు) లో మొదటిరోజే ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. శామ్ కొన్స్టాస్ 60 (65;6×4, 2×6) అరంగ్రేటంలోనే దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుని ఆస్ట్రేలియాకు మంచి ఆరంభాన్ని అందించాడు. మార్నస్ లబుషేన్ 72 (145;7×4) మంచి ప్రదర్శన కనబరిచాడు. ఉస్మాన్ ఖవాజా 57 (121; 6×4) హాఫ్ సెంచరీతో రాణించాడు. అలెక్స్ క్యారీ 31(41;1×6) పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్ (0), మార్ష్ (4) విఫలమయ్యారు. ప్రస్తుతం ఆట ముగిసే సమయానికి స్మిత్ 68 బ్యాటింగ్, పాట్ కమ్మిన్స్ 8 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, ఆకాష్ దీప్, జడేజా, వాషింగ్టన్…

Read More

ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్ కీలక నేత, కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ అజయ్ మాకెన్ విమర్శలు చేశారు. 40 రోజులపాటు 2013లో ఆ పార్టీకి మద్దతివ్వడం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పని పేర్కొన్నారు. ఆ కారణంగా ఢిల్లీలో కాంగ్రెస్ బలహీనపడిందని అభిప్రాయపడ్డారు. ఆ పొరపాటును ఇప్పటికైనా సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది తన అభిప్రాయమేనని అన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ తాజాగా 12 అంశాలతో ఒక వైట్ పేపర్ విడుదల చేసింది. ఢిల్లీ లో పొల్యూషన్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్, మౌలిక వసతుల కల్పనలో విఫలమయ్యాయని బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలపై అజయ్ మాకెన్ విమర్శించారు. జన్ లోక్ పాల్ అంశంలో ఆప్ తీరుని ఆక్షేపించారు. ఢిల్లీని లండన్ లా అభివృద్ధి చేస్తామన్నారని అయితే కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిపారని దుయ్యబట్టారు.

Read More