Author: admin

విద్య,పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్ ఒకరు.భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలకపాత్ర పోషించారు.దేశానికి ఆయన చేసిన సేవ,ఆయన రాజకీయం జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.ఆయన మృతి దేశానికి తీరని లోటని అన్నారు. Former Prime Minister Dr Manmohan Singh Ji was one of those rare politicians who also straddled the worlds of academia and administration with equal ease. In his various roles in public offices, he made critical contributions to reforming Indian economy. He will always be…— President of India (@rashtrapatibhvn) December 26, 2024

Read More

దేశం ఒక విశిష్ట వ్యక్తిని కోల్పోయిందని ప్రధాని మోదీ అన్నారు.శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారు.దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్రవేశారు.పార్లమెంట్‌లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవి.ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారు అని ప్రధాని మోదీ మన్మోహన్‌ను గొప్పతనాన్ని తలుచుకున్నారు.

Read More

మాజీ సీఎం, వైయస్ఆర్ సీపీ అధినేత జగన్ పులివెందులలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్భార్‌ నిర్వహించారు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులకు వైయస్‌ జగన్‌ భరోసానిచ్చారు. ప్రజాదర్భార్ లో కలిసిన వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని పేర్కొన్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు వైసీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్‌ ఛార్జీలపై ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని…

Read More

బాలీవుడ్ నటుడు సోనూసూద్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.కీలక విషయాలు వెల్లడించారు.రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టే అవకాశాలు వచ్చినట్లు తెలిపారు.తానే వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు.”దేశంలోనే మంచి పేరున్న కొందరు,కొన్ని పార్టీలు సీఎం బాధ్యతలు చేపట్టమని నాకు అవకాశం ఇచ్చారు.కానీ, నేను దాన్ని తిరస్కరించా.దీంతో డిప్యూటీ సీఎం, రాజ్యసభ ఆఫర్లు కూడా ఇచ్చారు.రాజకీయాల్లో ఉంటే దేని కోసం మనం పోరాడాల్సిన అవసరం లేదని చెప్పారు.అయితే..వారిచ్చిన అవకాశాలను స్వీకరించలేకపోయా” అని తెలిపారు.ప్రజాసేవ చేయడం తనకు ఇష్టం అని ఆయన అన్నారు.రాజకీయాల్లో ఉంటే జబాబుదారీ తనంతో ఉండాలని అది తనకు భయంగా ఉంటుందని ఆయన చెప్పారు.

Read More

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్థిక వేత్త , మాజీ ప్రధాని, మన్మోహన్ సింగ్ గత రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. రేపు ఆయన అంతిమ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంపైనా జాతీయజెండాను సగానికి అవనతం చేశారు. ఈరోజు కేంద్ర క్యాబినెట్ సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఏడు రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా మన్మోహన్ సింగ్ మృతికి ప్రముఖుల సహా…

Read More

ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 31న పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జనవరి 1న నూతన సంవత్సరం నేపథ్యంలో ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో 31వ తేదీనే పెన్షన్ల పంపిణీని చంద్రబాబు ఆ గ్రామం నుండి ప్రారంభించనున్నారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో యల్లమంద గ్రామంలో సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ యల్లమంద గ్రామంలో పర్యటించారు. అక్కడ హెలిపాడ్ నిర్మాణానికి అనువైన స్థలంతో పాటు సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులతో సమీక్షించారు.

Read More

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎయిమ్స్ వద్ద భద్రతను పెంచారు. మన్మోహన్ సింగ్ ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ అభ్యున్నతికి అభివృద్ధికి కృషి చేశారు. అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుండి 1996 వరకు అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. యూపీఏ హయాంలో 2004 నుండి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read More

క‌ర్నాట‌క‌లోని బెళ‌గావిలో కాంగ్రెస్ పార్టీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి.1924 నాటి స్మార‌క స‌మావేశాల‌ను గుర్తు చేసుకుంటూ..ఈరోజు స్మార‌క సమావేశం ఏర్పాటు చేశారు.ఈ మేరకు బెళగావి న‌గ‌రం అంతా పోస్ట‌ర్ల‌ను అంటించారు.అయితే ఆ పోస్ట‌ర్ల‌పై ఉన్న భార‌తదేశ మ్యాప్‌ను త‌ప్పుగా చిత్రీక‌రించారు.ఆ పోస్ట‌ర్ల‌లో ఉన్న మ్యాప్‌లో..పాక్ ఆక్ర‌మిత‌ గిల్‌గిత్ ప్రాంతం కానీ, చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతం లేవ‌ని బీజేపీ విమర్శించింది. ఆ రెండు ప్రాంతాలు జ‌మ్మూక‌శ్మీర్‌లోని ప్రాంతాలు. డీకే శివకుమార్ స్పందన…! కాగా ఈ వివాదంపై క‌ర్నాట‌క ఉపముఖ్యమంత్రి డీకే శివ‌కుమార్ స్పందిస్తూ…పోస్ట‌ర్ల‌లో ఏదైనా పొర‌పాటు ఉంటే, వాటిని తొల‌గిస్తామ‌న్నారు. బ‌హుశా కొంద‌రు త‌ప్పు చేసి ఉంటారు,వాటిని తొల‌గిస్తున్నామ‌న్నారు.కావాల‌ని బీజేపీ త‌మ‌ను అటాక్ చేస్తోంద‌ని,ఈర్ష్య‌కు మందు లేద‌న్నారు. బీజేపీ విమర్శలు…! కాంగ్రెస్ పార్టీ వైఖ‌రి ప‌ట్ల బీజేపీ తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది.రాహుల్ గాంధీ మొహ‌బ‌త్ కి దుకాన్‌.. ఎప్పుడూ చైనా కోసం తెరిచి ఉంటుందని, ఈ దేశాన్ని ముక్క‌లు చేస్తార‌ని,…

Read More

ఆధారాలు లేకుండా ఈవీఎంలను నిందించలేమని ఎన్.సీ.పీ (ఎస్.పి) ఎంపీ సుప్రీయా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల అవకతవకలపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని ఇందులో వాస్తవాలను బయటకు తీసుకొచ్చే విధంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయిన తమ పార్టీ నేత యోగేంద్ర పవార్ రీకౌంటింగ్ కోరడం సరికాదని అన్నారు. ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని సూచించగా ఆయన వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఈవీఎంలతో నిర్వహించిన ఎన్నికల్లోనే తాను నాలుగు సార్లు ఎంపీగా గెలిచానని అలాంటప్పుడు అందులో స్కామ్ ఉందని ఎలా చెప్పగలనని అన్నారు. ఈవీఎంలను అయినా బ్యాలెట్ పేపర్ ద్వారా అయిన పారదర్శకంగా జరిగితే ఏ సమస్య ఉండదని అన్నారు. ఇది తన అభిప్రాయమేనని అన్నారు. ప్రజలు ఎలా కోరుకుంటే అలా ఎన్నికలు జరపాలని అన్నారు. ఇక కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు…

Read More

త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో తాము ఒంటరిగా పోటీ చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల ఆప్ పై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శలు గుప్పించారు. 2013లో ఆ పార్టీకి మద్దతివ్వడం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పని పేర్కొన్నారు. ఆ కారణంగా ఢిల్లీలో కాంగ్రెస్ బలహీనపడిందని అభిప్రాయపడ్డారు. ఆ పొరపాటును ఇప్పటికైనా సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది తన అభిప్రాయమేనని అన్నారు. ఢిల్లీ లో పొల్యూషన్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్, మౌలిక వసతుల కల్పనలో విఫలమయ్యాయని బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలపై అజయ్ మాకెన్ విమర్శించారు. జన్ లోక్ పాల్ అంశంలో ఆప్ తీరుని ఆక్షేపించారు. దీనిపై కాంగ్రెస్ ఆప్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆప్ నేత సంజయ్ సింగ్ దీనిపై స్పందించారు. తమ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై అజయ్ మాకెన్…

Read More