బాలీవుడ్ నటీమణులు తన ఒకప్పటి కోస్టార్స్ అలియాభట్,కియారా అడ్వాణీతో తాను ఇబ్బందికరంగా ప్రవర్తించినట్లు వస్తోన్న వార్తలపై తాజాగా నటుడు వరుణ్ ధావన్ స్పందించారు.తన తదుపరి చిత్రం బేబీ జాన్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.కోస్టార్స్‌తో సరదాగా ఉండటం నాకు చాలా ఇష్టం.అదే విధంగా ఉన్నాను. అది ఆ హీరోయిన్స్ కి కూడా తెలుసు.అంతేకానీ నేను వాళ్లను ఏమాత్రం ఇబ్బందిపెట్టలేదు.అలా ఇబ్బందిపెట్టానని హీరోయిన్స్ ఎప్పుడూ ఫిర్యాదులు చేయలేదు కదా..! తోటి హీరోలతోనూ నేను అదేవిధంగా ఉంటా అని వరుణ్ ధావన్ చెప్పారు. బేబీ జాన్ చిత్రానికి అట్లీ కథ అందించారు.కీర్తి సురేశ్ కథ అందించారు.కాలీస్ దర్శకత్వం వహిస్తున్నారు.వామికా గబ్బీ కీలక పాత్ర పోషించారు.కోలీవుడ్‌లో తెరకెక్కిన తెరీ రీమేక్‌గా ఇది రూపుదిద్దుకున్నట్లు సమాచారం.
Author: admin
ఫీచర్ ఫోన్ మాత్రమే వినియోగించుకునే అనేక మంది వినియోగదారులకు ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఊరటనిచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. డేటా వినియోగించని వినియోగదారులకు వాయిస్ కాల్స్, ఎస్.ఎమ్.ఎస్ ల కోసం ప్రత్యేక రీఛార్జి ప్లాన్స్ తీసుకురావాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. కేవలం వాళ్లు ఉపయోగించుకునే సేవలకు మాత్రమే డబ్బు చెల్లించే విధంగా ఇది ఉపయోగపడుతుంది. డేటాతో కలిపి ఉండే రీఛార్జి ప్లాన్స్ తమకు అవసరం లేదని పలువురు వయోవృద్ధులు ఇంట్లో బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ ఉన్న వాళ్లకు ఈ నిర్ణయంతో కొంత మేర రీఛార్జి ప్లాన్స్ లో ఖర్చు తగ్గే అవకాశం ఉంది.
బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావం వలన నేడు మధ్య, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో విస్తారంగా తేలికపాటి – మోస్తరు వర్షాలుంటాయి. నేడు అర్ధరాత్రికి వర్షాలు పుంజుకోనున్నాయి. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్లల్లో నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో దీని ప్రభావం స్వల్పంగా ఉండనుంది. అయితే రేపు రాత్రి నుండి పెరిగే అవకాశం ఉంది. తమిళనాడు తీరానికి చేరువలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా స్వల్పంగా కదులుతుంది. కోస్తాంధ్ర ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల వెంబడి ఉన్న ప్రాంతాలలో ఈరోజు అర్ధరాత్రి సమయం తర్వాత చాలా వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. విజయవాడ, ఏలూరు, రాజమండ్రిలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రేపు రాత్రి…
దర్శకుడు సుకుమార్ సినిమాలు వదిలేస్తా అని సంచలన ప్రకటన చేశారు.ఇటీవల అమెరికాలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హారయ్యారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన్ను యాంకర్ సుమ ‘మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు? అని అడిగితే, సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నానని సమాధానం ఇచ్చారు.పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం ఈ ఘటన వల్ల అల్లు అర్జున్ తీవ్ర ఇబ్బందుల్లో పడటం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఇటీవల తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై పరోక్షంగా విమర్శలు చేయడంతో ఈ వివాదం తారా స్థాయికి చేరింది.ఈ ఘటన అల్లు అర్జున్‌పై ఎంత ప్రభావం చూపించాయో తెలియదు,కానీ దర్శకుడు సుకుమార్ మాత్రం వీటి వలన మానసికంగా కృంగిపోయాడని తెలుస్తోంది.ఇటీవల‘పుష్ప-2’ సక్సెస్ మీట్‌లో, మహిళ మృతి గురించి…
ఓటీటీ సబ్ స్క్రిప్షన్ సబ్‌స్క్రైబర్లు ఏకకాలంలో లాగిన్ చేయగల 10 పరికరాల సంఖ్యను తగ్గించాలని అమెజాన్ ప్రైమ్ భావిస్తోందని తెలుస్తుంది.వచ్చే సంవత్సరం నుండి దీన్ని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది.ఇకపై నుండి 5 డివైస్ లు వరకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది.ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు తమ ఖాతాలను ఏకకాలంలో 10 పరికరాల్లో యాక్సెస్ చేయవచ్చు. ఆ సంఖ్యను 5 పరికరాలకు తగ్గించాలని కంపెనీ అనుకుంటోంది.దీనికి తోడు వినియోగదారులు ఒకేసారి రెండు స్మార్ట్ టీవీలలో ప్రైమ్ వీడియో యాప్‌కి లాగిన్ అయ్యేలా మాత్రమే అనుమతించాలని భావిస్తోంది.దీనికి తగ్గట్టుగా మార్పులు చేయనుంది.వచ్చే ఏడాది అంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ రూల్స్ అప్లై కానున్నాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు ఇయర్ ప్లాన్: రూ. 1,499 (ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ఇతర ప్రయోజనాలు). 3 నెలల ప్లాన్: రూ. 599 ఒక నెల ప్లాన్: రూ. 299
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత 3 ఏళ్లుగా తీవ్ర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఉక్రెయిన్‌ను తన అధీనంలోకి తీసుకోవాలని రష్యా ప్రయత్నిస్తుండగా…రష్యా ఆగడాలకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో,నాటోలో చేరాలనే తలంపుతో ఉక్రెయిన్ యుద్ధం చేస్తోంది.ఉక్రెయిన్ నాటో దేశాల సహకారంతో రష్యాతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది.ఈ క్రమంలోనే రష్యా కూడా తన మిత్రదేశం ఉత్తర కొరియా సహకారం తీసుకుంటోంది.ఉత్తర కొరియాకు చెందిన సైన్యం ఈ యుద్ధంలో ప్రత్యక్ష పాల్గొని రష్యాకు సహకారం అందిస్తుంది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన వేలాది మంది సైన్యం ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నారు.ఉత్తర కొరియా సైన్యంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.రష్యా తరపున ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్న ఉత్తర కొరియా సైనికులు వేలాది మంది ఇప్పటికే ఈ యుద్ధంలో భారీగా గాయపడటమో లేదా చనిపోవడమో జరిగిందని తెలిపారు. కాగా మూడు వేల మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండవచ్చని జెలెన్‌స్కీ వెల్లడించారు.భారీగా…
పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో ఈ నెల 4న చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా సినీ నటుడు అల్లు అర్జున్‌కు నిన్న నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసు ఇచ్చారు.అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పీఎస్‌కు విచారణ కోసం హాజరు అవ్వనున్నారు.ఈ మేరకు చిక్కడపల్లి పీఎస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.ఆ పరిసరాల్లోకి ఆయన అభిమానులెవరూ రాకుండా చర్యలు చేపట్టారు.తన న్యాయవాది పీఎస్‌కు రానున్న అల్లు అర్జున్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు.ఇక ఇప్పటికే తన లీగల్ టీమ్ తో పోలీసుల నోటీసులపై బన్నీ చర్చించారు.తొక్కిసలాట ఘటనపై ఇటీవల పోలీసులు 10 నిమిషాల వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.దీని ఆధారంగా అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ నిర్వహించిన మీడియా సమావేశంపైనా కూడా…
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆమోదం తెలిపారు. అలాగే సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ షడంగి నియమించబడ్డారు. జస్టిస్ మిశ్రా ఇదివరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన ఈ ఏడాది జూన్ 1న పదవీవిరమణ చేశారు. తరువాత తాత్కాలిక ఛైర్ పర్సన్ గా ఎన్.హెచ్.ఆర్.సీ సభ్యురాలు విజయభారతీ సయానీ కొనసాగారు. కొత్త ఛైర్ పర్సన్ ఎంపికై ఈనెల 18న ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్ ను నియమిస్తూ తాజాగా నిర్ణయం వెలువడింది.
రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందక.. చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మరికొందరు ఇతర రంగాల వైపు మొగ్గు చూపుతున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగం తీవ్ర గడ్డు పరిస్థితి ఎదురుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరి కడుపు నింపే రైతన్నలు.. తమ కడుపు నింపుకోవడానికి మాత్రం నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం కానీ.. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కానీ రైతుల సమస్యలు పట్టించుకోకుండా కార్పొరేటర్లకు కొమ్ముకొస్తున్నాయని షర్మిల ఆరోపించారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి రైతులు మార్కెట్ యార్డుకు తెచ్చుకున్న సరుకులకు తగిన భద్రత కల్పించాలి. కౌలు రైతులను ఆదుకోవాలి.పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం రూ.20వేలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు.…
ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. వివిధ కారణాలవల్ల పరీక్ష ఫీజు చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు. ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టాము. నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించాం. వివిధ కారణాలవల్ల పరీక్ష ఫీజు చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని… pic.twitter.com/CzNxVl9NVO— Lokesh Nara (@naralokesh) December 23, 2024
