దాదాపు సంవత్సరం తర్వాత దేశవాళీ క్రికెట్ తో పునరాగమనం చేసి రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటుతున్న భారత పేసర్ షమి బోర్డర్- గావస్కర్ సిరీస్ లో మిగిలిన మ్యాచ్ లో కోసం ఆస్ట్రేలియాకు వెళ్తాడనే వార్తలొచ్చాయి. షమీ రాకతో భారత బౌలింగ్ దళం మరింత పటిష్టం అవుతుందని అభిమానులు భావిస్తున్న తరుణంలో అతను ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లడం లేదని బీసీసీఐ తెలిపింది. ఆసీస్ తో మిగతా రెండు టెస్టులకూ షమి అందుబాటులో ఉండడని బీసీసీఐ స్పష్టం చేసింది.
Author: admin
మహారాష్ట్రకు చెందిన రుద్రాంక్ష్ పాటిల్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో జూనియర్ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. తాజాగా జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ లో 254.9 పాయింట్లతో పసిడి పతకాన్ని సాధించాడు. ఈక్రమంలో చైనాకు చెందిన షెంగ్ లిహావో పేరిట ఉన్న 254.5 రికార్డును అధిగమించాడు. 251.4తో కర్ణాటకకు చెందిన అభిషేక్ శేఖర్ రజతం, 229.9తో హార్యానాకు చెందిన హిమాంశు కాంస్య పతకాలు సాధించారు. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సీనియర్ విభాగంలో సాహు తుషార్ స్వర్ణం సాధించాడు. ఫైనల్లో 252.3 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్లో తెలంగాణాకు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ (252.2) రజత పతకం గెలుచుకున్నాడు. రాజస్తాన్ కు చెందిన యశ్వర్దన్ 230 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడవ టెస్టు ముగిసిన తర్వాత సీనియర్ ఆటగాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, అతని స్థానంలో భారత జట్టు ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకుంది. ముంబయి ఆఫీస్పిన్నర్ తనుష్ కోటియన్ ను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. 26 ఏళ్ల కోటియన్ భారత్-ఎ జట్టు సభ్యుడిగా గత నెలే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఆ సిరీస్ ముగిసిన అనంతరం భారత్ కు వచ్చి ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం మరోసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. 26న బాక్సింగ్ డే టెస్టు ఆరంభానికి ముందే జట్టుతో కలవనున్నాడు. కోటియన్ ఇప్పటిదాకా 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 101 వికెట్లు తీశాడు. 1525 పరుగులు చేశాడు.
సీనియర్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైశ్వాల్, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలు. 2025 సంక్రాంతి కానుకగా ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈచిత్రం నుండి సెకండ్ సింగిల్ విడుదలైంది. ‘చిన్ని ‘చిన్ని’ అంటూ సాగే ఈ గీతానికి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. థమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. https://youtu.be/LDRdSdMzd3s?si=JtGj6IEHIQsWmlXV
విజయవాడలోని ‘ఏ ప్లస్ కన్వెన్షన్’లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున జరుగుతున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మైనారిటీల సంక్షేమానికి, భద్రతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పేదల పట్ల ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడని పేర్కొన్నారు. తాను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రీ క్రిస్మస్ వేడుకలు అన్ని జిల్లాలలో జరిపినట్లు గుర్తు చేసుకున్నారు. గడిచిన 5 ఏళ్ళలో రాష్ట్రంలో ఏం జరిగిందో చూసారని మళ్ళీ చెడు రాకుండా ఉండాలి అంటే, చెడుని గుర్తు చేసుకుంటూ ఉండాలని అన్నారు. తమ ప్రభుత్వం క్రిస్టియన్లకు అండగా ఉంటుందని ఈసందర్భంగా భరోసా ఇచ్చారు.
ప్రముఖ దర్శకులు, రచయిత, సినీ నిర్మాత శ్యామ్ బెనెగల్ నేడు కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. డిసెంబర్ 14, 1934న అప్పటి హైదరాబాద్ రాష్ట్రం, తిరుమలగిరిలో ఆయన జన్మించారు. అంకుర్: ది సీడ్లింగ్ (1974), భూమిక (1977), త్రికల్ (పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్) (1985), జునూన్ (1979), ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా, సూరజ్ కా సత్వన్ ఘోడా, మరియు నేతాజీ సుభాస్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. 18 జాతీయ చలనచిత్ర అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు, నంది అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. ఫోటోగ్రాఫర్ అయిన తన తండ్రి మార్గదర్శకత్వంలో చిన్న వయస్సులోనే సినిమాలు చేయడం ప్రారంభించాడు. హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని స్థాపించారు. మరియు 1973లో తన మొదటి చలనచిత్రం అంకుర్‌కు దర్శకత్వం వహించడానికి ముందు 900కి పైగా వాణిజ్య ప్రకటనలు మరియు అనేక డాక్యుమెంటరీలను…
అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.చాంద్రాయణగుట్టలోని CRPF గ్రూప్ సెంటర్‌లో ఈరోజు నిర్వహించిన రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి, నియామక పత్రాలు అందించారు. కేంద్ర ప్రభుత్వ రంగంలో ఖాళీలను త్వరగా భర్తీ చేస్తాం :- కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ రంగాల్లో పలు పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.హైదరాబాద్ హకీంపేటలోని NISAలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో మంత్రి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి బెనిఫిట్ షోల అంశంపై తీవ్రస్థాయిలో స్పందించారు.బెనిఫిట్ షోలు ఎవరి కోసమో చిత్ర పరిశ్రమ వర్గాలు చెప్పాలని నిలదీశారు.”సినిమా వాళ్లను,నిర్మాతల మండలిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.ఎవరి బెనిఫిట్ కోసం మీరు బెనిఫిట్ షోలు వేస్తున్నారు? ఎందుకు ప్రభుత్వం నుండి మీరు అదనంగా అనుమతులు తీసుకుంటున్నారు? మీ లాభాల కోసం ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలా?ఆ రోజు ఎన్టీ రామారావు గారు,అక్కినేని నాగేశ్వరరావు గారు బెనిఫిట్ షోలు వేసి, వాటి ద్వారా వచ్చిన డబ్బును సమాజ శ్రేయస్సు కోసం వాడేవారు.ప్రజా శ్రేయస్సు ఉద్దేశం ఉన్నప్పుడే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలి. నిర్మాతల కోసమో,డబ్బులు ఉన్నవాళ్ల కోసమే బెనిఫిట్ షోలకు అనుమతి ఎందుకివ్వాలి? అందుకే బెనిఫిట్ షోలు ఆపేయాలని నేను డిమాండ్ చేస్తున్నానని బండారు సత్యనారాయణ వ్యాఖ్యనించారు.
ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది.ఇకపై పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను, వెబ్‌కాస్టింగ్ రికార్డులను,అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. అయితే ఈ నిబంధనపై కాంగ్రెస్ మండిపడింది.ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘాతమని స్పష్టం చేసింది.కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 93(2)(ఏ)ను ఇటీవల కేంద్ర న్యాయశాఖ సవరించింది.ఈ సవరణకు ఓ కోర్టు కేసు కారణమని ఈసీతోపాటు న్యాయశాఖ వేర్వేరుగా వివరణ ఇచ్చాయి.కొత్త సవరణతో ఎలక్ట్రానిక్ రికార్డులు మినహా ఇతర పత్రాలు,డాక్యుమెంట్లు తనిఖీకి అందుబాటులో ఉంటాయి.పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ కెమెరాల తనిఖీవల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని,అందుకే నిషేధం విధించామని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.ఈ ఫుటేజ్‌ను వినియోగించుకుని కృత్రిమ మేధ ద్వారా నకిలీ వీడియోలను తయారు చేస్తున్నారని తెలిపాయి.
భారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది.ఆయనను థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం కాంబ్లీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఇటీవలే కాంబ్లీని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇచ్చారు.అయితే తాజాగా మరోసారి ఆయన ఆసుపత్రిపాలయ్యారు.కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
