కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మల్లాయపాలెం గ్రామంలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గ్రామీణ రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పరిశీలించారు. అక్టోబర్ 14 న కంకిపాడు లో జరిగిన పల్లెపండుగ కార్యక్రమంలో గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గం పరిధిలోని 44 గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థకు మరమ్మత్తులు చేపట్టి స్వచ్ఛమైన నీరు అందించాలని స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము కోరడంతో, సత్వరం చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించి, రూ. 3.8 కోట్ల నిధులు కేటాయించారు. ఫిల్టర్ బెడ్లు పూర్తిగా దెబ్బ తినడంతో పంచాయతీకి రూ. 4 లక్షల ఖర్చు చేసి ఫిల్టర్ బెడ్లు మార్పించారు. 14 గ్రామాల పరిధిలో ఫిల్టర్ బెడ్ల మార్పు ప్రక్రియ పూర్తి అయిన క్రమంలో మల్లాయపాలెం రక్షిత మంచి…
Author: admin
గత వారం నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుస నష్టాలకు బ్రేక్ చేస్తూ లాభాల బాటలో పయనించాలని. కీలక రంగాల షేర్లు రాణించడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు సూచీలు జోరు పెంచాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 498.58 పాయింట్ల లాభంతో 78,540 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 165.95 పాయింట్ల లాభంతో 23,753.45 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.13గా కొనసాగుతోంది. ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ తదితర షేర్లు లాభాలతో ట్రేడింగ్ ముగించాయి.
పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో అల్లు అర్జున్ అంశంపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అల్లు అర్జున్ వివాదం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది వాస్తవాలే అయితే,తాను కూడా ఆయనతో ఏకీభవిస్తానని చెప్పారు.ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.జైలు నుండి వచ్చాక అల్లు అర్జున్ ను చాలామంది పరామర్శించారని,బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.బెనిఫిట్ షోలకు తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలని,అల్లు అర్జున్ వెళ్లడంతోనే ఈ ఘటన జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.సెలబ్రిటీలు ఎక్కడికైనా వెళుతుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందారని చెప్పినప్పుడు,బాధ్యతగా అక్కడ్నించి వెళ్లిపోతే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి వస్తే అన్ని ఏర్పాట్లు చేస్తామని కొందరు నేతలు అన్నారు.దీనితో టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఏపీకి తరలి వెళుతుందని వార్తలు వచ్చాయి.అయితే వార్తలపై తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు.ఈ మేరకు ఈరోజు ఆ సినిమా మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగానే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆయన మాట్లాడారు.తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళుతుందనే వార్తలపై ఆయన స్పందిస్తూ…టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదన్నారు.తాను ఇక్కడే ఖరీదైన ఇల్లు కట్టుకున్నానని,ఇప్పుడు ఏపీకి వెళ్లి ఏం చేస్తానని అన్నారు.అలాగే తెలుగు చిత్రసీమకు రెండు తెలుగు రాష్ట్రాలు సమానమేనని పేర్కొన్నారు. ఇక త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ విషయంపై మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రానికైనా దేశానికైనా రాజధాని అవసరమేనని స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని అలాగే దాంతో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రజలపై భారం లేకుండా అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. గతంలో తాము తీసుకొచ్చిన పరిశ్రమలు వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లాయని మరల పరిశ్రమలు తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 15 నాటికి రాజధాని నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు వివరించారు. వైసీపీకి రాజధానిపై కక్ష తీరలేదని అందుకే విష ప్రచారం చేస్తుందని విమర్శించారు.
యువతకు తమ ప్రభుత్వం భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు ప్రధాని మోడీ అన్నారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని తెలిపారు. ప్రభుత్వం వారిలోని సామర్ధ్యాలను వినియోగించుకొని మరింత ముందుకువెళ్తుందన్నారు. దేశ చరిత్రలో ఇదొక గొప్ప రికార్డని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిజాయతీ, పారదర్శకతకు ప్రాధాన్యత నిస్తున్ననట్లు తెలిపారు. నేడు జరుగుతున్న రోజార్ మేళాలోనూ 71,000 మందికి పైగా యువతకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినట్లు వివరించారు. ఈవిధంగా ఉద్యోగాలు పొందినవారంతా అంకితభావంతో, నిజాయతీతో దేశం కోసం పని చేస్తున్నారని ఇదే విధంగా ముందుకుసాగితే 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. దేశాభివృద్ధి యువత పైనే ఆధారపడి ఉందని కానీ గత ప్రభుత్వాలు వారికి సరైన ఉపాధి కల్పించలేకపోవడంతో దేశం వెనకబడిపోయిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని దానికి అనుగుణంగా మేక్ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలను తీసుకువచ్చామన్నారు. ప్రస్తుతం భారత్…
భారత్ కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే దేశంలోని యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చ కొనసాగుతూనే ఉంది. కొంతమంది ఆయన వ్యాఖ్యలను సమర్ధిస్తుంటే కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆయన అభిప్రాయాన్ని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం విభేదించారు. సుదీర్ఘంగా పని చేయాలని చెప్పడం అర్థరహితమని అన్నారు. దానికంటే సమర్థతపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. అసమర్థమైన, నాసిరకం మౌలిక సదుపాయాలు, సౌకర్యాలతో మన రోజువారీ జీవితం ఒక పోరాటంలా సాగుతోందన్నారు. మంచి సామాజిక, సామరస్య పరిస్థితుల కోసం పని జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడమనేది చాలా ముఖ్యమని అన్నారు. వాస్తవానికి మనం వారానికి 4 రోజుల పని విధానానికి మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల కల్లా పని ముగించేలా…
ప్రకాశం జిల్లాలో వరుస భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా మూడు రోజులు నుంచి ముండ్లమూరులో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈరోజు ఉదయం 10.35 గంటల సమయంలో భూమి కంపించింది. మొన్న ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈరోజు కూడా ముండ్లమూరులో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే ప్రభుత్వం తమదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైతు బాంధవుడు, మాజీ ప్రధాని శ్రీ చౌదురీ చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని దేశం కిసాన్ దివస్ ను జరుపుకుంటున్న సందర్భంగా రైతు సోదరులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. రైతు కుటుంబాల్లో వెలుగులు నింపే విధంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం రైతులకు బాకీ పెట్టిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు డబ్బును చెల్లించాం. అంతేకాకుండా ఈ ఏడాది ధాన్యం కొనుగోలును సులభతరం చేసి 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తున్నాం. అగ్రి, ఆక్వా, హార్టికల్చర్ పంటల్లో సాంకేతికతను ప్రోత్సహించి సాగు ఖర్చులు తగ్గించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ను పునరుద్ధరించామని వివరించారు. మళ్లీ సాగునీటి…
ప్రతియేటా గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో జరిగే సాంస్కృతిక మరియు పర్యాటక కార్యక్రమం ‘రణ్ ఉత్సవ్’. ఈ ఏడాది డిసెంబర్1నుండి ప్రారంభమైన ‘రణ ఉత్సవ్’ 2025, ఫిబ్రవరి 28 వరకు జరగనుంది. అతి సుందరమైన కచ్ ప్రాంతంలోని ధోర్డో గ్రామంలో ప్రతియేటా ఘనంగా రణ్ ఉత్సవాన్ని నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో గుజరాత్ పర్యాటక శాఖ నిర్వహిస్తుంది. రణ్ ఉత్సవ్ సందర్భంగా సందర్శకులను విశేషంగా ఆకట్టుకునే విధంగా కచ్ సంస్కృతిని ప్రతిబింబించేలా ‘ధోర్డో విలేజ్’ అంటే గుడారాల గ్రామంలో అత్యాధునిక సౌకర్యాలతో కచ్ ప్రాంత గ్రామీణ వాతావరణం, అక్కడ సంస్కృతి, కళలకు అద్దంపట్టేలా తాత్కాలిక నిర్మాణాలను టెంట్ సిటీ పేరుతో ఏర్పాటు చేశారు. ఇక ఈ ఉత్సవంలో గుజరాతీ, రాజస్థానీ, మరియు ఇతర భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు, గర్బా, దాండియా సహా పలు జానపద నృత్యాలు, సంగీత కళలు , హస్తకళలు అక్కడి గ్రామీణ జీవనశైలికి నిర్మాణ శైలికి దర్పం పట్టే…
