హైదరాబాద్ లో 100 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సహాకారం అందించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ, టీడీపీ పొలిటికల్ సెక్రటరీ టీడీ జనార్దన్, ఎన్టీఆర్ లిటరేచర్ సభ్యులు మధుసూదన రాజు , తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పాలన్న సంకల్పాన్ని వివరించి, దానితోపాటు ఎన్టీఆర్ నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించి సహకరించాలని కోరగా హైదరాబాద్‌లో, ప్రత్యేకించి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో విగ్రహం ప్రతిష్టాపనకు మరియు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా స్థలం కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను సీఎంకు వారు వివరించారు. ఎన్టీఆర్…
Author: admin
పాకిస్థాన్ కు చేసిన క్షిపణుల వల్ల తమ దేశానికి కూడా ప్రమాదం ఉందని అగ్ర రాజ్యం అమెరికా తెలిపింది.బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ పాకిస్థాన్ కు చెందిన నాలుగు కీలక సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది.ఆ దేశం దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసుకోవడంపై వైట్ హౌస్ సీనియర్ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు.దక్షిణాసియా దేశాలను దాటి లక్ష్యాలను ఛేదించగల వాటితో అమెరికాకు కూడా ముప్పేనని వ్యాఖ్యానించారు.2021లో అఫ్గాన్ నుంచి అమెరికా దళాలు వైదొలిగిన తర్వాత పాక్ తో ఒకప్పటి సంబంధాలు లేవనీ అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోన్ ఫైనర్ వెల్లడించారు.
తిరుమల కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసిన సహించేది లేదని టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు హెచ్చరించారు. దీనిపై ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సంహించేదేలేదు. తిరుమల పవిత్ర క్షేత్రం. ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగింది. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా సరే ఉపేక్షించేదేలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను నియమించారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గోరంట్ల మాధవ్ ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ దృష్టి పెట్టిన గత కొన్ని రోజులుగా జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి రాకముందు అనంతపురం జిల్లాలో పోలీస్ అధికారి (సీఐ)గా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో హిందూపురం లోక్ సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్) 3 ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. ఉండవల్లిలో ఏపీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో సీడాప్ చైర్మన్ గునుపాటి దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఒప్పందాలు జరిగాయి. 2కామ్స్ గ్రూప్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సెంచూరియన్ సంస్థలతో ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్, స్వయం ఉపాధి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, అదనపు ఆదాయం కల్పించడం ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలో యువతకు రాబోయే అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పించేందుకు ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు సీడాప్ పెద్దఎత్తున స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని లోకేష్ ‘ఎక్స్’…
ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ శకంగా పిలువబడుతోంది. ప్రతి రంగంలోనూ కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతోంది. ఇక ఇటీవల కాలంలో విస్తృతంగా ప్రజాదరణ పొందిన ఓపెన్ ఏఐ-చాట్ జీపీటీ చాట్ బోట్ మరింత అందుబాటులోకి రానుంది. వాట్సాప్ లో కూడా చాట్ జీపీటీ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఓపెన్ఏఐ అందుబాటులోకి తెచ్చింది. +18002428478 నంబర్ తో వాట్సాప్ లో చాట్ చేయొచ్చు. మన ప్రశ్నలకు చాటి జీపీటీ సమాధానాలు ఇస్తుంది. భారత్ లో కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. ఇదే నంబర్కు కాల్ చేసి కూడా ఈ సేవలు పొందవచ్చు. అయితే, ప్రస్తుతానికి కాల్ సదుపాయం కేవలం అమెరికా, కెనడాకు మాత్రమే పరిమితమై ఉంది. ప్రస్తుతం చాటీపీటీ వాడేందుకు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. వాట్సప్ లో అయితే ప్రత్యేకంగా అకౌంట్ అవసరం లేదు. కానీ రోజువారీ వాడుకపై పరిమితి ఉంటుంది. భవిష్యత్తులో చాటీజీపీటీ సెర్చ్, ఇమేజ్ బెస్ట్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్…
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ-2025 విషయంలో ఏర్పడిన సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ఐసీసీ దీనికి సంబంధించి తాజాగా కీలక ప్రకటన చేసింది. బీసీసీఐ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్లోనే ఈ మెగా టోర్నీని నిర్వహించనున్నట్లు తెలిపింది. భారత్, ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలో దిగుతాయి. త్వరలో షెడ్యూల్ రానుంది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ తో పాటు, తటస్థ వేదికగా కూడా జరుగుతుందని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. ఇక నాకౌట్ మ్యాచ్ లతో పాటు భారత్ ఆడే మ్యాచ్ లు తటస్థ వేదికలలో జరుగనున్నాయి. అలాగే రెండు దేశాలు నిర్వహించే ఐసీసీ ఈవెంట్లలోని ఇరు దేశాల మ్యాచ్ లు 2027 వరకు తటస్థ వేదికలలోనే జరుగుతాయని జైషా నేతృత్వంలోని ఐసీసీ ప్రకటించింది. ఈ నిర్ణయం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న ఐసీసీ మహిళల క్రికెట్…
అంతుచిక్కని “డ్యాన్సింగ్ వైరస్”ను ఇటీవల ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో కనుగొన్నారు.కాగా ఉగాండాలో బండిబుగాయో జిల్లాలోని 300 వందల మందికి ఈ వ్యాధి సోకింది.అయితే ఈ వ్యాధికి అక్కడి వాళ్ళు “డింగా డింగా” అనే పేరు పెట్టారు.ఈ వ్యాధి లక్షణాల్లో మొదట జ్వరం,జలుబు,దగ్గు,శరీరం డ్యాన్స్ చేస్తునట్టు ఊగుతూనే ఉంటుందని తెలుస్తుంది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీ తేజ అనే చిన్నారి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.తాజాగా ఆ బాలుడి కుటుంబాన్ని దర్శకుడు సుకుమార్ పరామర్శించారు.బాబు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.అవసరం అయిన సాయం అందిస్తామని మాట ఇచ్చారు.మరోవైపు శ్రీ తేజ కుటుంబాన్ని ను ఇటీవల సుకుమార్ సతీమణి తబిత కలిశారు.రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు.పుష్ప 2 బెనిఫిట్ షో ను సంధ్య థియేటర్లో ప్రదర్శించగా అల్లు అర్జున్ ఆకడికి వెళ్ళారు.ఆయన్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.దీంతో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందింది.ఆమె తనయుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు.
కమల్ హాసన్ కథానాయకుడిగా దర్శకుడు శంకర్ రూపొందించిన చిత్రం “ఇండియన్ 2”. ఎన్నో అంచనాల మధ్య విడుదల ఆయిన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. ఈ సినిమా రిజల్ట్ పై తాజాగా శంకర్ స్పందించారు. ఆ సినిమాకు అలాంటి నెగెటివ్ రివ్యూస్ ఊహించలేదని అన్నారు. ఇండియన్ 3, గేమ్ చ్చేంజర్ అద్భుతంగా ఉంటాయని ఆయన అన్నారు. గేమ్ చేంజర్ విషయంలో తాను ఎంతో నమ్మకం తో ఉన్నానని తెలిపారు. రామ్ చరణ్ నటన చాలా బాగుందని అన్నారు. ఇండియన్ 3 థియేటర్ లోనే విడుదల చేస్తామని చెప్పారు. రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసిన గేమ్ చెంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది
