Author: admin

ప్రముఖ కాఫీ చైన్ ‘స్టార్‌బక్స్’ భారత మార్కెట్ నుండి నిష్ర్కమించబోతోందంటూ…కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్త కథనాలపై టాటా గ్రూపు సంస్థ ‘టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్’ స్పష్టత ఇచ్చింది. స్టార్‌బక్స్‌పై జరుగుతున్న ప్రచారం నిరాధారమని కొట్టిపారేసింది.ఈ మేరకు టాటా గ్రూప్ ఊహాగానాలను ఖండించింది.కాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, బీఎస్ఈ లిమిటెడ్, కలకత్తా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు నిన్న ఓ లేఖ రాసింది.కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాలను అంశాల వారీగా ఖండించింది.

Read More

మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులోని నిర్మల ఫార్మశీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఏపీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నాను. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. క్రిస్మస్ అంటే ప్రేమ, దయ, కరుణ. మనమేంటో ఇతరులకు తెలియజెప్పడం. ప్రతిఒక్కరి పట్ల ప్రేమ, శాంతిని కలిగి ఉండాలని జీసస్ బోధించారని పేర్కొన్నారు. దేవుడు మనకు అనేక పరీక్షలు పెడతాడు. వాటన్నింటిని కృషి, పట్టుదల, కఠోర శ్రమతో అధిగమించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దేవుడు ప్రతిఒక్కరికి శక్తినిస్తాడు. మన గురించి కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలని దేశానికి నువ్వేమి చేశావని గుర్తుంచుకోవాలని కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అకడమిక్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు లోకేష్ బహుమతులు…

Read More

భారత జాతీయ లోక్ దళ్ అధ్యక్షుడు,హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలా (89) కన్నుమూశారు.నిన్న రాత్రి ఆయనకు గుండె పోటురాగా,ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది అని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.మాజీ ఉపప్రధాని దేవీలాల్‌ కుమారుడైన ఓం ప్రకాశ్‌ చౌతాలా హరియాణాకు 4 సార్లు 1989 నుండి 2005 వరకు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఓం ప్రకాశ్ చౌతాలా మృతిపై హర్యానా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్ సైనీ ట్వీట్ చేశారు. ‘చౌతాలా మరణం చాలా బాధాకరమని , ఆయనకు నా నివాళులు..ఆయన తన జీవింతాంతం రాష్ట్రానికి, సమాజానికి సేవ చేశారు.ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు’ అన్నారు.ఓం ప్రకాశ్ చౌతాలా మృతి పట్ల హరియాణా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నాయకుడు మల్లీకార్జున ఖర్గే సంతాపం తెలిపారు.

Read More

భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ లో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో సమంగా కొనసాగుతున్నాయి. పెర్త్ వేదికగా జరిగిన మొదటి వెస్టులో భారత్ విజయం సాధించింది. అడిలైడ్ జరిగిన రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలుపొందింది. ఇక బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. మెల్ బోర్న్ లో బాక్సింగ్ డే టెస్టు డిసెంబరు 26-30 మధ్య జరగనుంది. ఈ సిరీస్ లో ఆఖరిదైన ఐదో టెస్టు జనవరి 3-7 మధ్య సిడ్నీలో జరగనుంది. కాగా, మిగిలిన రెండు టెస్టులకు ఆస్ట్రేలియా తమ జుట్టును ప్రకటించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మిగిలిన రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్),స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా,సామ్ కొన్స్టాస్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, బ్యూ…

Read More

తాజాగా చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం జరిగింది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘అమరన్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో తను నటనతో ఆకట్టుకున్న సాయి పల్లవి ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ‘మహారాజ’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన విజయ్ సేతుపతి ఉత్తమ నటుడుగా నిలిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ చిత్రం: అమరన్ ఉత్తమ నటుడు : విజయ్ సేతుపతి (మహారాజ) ఉత్తమ నటి: సాయిపల్లవి (అమరన్) ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సీహెచ్ సాయి (అమరన్) ఉత్తమ ఎడిటర్: ఫిలోమిన్ రాజ్ (అమరన్) రెండో ఉత్తమ చిత్రం: లబ్బర్ పందు ఉత్తమ సహాయనటుడు: దినేశ్ (లబ్బర్ పందు) ఉత్తమ సహాయనటుడు: దినేశ్ (లబ్బర్ పందు) ఉత్తమ బాలనటుడు: పొన్వెల్ (వాళై) ఉత్తమ సహాయనటి: దుషారా విజయన్…

Read More

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్.ఇందులో రష్మిక మందాన కథానాయికగా నటించింది.ఇందులోనే స్పెషల్ సాంగ్ కోసం నటి శ్రీలీల ఆడిపాడిన విషయం తెలిసిందే.’కిస్ కిస్ కిస్ కిస్సిక్’ అంటూ సాగే ఈ పాటకు యువతలో విశేష ఆదరణ లభించింది.ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘కిస్సిక్’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసింది.అల్లు అర్జున్, శ్రీలీల డ్యాన్స్ యువతను కట్టిపడేసింది.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు.గాయని సుభాషిణి ఈ పాటని ఆలపించారు. https://youtu.be/3C1n5lqGdmY?si=65ABf1slaO9VjODn

Read More

పార్లమెంటులో నిన్న తోపులాట జరిగిన నేపథ్యంలో తీవ్ర కలకలం రేపుతోంది.లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు,కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది.పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ తోయడం వల్లే తమ ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారని బీజేపీ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సహచర ఎంపీలపై దాడి చేసేందుకు రాహుల్‌కు ఏ చట్టం అధికారం ఇచ్చిందని నిలదీశారు.ఇతర ఎంపీలను కొట్టడానికే కరాటే, కుంగ్ ఫూ నేర్చుకున్నారా.?’ అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు.ఈ మేరకు రాహుల్ గాంధీపై…దాడి,ప్రేరేపణపై ఫిర్యాదు చేసినట్లు బీజేపీ ఎంపీలు తెలిపారు.ఆయనపై సెక్షన్ 109,115,117,125,131,351 కింద ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.సెక్షన్ 109 హత్యాయత్నం అని పేర్కొన్నారు.ఈ ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి,ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారు.వీరిని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.ప్రధాని నరేంద్రమోదీ వీరిని ఫోన్‌లో పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Read More

రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్ ను ఆ పదవి నుండి తొలగించేందుకు ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసు తిరస్కరణకు గురయింది. ఈ నోటీసును తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ వైస్ చైర్మన్‌ హరివంశ్ నారాయ‌ణ సింగ్ రాజ్య‌సభలో ప్రకటించారు. ఇటీవల పార్లమెంటులో రాజ్యసభ ఛైర్మన్ గా ఉన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన పక్షపాత ధోరణిలో వ్యవహారిస్తున్నారని ఆరోపించింది.

Read More

హిందువులు వివాహ వ్యవస్థను పవిత్రమైనదిగా భావిస్తారని అత్యున్నత న్యయస్థానమైన సుప్రీంకోర్టు పేర్కొంది.అది వ్యాపార సాధనం కాదని తెలిపింది.ప్రభుత్వాలు కఠినమైన చట్ట నిబంధనలను రూపొందించింది మహిళల సంక్షేమం కోసమేనని, భర్తలను వేధించి,బెదిరించి,ఆస్తిని దండుకోవడానికి ధర్మాసనo స్పష్టం చేసింది.భార్యను క్రూరంగా హింసించారని,వేధింపులకు గురిచేశారని,అత్యాచారం చేశారనే ఆరోపణలన్నింటినీ ప్యాకేజీగా కూర్చి నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ల ప్రకారం భర్త,అతని కుటుంబ సభ్యులపై కేసులు పెడుతున్నారని వెల్లడించింది.తీవ్ర మనస్పర్థలతో విడివిడిగా నివసిస్తోన్న దంపతుల వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.ఈ కేసులో భార్యకు శాశ్వత భరణం కింద రూ.12 కోట్లను నెలలోగా చెల్లించా భర్తను ఆదేశించింది.అతనిపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసింది.

Read More

భారత్ కు చెందిన ఒక సంస్థ పై అమెరికా ఆంక్షలు విధించింది.ఇరానియన్ పెట్రోలియం,పెట్రో కెమికల్స్ కలిసి వ్యాపారం చేస్తోందని ఆరోపిస్తూ అట్లాంటిక్ నావిగేషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ పై ఆంక్షలు విధించిన అగ్రరాజ్యం.ఇరాన్ కు బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుస్తున్న నాలుగు సంస్థలు, మూడు నౌకలపై ఆంక్షలు విధించామని యూఎస్ ట్రెజరీ శాఖ పేర్కొంది.ఇరాన్ తన అణు కార్యక్రమం అభివృద్ధికి,ఆయుధ వ్యవస్థల విస్తరణకు,ప్రాక్సీలకు మద్దతు ఇవ్వడానికి నౌకలు, కంపెనీలపై ఆధారపడుతోందని వ్యాఖ్యానించారు.

Read More