Author: admin

పెనమలూరు నియోజకవర్గం, ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రజల నుండి వస్తున్న ఎక్కువగా వస్తున్న భూ సమస్యల గురించి సీఎం మాట్లాడారు. వైసిపి పాలనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ , 22a వంటి వాటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందరి సమస్యలు పరిష్కరిస్తామని ఈసందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు. ప్రజల భూములకి రక్షణ ఇవ్వటానికి, ఇచ్చిన హామీ ప్రకారం మొదటి క్యాబినెట్ లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసినట్లు వివరించారు.ప్రజలు తమను93 శాతం గెలిపించారని వారి ఆశలు నెరవేర్చే పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 3 లక్షల మంది పాల్గొన్నారని 95,200 పిటిషన్లు వచ్చాయని పేర్కొన్నారు. జనవరి 9 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. మన భూములు దోచుకోవటానికి, గత ప్రభుత్వం…

Read More

1998లో శాంతికాముక నగరమైన కోయంబత్తూర్‌లో 58 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఒక ఉగ్రవాదిని కీర్తించడాన్ని ఖండిస్తూ ర్యాలీ నిర్వహించినందుకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కుప్ప స్వామితో పాటుగా మరికొందరి బీజేపీ నాయకులను & కార్యకర్తలను అరెస్టు చేశారు.ఈ మేరకు డీఎంకే ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్యను ఖండిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది.మా కార్యకర్తలు ఇలాంటి నిరంకుశత్వానికి ఎప్పటికీ తలవంచరని,తాము తమిళనాడు ప్రజల గొంతుకగా ఉంటామని డీఎంకే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. View this post on Instagram A post shared by K. Annamalai (@annamalai_kuppusamy)

Read More

ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఈ మధ్య కాలంలో క్లిక్ బిట్స్.. తప్పుడు థంబ్ నైల్స్ ఎక్కువ వాడుతున్నారు. వీడియోలో ఉండే కంటెంట్ కి దాని పై ఉండే థంబ్ నైల్స్ కు అసలు సంబంధమే ఉండదు. దీనివల్ల తమ టైం వేస్ట్ అవుతుందని చాలా మంది వ్యూవర్స్ ఫీల్ అవుతున్నారు. అదీకాక ఈ ప్లాట్ ఫారం పై విశ్వాసం తగ్గిపోతుంది. దీంతో యూట్యూబ్ చర్యలకు సిద్ధమైంది. ఇకపై ఇలాంటి తప్పుడు థంబ్ నైల్స్ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. అలాగే కొత్త రూల్స్ కూడా ప్రవేశపెట్టనుంది.

Read More

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అద్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు ఊరట లభించింది.ఈ మేరకు 10 రోజుల వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ ను హైకోర్టు ఆదేశించింది.ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ… కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం,ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.

Read More

హిందువులు ఇతర మైనారిటీలపై ఇటీవల బంగ్లాదేశ్, పాకిస్థాన్ లో జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో షేక్ హాసీనా ప్రభుత్వం కూలిపోవడం ఆమె దేశం విడిచి వెళ్లడం తదనంతర పరిణామాలతో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే 2200 కేసులు నమోదైనట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు పాకిస్థాన్ లో కూడా 112 కేసులు నమోదైనట్లు రాజ్యసభకు తెలిపింది. ఈ రెండు దేశాలలో తప్ప మరే పొరుగు దేశంలో హిందువులపై హింసాత్మక దాడులు నమోదవలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పించేందుకు బంగ్లాదేశ్ తగిన చర్యలన్నీ తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. దౌత్యమార్గాల ద్వారా ఆయా ప్రభుత్వాలతో తమ ఆందోళన తెలిపినట్లు వెల్లడించింది. పాకిస్థాన్ కు కూడా మతపరమైన హింస, మైనారిటీ…

Read More

ఈ వారాంతాన్ని దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగించాయి. దీంతో వరుసగా ఐదురోజుల పాటు నష్టాలతోనే ట్రేడింగ్ ముగించినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. ఈవారంలో దాదాపుగా సెన్సెక్స్ 4 వేల పాయింట్ల వరకు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీ.ఎస్.ఈ లో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.9 లక్షల కోట్లు ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1176 పాయింట్ల నష్టంతో 78,041 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 364 పాయింట్ల నష్టంతో 23,587 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.15గా కొనసాగుతోంది. నెస్లే ఇండియా, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి.

Read More

నేడు మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలం, పనసభద్ర పంచాయతీలో జరిగే అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇకపై గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదు అనే లక్ష్యంతో 55 గిరిజన ప్రాంతాలను కలిపేలా, 3,782 మంది గిరిజనులు కష్టాలు తీర్చేలా, రూ.36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ మేర రహదారుల నిర్మాణం ప్రభుత్వం చేపట్టనుంది. ఇక ఈ పర్యటనలో పవన్ బాగుజోల నుంచి చిలకల మండంగి వైపు కొండపైకి నడుచుకొంటూ వెళ్ళారు. అక్కడి గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గిరిజన ప్రజలందరికీ, మన్యం ప్రాంతం ప్రజలందరి కోసం అహర్నిశలు ఎండనకా, వాననకా కష్టపడటానికి సంసిద్ధంగా ఉన్నామని కూటమి ప్రభుత్వం తరఫున మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రుషికొండ ప్యాలెస్ కి 500 కోట్లు ఖర్చుపెట్టారు కానీ.మన గిరిజన ప్రాంతం బాగుజోలలో 9.50 కోట్లతో రోడ్లు వేయలేకపోయారని గత వైసీపీ…

Read More

యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల కథానాయకుడిగా ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఫిల్మ్ ‘మోగ్లీ’. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ,శ్రీకాంత్ ఓదెల అతిధులుగా హాజరయ్యారు.సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి క్లాప్ కొట్టగా..శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచ్చాన్‌ చేశారు.వచ్చే నెలలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.ఇందులో సాక్షి సాగర్‌ మదోల్కర్‌ కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ విడుదల రానుంది.కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ బ్యాంక్ శుభవార్త తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది.ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశం నిన్న జరిగింది.ఈ సమావేశంలో అమరావతి నిర్మాణానికి 800 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.ఏపీ రాజధాని అమరావతికి ఇప్పటికే ఏడీబీ 788 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌‌‌లో ప్రకటన చేసింది. ప్రపంచ బ్యాంక్,ఏడీబీల ద్వారా నిధులు సమకూరుస్తామని తెలిపింది.ఈ రెండు సంస్థల ద్వారా 1588 మిలియన్ డాలర్ల నిధులు సమకూరుస్తామని పేర్కొంది.ఈ మేరకు భారత ప్రభుత్వ సిఫార్సుతో రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది.

Read More

పెనమలూరు నియోజకవర్గం, గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును సీఎం చంద్రబాబు పరిశీలించారు. రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ళలో రైతుల సమస్యల పరిష్కారానికి నేరుగా సీఎం రంగంలోకి దిగారు. గంగూరులో రైతు సేవాకేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి, ఆ పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును తనిఖీ చేసారు. సిబ్బంది, రైతులు, అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అన్నారు. తేమశాతం నిర్ధరణ చేసే మిషన్ పనితనంపై ఆరా తీశారు. సిబ్బంది, రైతులు, అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుండి తానే అభిప్రాయాలు సేకరిస్తానని అన్నారు. రైతులకు ఐవీఆర్ఎస్ పై స్వయంగా అవగాహన కల్పించారు. దాని ద్వారా ఫీడ్ బ్యాక్ పంపాలని సూచించారు. రైతులకు సేవ…

Read More