గత వైసీపీ ప్రభుత్వం పాలన వల్ల ఏపీ ఫైబర్ నెట్ ప్రస్తుతం దివాళా అంచున ఉందని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీ.వీ.రెడ్డి విమర్శించారు. దర్శకుడు రాంగోపాల్ వర్మకు అప్పటి అధికారులు అక్రమంగా రూ.2.10కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరకు ఇంటర్నెట్ సేవలు పొందాలనేదే లక్ష్యంగా 2016లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారని తెలిపారు. 2019 నాటికి 24వేల కి.మీ కేబుల్ వేసి 10లక్షల కనెక్షన్లు ఇచ్చినట్లు వివరించారు. అయితే నేడు ఆ సంఖ్య 5లక్షలకు పడిపోయిందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ లో అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని అన్నారు. గత ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లను వేధింపులకు గురిచేసిందని అప్పటి ఎండీ మధుసూదన్ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ నేతల అక్రమాలు బయటపడకుండా కీలక దస్త్రాలు మార్చేశారు. కీలక డాక్యుమెంట్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఓ మహిళా ఉద్యోగి…
Author: admin
పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, నేడు పార్లమెంటు ఆవరణలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ ను అవమానించిదని అధికార పార్టీ కూడా నిరసనలు చేపట్టింది. ఇందులోభాగంగా పార్లమెంట్ లోపలకి వస్తున్న అధికార పక్షం ఎంపీలను ప్రతిపక్ష నేతలు అడ్డుకున్నారు. ఈక్రమంలో ఒడిశా ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి గాయపడ్డారు. అధికార పక్షం ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కిందపడ్డారు. దీంతో ఆయన తలకు స్వల్ప గాయమైంది . దీంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా.. రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని ఆయన వచ్చి తనపై పడటంతో కిందపడ్డానని పేర్కొన్నారు.…
ప్రస్తుతం సూపర్ ఫామ్ లో కొనసాగుతున్న భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంథాన టీ20 క్రికెట్ లో మరో రికార్డుకు చేరువలో ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సెంచరీ సాధించిన ఆమె వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో రెండు హాఫ్ సెంచరీలు చేసింది. మరో 34 పరుగులు చేస్తే టీ20లలో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు నెలకొల్పనుంది. నేడు వెస్టిండీస్ తో జరుగనున్న మూడో టీ20లో ఆమె ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. చమరి ఆటపట్టు 2024లో 21 మ్యాచ్ లలో 720 పరుగులతో ముందుంది. ఇషా ఓజా 20 మ్యాచ్ లలో 711 పరుగులు. హేలీ మ్యాథ్యూస్ 14 మ్యాచ్ లలో 700 పరుగులు. కనిషా 27 మ్యాచ్ లలో 696 పరుగులు చేసింది. స్మృతి మంథాన 22 మ్యాచ్ లలో 686 పరుగులతో తర్వాత స్థానంలో…
ప్రమాదకరమైన మంకీ ఫాక్స్ కేసులు దేశాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో తాజాగా రెండు కేసులు నమోదు అయ్యాయి. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఆ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. వీరికి అవసరం అయిన చికిత్స అందిస్తున్నారు. వీరితో కాంటాక్ట్ లో ఉన్నవారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం ఆయ్యారు.
నరసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు.ఈ సినిమా కోసం మోక్షజ్ఞ సన్నద్ధం అవుతున్నారు.ఇదిలా ఉండగా…ఈ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి.ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేశారని అందుకే ఈ చిత్రం నిలిపివేయాలని టీమ్ భావించిందని ఈరోజు జోరుగా ప్రచారం జరిగింది.దీనిపై తాజాగా చిత్ర బృందం స్పందించింది.ఆయా కథనాల్లో నిజం లేదని చెప్పింది.ఇలాంటి వార్తలు నమ్మ వద్దని పేర్కొంది.సరైన సమయంలో సినిమా ప్రారంభం కానుందని చెప్పింది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని బండి సంజయ్ కలిశారు.సీఆర్ఐఎఫ్ కింద రూ.224 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు.అలాగే మానేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు.ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు.బండి సంజయ్ విజ్ఞప్తి పై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
రెబెల్ స్టార్ ప్రభాస్ కథనాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాజాసాబ్.ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రం టీజర్ విడుదల విషయంలో వస్తున్న వార్తలపై తాజాగా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.అందులో నిజం లేదని తేల్చి చెప్పింది.క్రిస్మస్ లేదా న్యూయర్ కి టీజర్ విడుదల చేస్తామని చెప్పింది. 80 శాతం షూట్ పూర్తి అయిందని చెప్పింది.సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమా నిర్మితం అవుతుంది.వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
ఓ అవినీతి కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజినీ కి ఎదురు దెబ్బ తగిలింది.గతంలో ఓ అవినీతి కేసులో ట్రయల్ కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది.ఈ తీర్పును సవాలు చేస్తూ తాజాగా ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానం సంప్రదించారు.తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఆయన్ని దోషిగా పరిగణించింది.ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.2007 -12 మధ్య కాలంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. తాజాగా ఆయనపై ఎలాంటి తీర్పు రావడం అక్కడి ప్రజలను షాక్ కు గురి చేసింది
తాజాగా ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల్లో ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు ‘ దీపిక ’ అభ్యుదయ వ్యాస సంపూటికి గాను పురస్కారం దక్కింది. పల్నాడు జిల్లా చెరువుకొమ్ముపాలెంకు చెందిన శ్రీ పెనుకొండ లక్ష్మీనారాయణ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ పురస్కారం పొందిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకోబోతున్న ప్రముఖ రచయిత శ్రీ పెనుకొండ లక్ష్మీనారాయణకు అభినందనలు. ఆయన రచించిన ‘దీపిక’ అభ్యుదయ వ్యాస సంపుటికి సాహితీ విమర్శ క్యాటగిరిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషకరం. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన ఆయనకు మరొక్కమారు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
అల్లు అర్జున్ – రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప 2 ది రూల్. సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అతి తక్కువ రోజుల్లో 1200 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి పుష్ప రాజ్ ఫుల్ వీడియో సాంగ్ విడుదల అయింది. అల్లు అర్జున్ మనేరిజమ్స్, పుష్ప రాజ్ హుక్ స్టెప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. https://youtu.be/wQksDYahKZs?si=SbnGpEuUn4FqcZIl
