ఫార్ములా-ఈ కార్ రేస్‌లో మాజీ మంత్రి,టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైంది.దీనిపై ఆయన తాజాగా స్పందించారు. ‘‘ఫార్ములా-ఈ రేస్‌లో కుంభకోణం జరిగిందని అంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి. ఫార్ములా-ఈ కార్ రేస్‌పై అన్ని వాస్తవాలు వివరిస్తా’’ అని అసెంబ్లీలో ప్రకటించారు.ఫార్ములా-ఈ కార్ రేస్‌కు సంబంధించిన కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Author: admin
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా, ఈసమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిర్ణయించారు. హడ్కో ద్వారా రూ.11వేల కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతి. రాష్ట్రంలోని 475 జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం. 1.41 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. జర్మనీకి చెందిన కేఎఫ్ డబ్ల్యూ ద్వారా రూ.5వేల కోట్ల రుణానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 45 పనులకు రూ.33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్డీఏకు అనుమతి. బుడమేరు, పది జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్కు ఆమోదం. ధాన్యం కొనుగోలు కోసం మార్కెఫెడ్…
కీర్తి సురేష్ – వరుణ్ ధావన్ జంటగా నటించిన చిత్రం బేబీ జాన్. ఖమలేష్ దర్శకుడు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో పుష్ప 3 ది రూల్ కి బేబీ జాన్ పోటీ అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా అట్లీ స్పందించారు.అలాంటిది ఏమి లేదని తెలిపారు.ఈ సినిమా విషయం అయ్యి గతంలో తాను అల్లు అర్జుతో మాట్లాడానని చెప్పారు.
మహిళలు సున్నితమైన మనుషులని ఇరాన్ సుప్రీం లీడర్ అయేతుల్లా అలీ ఖమేణి పేర్కొన్నారు.వాళ్ళు పువ్వులతో సమానం అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.వారేమీ పనిమనుషులు కాదని తెలిపారు.ఇదిలా ఉండగా ఖమేని పాలనలో తమ హక్కుల కోసం మహిళలు రోడ్డెక్కరు.తమ హక్కులు కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారు.హైజబ్ చట్టాలను వ్యతిరేకించిన వైనం.ఈ సమయంలో ఖామేని ఇలాంటి పోస్ట్ పెట్టడం వైరల్ అయింది.
ఎలక్ట్రానిక్ వెహికల్ మార్కెట్ భారత్ లో 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ పరిశ్రమ వేగంగా ప్రగతి సాధిస్తోందని తెలిపారు. ఆయన నేడు “ఈవీఎక్స్ పో 2024′ లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈవీ రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం ప్రతి సంవత్సరం రూ.22 లక్షల కోట్లు పెట్టిన ఇంధనాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఇది ఆర్థికంగా చాలా సవాలుతో కూడుకున్నదని అందువల్లనే దేశీయంగా హైడ్రో పవర్, సోలార్ పవర్, గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీదారులు నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని స్పష్టం చేశారు. దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల కొరత ఉందని లక్ష బస్సులు అవసరమైతే 50 వేల బస్సులు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగం విస్తరించేందుకు ఇది…
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేటి ట్రేడింగ్ లో భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల నిర్ణయాల నేపథ్యంలో సూచీలు ఒడిదుడుకులు చూశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 964 పాయింట్ల నష్టంతో 79,218 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 247 పాయింట్ల నష్టంతో 23,951 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.15గా కొనసాగుతోంది. సన్ ఫార్మా , పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందుస్థాన్ యూనీలివర్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె నేడు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐటీ రంగంలోనూ మహిళలు రాణించడం సంతోషకరమన్నారు. విజన్ తో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబే తనకు స్ఫూర్తి అన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవాళ్లని ఆ తర్వాత పరిస్థితులు మారాయని ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారన్నారు. మహిళలు స్వతంత్రంగా బ్రతకాలని, ఆర్ధికంగా ఎదగాలని చంద్రబాబు డ్వాక్రా సంఘాలు పెట్టారని చెప్పారు. డ్రగ్స్, గంజాయి జోలికి యువత పోవొద్దని బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. మహిళలు పట్టుదల,ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలని అన్నారు.వ్యక్తిగత పట్టుదలతో, క్రమశిక్షణతో…
అంబేడ్కర్ ను ఉద్దేశించి కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పై కోలీవుడ్ నటుడు,తమిళగ వెట్రి కళగం అధినేత జోసఫ్ విజయ్ కౌంటర్ ఇచ్చారు.అంబేద్కర్ పేరు వింటే కొందరికి అలర్జీ అని అన్నారు.ఆయన సాటిలేని రాజకీయ మేధావి అని కొనియాడారు.స్వేచ్ఛా వాయువులు పీల్చిన భారత ప్రజలందరూ ఆయన్ని గౌరవించాలని విజయ్ తేలిపారు.అంబేడ్కర్ పేరు వింటే మనసు,పెదవులకు సంతోషంగా ఉంటుంది.ఆయనను అవమానించడాన్ని సహించబోమంటూ ట్విట్టర్ వేడుకగా పోస్ట్ పెట్టారు.కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్…ప్రజా సేవలో భాగం కావాలనే ఉద్దేశంతో తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించారు.
ఈరోజు పార్లమెంట్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షం తప్పుబట్టింది.అయితే ప్రతిపక్షం అంబేద్కర్ ను తక్కువ చేస్తున్నారని అధికార పక్షం పేర్కొంది.అధికార,ప్రతిపక్షాలు నిరసలతో పార్లమెంట్ వద్ద ఘర్షణ వాతావరణం తలెత్తింది.అయితే ఈ క్రమంలో పార్లమెంటులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఒకరినొకరు అడ్డగించుకున్నారు.ఈ మేరకు ఒడిశాకు చెందిన ఓ బీజేపీ ఎంపీ క్రిందపడిపోగా..ఆయన తలకు గాయాలు అయ్యాయి.బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్లపై నుండి కింద పడిపోయారు. దీంతో ఆయన తలకు దెబ్బ తగిలి రక్తం వచ్చింది. ఇది గుర్తించిన నేతలు ఆయనను ఓ చోట కూర్చోబెట్టి…చికిత్స చేయించే ప్రయత్నం చేశారు. ఆయనను రాహుల్ గాంధీ నెట్టేశారని ప్రతాప్ చంద్ర సారంగి చెప్పారు.
గాంధీజీ భారతదేశాన్ని విదేశీ అణచివేత నుండి విముక్తి చేస్తే డాక్టర్ అంబేద్కర్ దేశంలోని సామాజిక అన్యాయాల నుండి విముక్తి కల్పించేందుకు కృషి చేశారని నటుడు, ఎమ్.ఎన్.ఎమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ అన్నారు. అంబేద్కర్ ను మీరు కించ పరిచారంటే మీరు కించపరిచారు అంటూ అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా నిరసనలు చేస్తున్న నేపథ్యంలో కమల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంబేద్కర్ ఆలోచనలు ఆధునిక భారతదేశ నిర్మాణానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. బాబాసాహెబ్ యొక్క స్వేచ్ఛా మరియు న్యాయమైన భారతదేశం గురించి గర్వంగా విశ్వసించే మరియు పోరాడే ప్రతి భారతీయుడు, గొప్ప వ్యక్తి యొక్క వారసత్వాన్ని కించపరచడాన్ని ఎప్పటికీ సహించరని పేర్కొన్నారు. ఆధునిక మరియు నైతిక ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుతున్న వేళ మన రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంటులోని గౌరవనీయమైన సభల్లో అర్ధవంతమైన చర్చ జరగాలని అలాగే అంబేద్కర్ ఆలోచనలను స్మరించుకోవాలని పేర్కొన్నారు.
