పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే ఈ కీలక ప్రాజెక్టును ఆయన నేడు సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిపై అధికారులు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు వలన 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందన్నారు. 23 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, 2025 జనవరి 2 నుంచి మొదలు పెడుతున్నామని తెలిపారు. పోలవరం అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లని మరోసారి స్పష్టం చేశారు. బహూళార్దసాధక ప్రాజెక్టు పోలవరం అని పేర్కొన్నారు. రాష్ట్రమంతటికీ ఈ ప్రాజెక్టు వలన ఉపయోగం ఉంటుందని వివరించారు. తమ హాయాంలో గణనీయంగా పనులు జరిగాయని వైసీపీ హాయాంలో ప్రాజెక్టు…
Author: admin
రెబెల్ స్టార్ ప్రభాస్‌కు గాయమైనట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ఆయన నటించిన ‘కల్కి 2898ఏడీ’ జపాన్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన జపాన్ వెళ్లాలనుకున్నారు. అయితే గాయం కారణాన్ని తన టూర్ రద్దు చేసుకున్నానని అన్నారు.‘‘నన్ను నా సినిమాలను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.ఎప్పటి నుండో జపాన్ రావాలని నేను అనుకుంటున్నా…తన తదుపరి సినిమా చిత్రీకరణలో నా కాలుకు గాయమైంది.అందువల్ల కల్కి ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటున్నా…త్వరలోనే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నా’’ అని తెలిపారు.నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ నెలలో విడుదలైంది. ఘన విజయాన్ని అందుకుంది.జనవరి 3న ఈ సినిమా జపాన్‌లో విడుదల కానుంది.
దర్శకుడు అట్లీని హిందీ కమెడియన్ కపిల్ శర్మ అవమానించేలా వ్యాఖ్యానించారు. తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్న దర్శకుడిని లుక్ విషయంలో విమర్శలు చేశాడు. దీనిపై దర్శకుడు స్పందించాడు. ‘‘టాలెంట్ ఉన్నప్పుడు ఎలా ఉన్నామనేది విషయం కాదు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కు నేను కృతజ్ఞతలు చెప్పాలి. తొలిసారి కథతో ఆయన వద్దకు వెళ్లగా ఆయన నా స్క్రిప్ట్ ఇష్టపడి సినిమా ప్రొడ్యూస్ చేశారు. నా లుక్ గురించి ఆయన ఏమీ ఆలోచించలేదు’’ అని బదులిచ్చారు. తీవ్ర చర్చకు దారి తీసిన ఈ విషయంపై నెటిజన్లు కపిల్‌ను తప్పుబడుతున్నారు. కమెడియన్‌ను తిడుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 445 పరుగులు చేసింది. మూడో రోజు 405-7 ఓవర్ నైట్ స్కోర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ మరో 40 పరుగులు చేసి ఆలౌటయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ పేలవంగా ఆడుతోంది. యశస్వీ జైశ్వాల్ (4), శుభ్ మాన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (3), రిషబ్ పంత్ (9) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. కే.ఎల్.రాహుల్ 33 బ్యాటింగ్ రోహిత్ శర్మ 0 నాటౌట్ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు, పాట్ కమ్మిన్స్, హేజల్ వుడ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. భారత్ ఇంకా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే కీలక పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నేడు సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిపై అధికారులు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పునరావసం పరిహారానికి సంబంధించి స్పష్టత లభించే అవకాశాలున్నాయి. నిర్మాణం ఎప్పటికి పూర్తి చేయాలనుకునే అంశంపైనా కీలక ప్రకటన ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇటీవల కొత్తగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభలో ఛైర్మన్ జగదీప్ ధన్కర్ వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు గాను తెలుగు దేశం పార్టీ నుండి సానా సతీష్, బీద మస్తాన్ రావు, బీజేపీ నుండి ఆర్. కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.
విజన్ 2047 పేరుతో చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ దశ – దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలని ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారు. పూర్తిగా అటకెక్కించారని మండిపడ్డారు. ఏపీకి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమే. హోదాతోనే రాష్ట్రానికి విజన్. మోడీ పిలక మీ చేతుల్లో ఉంది. విభజన హామీలపై ప్రధానిని నిలదీయండి. కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించాలని సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో అనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. నూతన రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. బుందేల్ ఖండ్ తరహాలో వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక…
ఆస్ట్రేలియాతో సిరీస్ లో పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన భారత మహిళా క్రికెట్ జట్టు తాజాగా వెస్టిండీస్ తో ప్రారంభమైన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ మొదటి మ్యాచ్ లో అదరగొట్టి శుభారంభం చేశారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. వెస్టిండీస్ పై భారత్ కు ఇదే అత్యధిక స్కోరు. జెమీమా రోడ్రిగ్స్ 73 (35; 9×4, 2×6), స్మృతి మంథాన 54 (33; 7×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్ లతో రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. డాటిన్ 52 (28; 4×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించింది. క్వినా జోసెఫ్ 49 (33; 5×4, 3×6) పోరాటం కనబరిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ,…
జూనియర్ మహిళల ఆసియా కప్ హకీ టోర్నీలో విజేతగా మరోసారి డిఫెండింగ్ చాంపియన్ భారత్ నిలిచింది. తాజాగా జరిగిన ఫైనల్ లో చైనాపై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరొక గోల్ 1-1 తోచేసి సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ షూటౌట్ కి వెళ్లింది. షూటౌట్ లో భారత్ నాలుగు గోల్స్ చేయగా చైనా రెండు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 4-2తో ట్రోఫీ కైవసం చేసుకుంది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఫోన్ కాల్ లో మాట్లాడుకున్నారు.గాజా యుద్ధం, సిరియా లోని పరిస్థితుల గురించి వీరి మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది.గాజా యుద్ధం, సిరియాపై తమ వైఖరి గురించి చర్చించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మీడియా కు తెలిపారు.లెబనాన్లో హెజ్ బొల్లా బలోపేతం కాకుండా చేయడం, హమాస్తో సంఘర్షణ తదితర విషయాల గురించి కూడా చర్చించుకున్నట్లు వెల్లడించారు. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసిన విషయం తెలిసింది.ఆ దాడిలో 1200 మంది మృతి చెందారు.250 మందిని హమాస్ బంధించింది.అందులో 100 మంది ఇంకా వారి చెరలోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.దీనిపై ఇటీవల ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.బందీలను వదలకపోతే ఊరుకోనని.. చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాల చూపిస్తానని హెచ్చరించారు.
