సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీ తేజ అనే బాలుడు గురించి అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు.ఆతడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా…ప్రస్తుతం అతడిని కలవలేక పోతున్నా…త్వరలో ఆ కుటుంబాన్ని కలుస్తాను.ఆ కుటుంబానికి సాయం చేస్తాను…ఇచ్చిన మాట పై నిలబడతానని పేర్కొన్నారు.పుష్ప 2 బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ ఈ నెల నాలుగవ తేదీన సంధ్య థియేటర్ కు వెళ్లిన విషయం తెలిసిందే.ఆయన్ని చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది.ఇందులో రేవతి అనే మహిళ కన్నుమూశారు.ఆమె తనయుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు.ప్రస్తుతం ఆతడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.ఈ విషయంలో ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు ఆయ్యారు.బెయిల్ పై ఆయన బయటకు వచ్చారు.
Author: admin
నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్.ఈ షో తాజా సీజన్ ఆదివారంతో పూర్తి అయింది.సీరియల్ ఆర్టిస్ట్ నిఖిల్ ఈ సీజన్ విజేతగా నిలిచారు.గ్రాండ్ ఫినాలే కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విజేతకు బిగ్ బాస్ ట్రోఫీ తో పాటు రూ.55 లక్షలు క్యాష్ ప్రైజ్ అందించారు.ఈ విజయంపై నిఖిల్ ఆనందం వ్యక్తం చేశాడు.ఈ జర్నీలో తనకు సపోర్ట్ గా నిలిచిన వారికి ధన్యవాదాలు చెప్పాడు.చివరి వరకు గౌతం గట్టి పోటీ ఇచ్చారు.ఆయన రన్నర్ అప్ గా నిలిచారు. గౌతం ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే
సుప్రసిద్ధ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోలోని హాస్పిటల్స్ చేరారు. చికిత్స పొందుతూనే ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తబలా మ్యాస్ట్రోగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిచెందారు. జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడే జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుండే తండి బాటలో నడిచారు. *తొలి సంగీత కచేరీ ఎప్పుడు ఇచ్చారంటే?* జాకీర్ హుస్సేన్ 11 ఏళ్ల వయసులోనే అమెరికాలో తొలి సంగీత కచేరీ ఇచ్చారు. తన ప్రస్థానంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పౌర పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆయన కెరీర్లో 5 గ్రామీ అవార్డులు అందుకున్నారు. ‘వాహ్ తాజ్’ యాడ్ తో ఎందరికో సుపరిచితుడు తబలా వాయిద్య కారుడు జాకీర్ హుస్సేన్ అనగానే 90ల్లో చేసిన…
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నీ.వీ.సింధు ఆమె తండ్రి శ్రీ పి.వి. రమణ గారితో కలిసి నేటి సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. తాజాగా ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయి – సింధు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ఫొటోను సింధు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.’ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి’ అనీ పేర్కొన్నారు. కాగా, ఈ జంట ఈ నెల 22న రాజస్థాన్‌లో పెళ్లి చేసుకోనున్నారు.
అల్లు అర్జున్ నేడు కుటుంబ సభ్యులతో కలిసి తన మామయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన అల్లు అర్జున్ పై కేసు నమోదు, అరెస్టు తదితర పరిణామాలు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీ అభిమానుల్లో సంతోషం కలిగించింది. అర్జున్ అరెస్టు అయి విడుదలైన తర్వాత చిరంజీవి సతీమణి అర్జున్ మేనత్త సురేఖ అర్జున్ ని కలిసి భావోద్వేగానికి లోనయ్యారు. అంతకు ముందు అరెస్టయిన రోజు చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులని పరామర్శించారు.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర “UI” అనే చిత్రం నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఉపేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.తాజాగా విడుదలైన ఈచిత్ర ట్రైలర్ సినీ అభిమానులను ఆకట్టుకుంది.ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల కానుంది. https://youtu.be/Za0yA0j-DK8?si=QOpyagejC1otS_Sf
తెలుగు అగ్రసినీతార అనుష్క శెట్టి చాలా తర్వాత నటిస్తోన్న చిత్రం ‘ఘాటి’.ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇంతకుముందు వీరిద్దరి కలయికలో వచ్చిన “వేదం” చిత్రంకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి.న్యూ ప్రాజెక్ట్ ‘ఘాటి’ కోసం మరోసారి అనుష్క – క్రిష్ కలసి పనిచేస్తున్నారు.యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి నాగవెల్లి విద్య సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రం విడుదల తేదీని చిత్రబృందం ఖరారు చేసింది.ఈ చిత్రం వచ్చేది ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. https://youtu.be/EHJRrXbKmx8?si=CrnVAldGK51_bObs
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ,అగ్ర దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’.ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో గ్రాండ్ గా నిర్వహించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని తెలుస్తుంది.ఓ భారతీయ చిత్రం అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకోనుండడం గేమ్ చేంజర్ తోనే మొదలు అని తెలుస్తుంది.ఈ మేరకు నిర్మాత దిల్ రాజు ఓ వీడియో విడుదల చేశారు.డిసెంబరు 21న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని అమెరికాలోని డాలస్ నగరంలో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.సాయంత్రం 6 గంటల నుండి ఈ భారీ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు. భారతదేశ సినీ చరిత్రలో అమెరికాలో ప్రీ రిలీజ్ కార్యక్రమం జరుపుకుంటున్న మొట్టమొదటి చిత్రం తమదేనని చెప్పారు.ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకుడు శంకర్, ఎస్.జె.సూర్య, అంజలి, సంగీత దర్శకుడు తమన్ తో కలిసి తాను కూడా హాజరవుతున్నట్టు…
తన మేనమామ, అగ్ర కథానాయకుడు చిరంజీవి నివాసానికి నటుడు అల్లు అర్జున్ వెళ్లారు.ఈరోజు మధ్యాహ్నం తన భార్యా పిల్లలతో కలిసి ఆయన చిరు నివాసానికి వెళ్లారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత చిరంజీవి – అల్లు అర్జున్ తొలిసారి కలుసుకోవడంతో ఈ మీట్‌కు ప్రాధాన్యత సొంతం చేసుకుంది.అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలిసిన వెంటనే చిరంజీవి – సురేఖ దంపతులు బన్నీ నివాసానికి వెళ్లిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులను పరామర్శించారు.నిన్న ఉదయం బన్నీ బెయిల్‌పై విడుదలై ఇంటికి రాగా.. చిరంజీవి సతీమణి సురేఖ బన్నీ నివాసానికి వెళ్లి భావోద్వేగానికి గురయ్యారు.
పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమర యోధుడు, మానవతావాది పొట్టి శ్రీరాములు త్యాగం మన తరతరాలు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని.. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం పాటుపడదామని పిలుపునిచ్చారు. త్వరలో ఏపీలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పొట్టి శ్రీరాములు సొంత ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టామన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టిందని విమర్శించారు. అమరావతి, పోలవరాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆనందకరమైన, సంపదతో కూడిన…
