‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ప్రణాళిక నేడు పార్లమెంటు ముందుకు వచ్చింది. లోక్ సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టింది. దీని కోసం ప్రతిపాదించిన 128వ రాజ్యంగ సవరణ బిల్లు సహా దీనిని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీయే మిత్ర పక్షాలు బిల్లుకు మద్దతు తెలుపగా… కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ సహా విపక్ష పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. ఓటింగ్ లో 269 మంది అనుకూలంగా ఓటేయగా…198 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఇక ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభకు తెలిపారు. పలువురు విపక్ష ఎంపీలు ఈ బిల్లుపై విమర్శలు గుప్పించారు.
Author: admin
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఫాలో ఆన్ గండాన్ని అధిగమించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 51-4 తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన భారత్ ను కే.ఎల్.రాహుల్ 84(139;8×4), రవీంద్ర జడేజా 77 (123; 7×4, 1×6) మంచి భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి (16), సిరాజ్ (1) స్వల్ప పరుగులకే అవుటైనా ఆకాష్ దీప్ 27 నాటౌట్ (31, 2×4, 1×6), బుమ్రా 10 నాటౌట్ (1×6)పరుగులతో భారత్ ను ఫాలో ఆన్ నుండి కాపాడారు. మధ్య మధ్యలో వర్షం ఆటంకం కలిగించింది. ఇక ఆస్ట్రేలియా కంటే భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 193 పరుగులు వెనుకంజలో ఉంది. అయితే ఇంకా ఒక్క రోజు…
చాట్ జీపీటీ పేరెంట్ కంపెనీ ఓపెన్ ఏఐ సెర్చ్ ఇంజన్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే పెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ సదుపాయాన్ని అందరికీ ఉచితంగా అందిస్తున్నట్లు తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొంది. ఇకపై సబ్స్క్రిప్షన్ తో పని లేకుండా ఎవరైనా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్ ను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. మరిన్ని సదుపాయాలను దీనికి జోడించినట్లు తెలిపింది. చాట్ జీపీటీ ఆప్టిమైజ్ వెర్షన్ ను ఆవిష్కరించింది. ఇక ఇందులో తాజాగా అడ్వాన్స్డ్ వాయిస్ సెర్చ్ మోడ్ ఫీచర్ ను తీసుకొచ్చింది. వాయిస్ కమాండ్ల ద్వారా ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందొచ్చు. చాట్ జీపీటీ లాగిన్ అయిన యూజర్లందరూ సెర్చ్ ఇంజిన్ యాప్, వెబ్సైటు ఉచితంగా వినియోగించుకోవచ్చు.
నటుడు మంచు మనోజ్,ఆయన సతీమణి మౌనిక కలిసి జనసేనలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది.దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.మా అత్తయ్యగారి జయంతి సందర్భంగా మొదటిసారి మా కూతురు దేవసేన శోభను ఆళ్లగడ్డ తీసుకొచ్చాం.జయంతి రోజు తీసుకొద్దామనే ఇన్నాళ్లూ ఇక్కడకు తీసుకురాలేదు.మా కుటుంబం, సోదరులు, స్నేహితులతో కలిసి ఇక్కడకు వచ్చా.ఊళ్లో ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకున్నారు.అందరికీ ధన్యవాదాలు.రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు అని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టడంపై స్పందిస్తూ తాను ఇప్పుడే ఏమీ మాట్లాడాలనుకోవడం లేదని చెప్పారు.
తమ ఖాతాదారులను ఉద్దేశించి ఎస్‌బీఐ కీలక హెచ్చరిక చేసింది.ఫలానా పథకాల్లో అత్యధిక రిటర్నులు వస్తున్నాయంటూ చక్కర్లు కొడుతున్న వీడియోలపై ఎస్‌బీఐ తాజాగా స్పందించింది.ఆయా వీడియోలను నమ్మవద్దని చెప్పింది.అవన్నీ అబద్ధాలు మాత్రమేనని తెలిపింది.నకిలీ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.పెట్టుబడులు, ఇతర ఆర్థిక విషయాలను తెలుసుకోవడానికి దగ్గరలోని బ్యాంక్‌ను సంప్రదించాలని తెలిపింది.
డిసెంబర్ 17 నుండి 20 వరకు విశాఖపట్నం వేదికగా భారత్ మరియు శ్రీలంకలకు చెందిన నావికా దళాలు సంయుక్తంగా స్లినెక్స్ 2024 పేరిట నావికా విన్యాసాలు జరుగుతున్నాయి. హార్బర్ ఫేజ్, సీ ఫేజ్ అనే రెండు దశల్లో ఈ విన్యాసాలు జరుగుతాయి. ఇరుదేశాల మధ్య నావికాదళ సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సముద్ర భద్రత, రక్షణ పట్ల సహకరించుకోవడం, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం చేయడం ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం. భారతదేశం యొక్క నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీ మరియు హిందూమహాసముద్ర ప్రాంతంలో సముద్రతీర భద్రత విషయంలో సహకరించుకునేందుకు 2015లో భారతప్రభుత్వం ప్రారంభించిన సాగర్ (సెక్యూరిటీ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్) లక్ష్యానికి అనుగుణంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి.
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ షాక్ తగిలింది.పోర్న్ స్టార్‌కు హష్ మనీ కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు అంగీకరించలేదు.అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని మన్‌హట్టన్ న్యాయమూర్తి జువాన్ మర్చన్ తెలిపారు.ఇలాంటి అనధికారిక ప్రవర్తన విషయంలో ట్రంప్‌నకు రక్షణ వర్తించదని స్పష్టం చేశారు.హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలిన విషయం తెలిసిందే.ఈ ఏడాది నవంబరులో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేసే సయమంలో ఆయన అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ ఆయన న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు.దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది.తాజాగా ట్రంప్‌నకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చింది.ఒక వేళ ఈ కేసులో ఆయనకు ఊరట…
నటుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.తాజాగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.తమ ప్రేమ బంధం ఎలా మొదలైంది? పెళ్లి ప్రపోజల్ వంటి విషయాలను ఈ జంట పంచుకుంది.నాగచైతన్యను తొలిసారి తాను ఒక కేఫ్‌లో చూశానని శోభిత చెప్పారు.2022 నుంచి తమ మధ్య స్నేహం మొదలైందని అన్నారు.‘‘మా పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది.అప్పుడు చైతన్య హైదరాబాద్,నేను ముంబయిలో ఉండేవాళ్లం.నాకోసం హైదరాబాద్ నుంచి ముంబయి వచ్చేవారు.మొదటిసారి మేం బయటకు వెళ్లినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్‌లో ఉన్నాడు.ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లాం.అక్కడ కొంత సమయం గడిపాం. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కు వెళ్లాం. అప్పటినుంచి జరిగినదంతా అందరికీ తెలిసిన విషయమే’’ అని శోభిత చెప్పారు. నాగచైతన్య కుటుంబంతో తాను ఒకసారి నూతన సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్లాలని శోభిత తెలిపారు.ఆ తర్వాత తామిద్దరం…
పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేసి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న తులసీ గౌడ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. ఆమెను కర్ణాటక వృక్ష మాతగా పిలుస్తారు. పశ్చిమ కనుమలు, కార్ వారా, అంకోలా పరిసర ప్రాంతాల్లో 30 వేలకు పైగా మొక్కలు నాటడమే కాక ఆయా ప్రాంతాల్లో ప్రజలు, స్థానికులతో పది లక్షల మొక్కలు నాటించి పర్యావరణంపై తనకున్న మక్కువను చాటి చెప్పారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2021 లో అప్పటి భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ పద్మశ్రీ అవార్డు అందించారు. విభిన్న జాతుల మొక్కలు & మూలికలపై ఆమెకు ఉన్న అపారమైన పరిజ్ఞానం కారణంగా ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అని ఆమెను పిలుస్తారు. వయస్సు మీద పడిన కూడా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ముందుకు తీసుకువెళుతూ, మొక్కల పెంపకం మీద కొత్త తరానికి తన జ్ఞానాన్ని పంచుకోవడం వంటి చర్యలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
శ్రీలంక అధ్యక్షులు అనుర కుమార దిసనాయకే భారత్ లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిపై సమీక్షించారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, భద్రతా సహకారంపై చర్చలు జరిపారు. ప్రధాని మోడీతో భేటీ అయి చర్చించారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో ఈరోజు వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం మరియు ఇంధనం వంటి అంశాలపై చర్చలు జరిగాయని ప్రధాని మోడీ తెలిపారు. గృహనిర్మాణం, వ్యవసాయం, పాడి పరిశ్రమ మరియు మత్స్య పరిశ్రమ వంటి రంగాలలో సహాకరించుకునే అంశాలపై కూడా చర్చలు జరిపారు. ఇక ఉగ్రవాదం మరియు వ్యవస్థీకృత నేరాలపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం మరియు శ్రీలంక కూడా కలిసి పనిచేస్తాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సముద్ర భద్రత, సైబర్ సెక్యూరిటీ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ పై కూడా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు.
