భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. వర్షం కారణంగా మొదటి రోజు కొద్దిసేపు మాత్రమే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక నేడు ఓవర్ నైట్ స్కోర్ 28-0తో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. ట్రావిస్ హెడ్ 152 (160 బంతుల్లో, 18×4 )మరోసారి సెంచరీతో రాణించాడు. ఈ సిరీస్ లో వరుసగా రెండో సెంచరీ చేశాడు. మరో బ్యాటర్ స్టీవ్ స్మిత్ 101 (190; 12×4) కూడా రాణించడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో మంచి ప్రదర్శన కనబరిచింది. భారత బౌలర్లలో బుమ్రా మరోసారి 5 వికెట్లతో సత్తా చాటాడు. నితీష్ రెడ్డి, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్: ఉస్మాన్ ఖవాజా 21 (54;…
Author: admin
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తరవాత పొట్టి శ్రీరాములు గారి త్యాగం విలువ అర్థమైంది. ఆయన 56 రోజుల పాటు కఠోర ఆమరణ నిరహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రం సిద్దించేలా చేసారని కొనియాడారు. ఆయన ఆత్మబలిదానం తరవాత ఆయన భౌతిక కాయం మొయ్యడానికి కూడా నలుగురు లేని పరిస్థితి భాదాకరం. ఘంటసాల లాంటి కొంతమంది మహానుభావులు ఆరోజు నిలబడ్డారు. ఆయన త్యాగ ఫలితం ఆంధ్ర రాష్ట్రమని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగం ప్రతీ తరానికి గుర్తు ఉండాలి అని క్యాబినెట్ లో మాకు చెప్పి, ఆ మహనీయుని వర్ధంతిని ఆత్మార్పణ దినంగా ఘనంగా జరపాలని సీఎం చంద్రబాబు అనడం పట్ల ప్రత్యేక…
సుప్రసిద్ధ నటుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) కారణజన్ముడు అని, ఆయన వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఇవాళ కృష్ణా జిల్లా పోరంకిలో నిర్వహించిన ఎన్టీర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…ఎన్టీఆర్ లో తనకు అన్నిటికంటే బాగా నచ్చేది క్రమశిక్షణ,పట్టుదల,కష్టపడి పనిచేయడం అని అన్నారు.ఈ మూడు ఉంటే జీవితంలో ఎవరైనా పైకి వస్తారని,ఈ మూడింటిని అలవర్చుకోవడమే మనం ఆ మహనీయుడికి అర్పించే నివాళి అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.ఎన్టీ రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినవారు.ఆయనకు క్యారెక్టర్, కాలిబర్, కెపాసిటీ, కాండక్ట్…ఇవన్నీ ఆయనకు నిండుగా, మెండుగా ఉన్నాయి.లోతుగా గమనిస్తే ఆయన సినిమాల్లోని మాటల్లో,పాటల్లో ఒక సందేశం ఉంటుంది.నటుడిగా,నిర్మాతగా,దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్ గా సినీ చరిత్రలో ఎన్టీఆర్ గారి స్థానం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.ఆయన ఏకాగ్రత అమోఘం.ఏదైనా ఒకటి అనుకుంటే పూర్తయ్యేదాకా విశ్రమించరు.కొన్ని…
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్)ను సుసాధ్యం చేయడానికి ప్రధాని మోడీ 11 సంకల్పాలను ప్రకటించారు. 1.సమిష్టి అభివృద్ధి: సబ్ కా సాథ్, సబ్ కా వికాస్. 2.అవినీతి పట్ల జీరో టాలరెన్స్ 3.చట్టాన్ని పాటించడాన్ని గర్వంగా భావించడం. వలస పాలన మనస్తత్వం నుండి విముక్తి. దేశ రాజకీయాలను “కుటుంబ పాలన” నుండి విముక్తి చేయడం. 6. రాజ్యాంగాన్ని గౌరవించడం మరియు వ్యక్తిగత ప్రయోజనాల కోసం దానిని దుర్వినియోగం చేయడం నిరోధించడం(సంవిధాన్ కా సమ్మాన్) 7.రిజర్వేషన్లు ఎత్తివేయకపోవడం.రిజర్వేషన్లను ఇప్పటికే కలిగి ఉన్న వారి నుండి లాక్కోకుండా చూసుకోవడం మరియు 8. మత ఆధారిత రిజర్వేషన్లను నివారించడం. 9.మహిళల నేతృత్వంలోని వృద్ధికి భారతదేశం ఉదాహరణగా ఉండాలి. 10.రాజ్య సే రాష్ట్ర కా వికాస్ -రాష్ట్రాల కేంద్రంగా అభివృద్ధి తద్వారా దేశం అభివృద్ధి. 11.ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేదే మన…
దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో లావాదేవీలు జరుగుతూ సరికొత్త మైలురాయిని అందుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈసంవత్సరం జరిగిన లావాదేవీల గణాంకాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 2024 జనవరి నుండి నవంబర్ వరకు 15,547 కోట్ల లావాదేవీలు, రూ.223 లక్షల కోట్లు చెల్లింపులు జరిగినట్లు తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ విప్లవం వైపు పయనిస్తోందని పేర్కొంది. యూపీఐ పేమెంట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత పెరుగుతుందని తెలిపింది. Driving the #DigitalPayment revolution, UPI achieved 15,547 crore transactions worth Rs. 223 lakh crore from January to November, 2024, showcasing its transformative impact on financial transactions in India.⁰#FinMinYearReview2024⁰#BankingInitiatives⁰#ViksitBharat pic.twitter.com/Bkbag6542k— Ministry of Finance (@FinMinIndia) December 14, 2024
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక మైలురాయి అందుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా బ్రిస్బేన్ లో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఉస్మాన్ ఖవాజా క్యాచ్ పట్టి 150 డిస్మిసిల్స్ చేసిన మూడో భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. ఈ జాబితాలో భారత దిగ్గజ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ 294 డిస్మిసిల్స్ తో మొదటి స్థానంలో ఉండగా… సయ్యద్ కిర్మాణీ 198 డిస్మిసిల్స్ తో మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం 41వ టెస్టు ఆడుతున్న పంత్ 135 క్యాచ్ లు 15 స్టంపింగ్ లతో ఈ మైలురాయిని అందుకున్నాడు.
బీజేపీ సీనియర్ నాయకుడు,మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ అద్వానీ(97) అస్వస్థతతో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేరారు.అద్వానీ ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ ఆస్పత్రి ఒక ప్రకటనలో పేర్కొంది.అయితే 2 రోజుల క్రితమే ఆయన్ను ఆస్పత్రిలో చేర్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.గత నెలలో 97వ జన్మదినం జరుపుకొన్న ఆయన కొద్ది నెలలుగా తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
పశ్చిమాసియా దేశమైన సిరియాలో నెలకొన్న ప్రతిష్టంభన పరిస్థితుల గురించి తెలిసిందే. ఐదున్నర దశాబ్దాల కుటుంబ పాలనకు ఆదేశ ప్రజలు ముగింపు పలికారు. తిరుగుబాటు దారులు సిరియా రాజధాని డమాస్కస్ లో ప్రవేశించడంతో అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని వీడారు. దీంతో పూర్తిగా తిరుగుబాటు దారుల చేతిలోకి వెళ్లింది. బషర్-అల్-అసద్ కుటుంబంతో పాటు సిరియా వదిలి రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు. ఇక అక్కడ పరిస్థితిని అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా సిరియాతో తమ సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. అక్కడి తిరుగుబాటు దారులతో టచ్ లో ఉన్నట్లు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు త్వరలో పెళ్ళి చేసుకోనున్న విషయం తెలిసిందే.తాజాగా ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగింది.పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయి – సింధు ఉంగరాలు మార్చుకున్నారు.ఈ ఫొటోను సింధు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.’ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి’ అనీ పేర్కొన్నారు. కాగా, ఈ జంట ఈ నెల 22న రాజస్థాన్‌లో పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే.ఇరువురి కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాయి.ఇప్పటికే పలువురు ప్రముఖులను వీరిద్దరూ కలిశారు.పెళ్లికి ఆహ్వానించారు.
దేశానికి కాంగ్రెస్ అనేక విధాలుగా నష్టం కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు.దేశానికి కాంగ్రెస్ పార్టీ అనేక నష్టాలు కలిగించిందంటూ పార్లమెంటు ప్రసంగంలో ప్రధాని మోదీ విమర్శించారు.’రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ యత్నించింది. రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు ప్రయత్నించింది.55 ఏళ్ల పాటు దేశాన్ని ఒకే కుటుంబం పాలించింది.1947 నుండి 1952 వరకూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరగలేదు’ అని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డామని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.’బానిస మనస్తత్వం ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు.ఐక్యతను దెబ్బతీసేందుకు విషబీజాలను నాటారు.సుప్రీంకోర్టు అధికారాలు తగ్గించేందుకు నాటి ప్రధాని ఇందిర ప్రయత్నించారు.ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కుల్ని హరించారు.వేలాదిమందిని జైళ్లకు తరలించారు. కోర్టులు,పత్రికల గొంతు నొక్కారు’ అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ అనేక విధాలుగా ప్రయత్నించిందని ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటు ప్రసంగంలో మండిపడ్డారు.’రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు నాటి ప్రధాని నెహ్రూ…
