Author: admin

ఈ సంవత్సరం నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్ గా హార్థిక్ పాండ్య నిలిచాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో హార్థిక్ పాండ్య కీలక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ లో ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక ఐపీఎల్ సమయంలో కూడా హార్దిక్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువగా సెర్చ్ చేయబడిన క్రీడాకారుల జాబితాలో పాండ్య టాప్-10లో నిలిచాడు. ఇక భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రపంచ కప్ ను భారత్ కు అందించిన కెప్టెన్ గా రోహిత్ ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన కోహ్లీ అనంతరం వీరిరువురూ టీ20 క్రికెట్ నుండి వైదొలగడం వంటివి కూడా ఈ ఏడాది వార్తల్లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాయి.

Read More

కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోను ఉపయోగించి తమకు తోచిన విధంగా వార్తలు రాయడాన్ని భారత మాజీ కెప్టెన్ దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే ఖండించాడు. అవన్నీ నకిలీ వార్తలని, వాటితో తనకేలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గబ్బా వేదికగా మూడో టెస్టు జరుగుతోంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ట్రోఫీ గురించి సోషల్ మీడియాలో తన పేరు, ఫొటో దుర్వినియోగం కావడంపై ఎక్స్ లో స్పందిస్తూ పోస్ట్ చేశాడు.బ్యాటింగ్లో విరాట్ కోహ్లి వైఫల్యం, రోహిత్ శర్మ కెప్టెన్సీపై కుంబ్లే తీవ్ర విమర్శలు చేశాడని ఆ వార్తల సారాంశం. అవన్నీ అసత్య కథనాలని కుంబ్లే తాజాగా స్పష్టం చేశారు. కొన్ని సోషల్ మీడియా ఎకౌంటులు నా ఫొటోని ఉపయోగిస్తూ కల్పిత వ్యాఖ్యలు నాకు ఆపాదిస్తున్నట్లు తన…

Read More

ప్రతి 12 సంవత్సరాలకు మహా కుంభమేళా జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రయాగ్ రాజ్ 2025 లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపుగా 45 కోట్ల మంది యాత్రికులు, సాధువులు పర్యాటకులు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో కంటే మరింత అద్భుతంగా ఈ మహా కుంభమేళా జరగనుందని యూపీ జలశక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు. దీనిని స్వచ్చంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా డిజిటల్ కార్యక్రమంగా మార్చే విధంగా యూపీ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రయాగ్ రాజ్ లో దాదాపు 3 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం కూడా వాటిని పరిరక్షించనున్నట్లు పేర్కొన్నారు.

Read More

మహా భారతం పై సినిమా చేయడం తన కలల ప్రాజెక్టు అని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నారు.తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన దీని గురించి మాట్లాడారు.మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్.ఆ కథ మన అందరిలో భాగం.దీని విషయంలో నాపై బరువు బాధ్యతలు ఉన్నాయి.ఇలాంటి తప్పులు లేకుండా దీనిని తీర్చి ద్దిద్దాలని ఉందని అన్నారు.ఈ సినిమా కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నారని గతం వార్తలు వచ్చాయి.రానున్న రోజుల్లో తాను ఏడాదికి ఒక సినిమా చేయాలనుకుంటునానని ఆయన చెప్పారు.అదే విధంగా మరెన్నో గొప్ప సినిమాలు నిర్మించే ఆలోచలో ఉన్నట్లు చెప్పారు.

Read More

తెలంగాణ ఇంటర్ పరీక్షలు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. మార్చ్ 5 నుంచి మార్చ్ 25 వరకు పరీక్షలు జరగనున్నట్లు విద్యా శాఖ తెలిపింది. ఫిబ్రవరి 3 నుంచి 22వ తేది వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి.ఆ మేరకు విద్యార్థులు సన్నద్ధం కావాలని తెలిపింది.ఇంటర్ ఎగ్జామ్ 2025 జనవరి 29,2025న బ్యాక్‌లాగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎథిక్స్ మరియు హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్‌తో ప్రారంభమవుతుంది. జనవరి 30, 2025న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ ఉంటుంది.రెండు పరీక్షలు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల మధ్య జరుగుతాయి.ప్రాక్టికల్ అసెస్‌మెంట్‌ల కోసం, 1వ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 31, 2025న షెడ్యూల్ చేయబడ్డాయి, అయితే 2వ సంవత్సరం విద్యార్థులు ఫిబ్రవరి 1, 2025న హాజరవుతారు.జనరల్ మరియు వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుండి ఫిబ్రవరి 22 వరకు జరుగుతాయి.2025,రోజులో రెండు సెషన్‌లలో — 9:00 AM నుండి 12:00…

Read More

భారత రాజ్యాంగాన్ని ఉద్దేశించి పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ జరిగింది.రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్ల అయిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఈ చర్చను ఆరంభించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు.కుటుంబం కోసం రాజ్యాంగాన్నే మార్చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతం అని అన్నారు.”రెండో ప్రపంచయుద్ధం తర్వాత దాదాపు 50 దేశాలకు స్వాతంత్ర్యం లభించింది.అవి రాజ్యాంగాన్ని రాసుకున్నాయి.కాలక్రమంలో పలు దేశాలు తమ రాజ్యాంగం అసలు ఉద్దేశాన్ని మార్చివేశాయి.కానీ మన రాజ్యాంగం మాత్రం ఎన్ని పరీక్షలకు ఎదుర్కొని నిలబడింది.వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేసేందుకు కాంగ్రెస్ సవరణలు చేసింది.ఇప్పుడు మాత్రం రాజ్యాంగ పరిరక్షణ గురించి ప్రసంగాలు ఇస్తుంది ‘ అని నిర్మలమ్మ దుయ్యబట్టారు.

Read More

మైనారిటీ, హిందువులపై బంగ్లాదేశ్ లో వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ దాడుల వల్ల అక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.తాజాగా ఈ దాడులను ఉద్దేశించి ప్రియాంక వాద్రా స్పందించారు.ఈరోజు జరిగిన పార్లమెంట్ లో ఆమె ఈ విషయం గురించి మాట్లాడారు.ఆ దాడులపై భారత్ గళం ఏత్తాలనీ అన్నారు.ఆ దేశంతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడి ప్రభుత్వాన్ని కోరాలి” అని అన్నారు.విజయ దివస్ సందర్భంగా 1971 యుద్ధంలో అమరులైన వారికి లోక్ సభ వేదికగా సెల్యూట్ చేశారు.

Read More

యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్లోని ఇందౌర్ నగరం కీలక చర్యలు చేపడుతుంది.ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా అధికారులు భిక్షాటనను నిషేధించారు.యాచకులకు సాయం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తాజాగా హెచ్చరించారు.భిక్షాటన చేసేవారికి డబ్బులిచ్చేవారి పైనా ఎఫ్ఎస్ఐఆర్ లు నమోద చేస్తామని ప్రకటించారు.జనవరి 1, 2025 నుంచి ఈ నిబంధనలు అమలోకి వస్తాయని చెప్పారు. యాచకులులేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం.డిసెంబర్ చివరి వరకు వీటిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తాం.జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నటు కనిపిస్తే వారిపై ఎఫ్ఎస్ఐఆర్లు నమోదు చేస్తాం” ఇందౌర్ కలెక్టర్ ఆశిశ్ సింగ్ తెలిపారు.

Read More

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ నాయకుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నారని రాజ్యాంగ పరిషత్‌ చర్చలు చెబుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.బీజేపీ మాయమాటలతో దేశ ప్రజలను మోసం చేస్తోందని,బదులుగా కాంగ్రెస్‌పై నిందలు వేస్తోందని విమర్శించారు.జాతీయ జెండాను,అశోక్ చక్రాన్ని,రాజ్యాంగాన్ని ద్వేషించిన వారే నేడు రాజ్యాంగంపై పాఠాలు బోధిస్తున్నారని ఆరోపించారు.రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని,అందుకే కుల గణనను వ్యతిరేకిస్తోందని అన్నారు.భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాజ్యసభలో ఈరోజు ప్రత్యేక చర్చ జరిగింది.ఈ మేరకు బీజేపీ,ఆర్ఎస్ఎస్​పై ఖర్గే విమర్శలు గుప్పించారు.

Read More

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ భేటీ అయ్యారు.తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు.నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.నాగబాబు ప్రమాణస్వీకార తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి తన నియోజకవర్గం పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించారు.30 బెడ్ల కమ్యూనిటీ హెల్త్ సెంటరను 100 బెడ్ల ఆస్పత్రికి అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీనికోసం రూ.38కోట్లు వెచ్చించనుంది.ఇక్కడ అవసరమైన 66 పోస్టుల్ని త్వరలోనే సర్కారు భర్తీ చేస్తుందని,వారి జీతాలకు రూ.4.32 కోట్లు వెచ్చిస్తుందని జనసేన Xలో తెలిపింది.

Read More