Author: admin

జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు, బీజేపీ నేత రేఖా శర్మ రాజ్యసభ ఉప ఎన్నికల్లో హార్యానా నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల బరిలో ఆమె ఒక్కరే నిలిచారు. నామినేషన్ దాఖలు గడువు ముగిసే లోపు మరెవరూ పోటీలో లేకపోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇటీవల జరిగిన హార్యానా అసెంబ్లీ ఎన్నికల్లో క్రిషన్ లాల్ పన్వర్ గెలుపొందడం తో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రేఖా శర్మ ఆ స్థానం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Read More

విజయ్ హాజారే టోర్నీ హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ సారధ్యం వహించనున్నాడు. ఈనెల 21న ఆరంభం కానున్న ఈ టోర్నీకి సంబంధించి హైదరాబాద్ జట్టును హెచ్.సీ.ఏ ప్రకటించింది. మొదటి మ్యాచ్ లో నాగాలాండ్ తో హైదరాబాద్ తలపడనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ జట్టు: తిలక్ వర్మ, సీవీ మిలింద్, రోహిత్ రాయుడు, తన్మయ్ అగర్వాల్, అలీ, వరుణ్ గౌడ్, నితీష్ రెడ్డి, అభిరత్ రెడ్డి, తనయ్ త్యాగరాజ్, రాహుల్ రాధేశ్, అజయ్ దేవ్, నిశాంత్, అనికేత్ రెడ్డి, ముదాసిర్, చందన్, బుద్ధి రాహుల్, రిషబ్, గౌరవ్, ప్రతీక్, అనిరుధ్.

Read More

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో నిన్న అరెస్టయిన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు రూ.50వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్ కు సమర్పించారు. అయితే హైకోర్టు నుండి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు నిన్న రాత్రి ఆలస్యంగా అందాయి. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే గడపాల్సి వచ్చింది. ఇక నేటి ఉదయం ఎస్కార్ట్ వాహనం ద్వారా ఆయనను పంపించారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ భదత్ర ఏర్పాటు చేశారు.

Read More

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కథానాయకుడిగా, దర్శకుడు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం “డాకు మ‌హారాజ్”.తాజాగా ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.”డాకుస్ రేజ్” పేరుతో ఈ ప్రోమో వీడియోను విడుదల చేశారు.’డేగ డేగ’ అంటూ సాగే ఈ ప్రోమో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలానే ఉంది.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇందులో బాలయ్య స‌ర‌స‌న కథానాయికగా శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తున్నారు.బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నారు.సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. https://youtu.be/Pn8IVAkwoco?si=Ab5vmFoiApNN91-S

Read More

సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా,కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ‘సంబరాల ఏటి గట్టు’ అనే చిత్రం తెరకెక్కుతుంది.ఈ సినిమా గ్లింప్స్ ను చిత్రబృందం విడుదల చేసింది.‘ఎస్‌వైజీ’ కార్నేజ్ పేరిట ఈ గ్లింప్స్‌ను నిన్న నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ విడుద‌ల చేశారు.ఈ గ్లింప్స్‌లో సాయి తేజ్ క్యారెక్టర్‌ను చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించారు. ఈ చిత్రానికి దర్శకుడు అజనీశ్‌ లోక్‌నాథ్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు.ఇందులో సాయి దుర్గా తేజ్‌కు జంటగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు.జగపతి బాబు,సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. https://youtu.be/WrwcrBfZWmY?si=7y4Q_b-ZQgmGmmlT

Read More

అల్లు అర్జున్ స్పందించిన తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డి నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ పార్లమెంట్ మీడియా లాబీ వద్ద మాట్లాడుతూ… చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు.చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యలో పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు.అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో తన జోక్యం ఉండదని అన్నారు. సినిమా నటులను లక్ష్యంగా చేసుకుంటున్నారు:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు.షో నిర్వాహకులు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఈ అరెస్టు జరిగినట్లు అర్థం అవుతోందన్నారు.శాంతి భద్రతల పరిరక్షణ బాధ్య త పోలీసులపై ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ ఆర్టిస్టులను టార్గెట్ చేస్తోందనే విషయాన్ని ఈ అరెస్ట్ గుర్తుచేస్తోందని ట్వీట్ చేశారు. అల్లు అర్జున్…

Read More

హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ను నేడు హైదరాబాద్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిదని అన్నారు. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

Read More

దగాపాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతం అయ్యిందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారని జగన్ ట్వీట్ చేశారు. ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి కార్యక్రమం అద్దంపట్టిందని జగన్ పేర్కొన్నారు. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు గారు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్‌ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయమని అన్నారు. రైతులకు తోడుగా నిలిచిన వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు తెలిపారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇస్తానన్న సూపర్‌ సిక్స్‌ను గుర్తుచేస్తూ అందులో భాగంగా ప్రతిఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20వేలు ఎందుకు ఇవ్వడంలేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని వైయస్సార్‌సీపీ…

Read More

నాంపల్లి కోర్టు కాసేపటి క్రితం 14 రోజుల రిమాండ్ విధించిన అల్లు అర్జున్ కు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.అయితే బన్నీని పోలీసులు ఇప్పటికే చంచల్గూడ జైలుకు తరలించారు.సుదీర్ఘ వాదనల అనంతరం అల్లు అర్జున్ కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు 50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆయనను ఆదేశించింది.ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలంది.తదుపరి విచారణను JAN 11కు వాయిదా వేసింది.ఒక్కరోజు కూడా జైలులో ఉండకుండా అర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ తీర్పు ఇచ్చిందని,దాని ఆధారంగా బెయిల్ ఇవ్వాలన్న బన్నీ లాయర్ నిరంజన్ వాదనతో ఏకీభవించింది.

Read More

నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది.సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది.తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ…అల్లు అర్జున్ పెట్టుకున్న క్వాష్ పిటిషన్ పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోందని…హైకోర్టు నిర్ణయం వెలువడేంత వరకు వేచి చూడాలని కోర్టును బన్నీ తరపు లాయర్లు కోరారు.వారి విన్నపాన్ని తిరస్కరించిన కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది. కాగా కోర్టు తీర్పు నేపథ్యంలో అల్లు అర్జున్ పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న మేరా హైకోర్టు తీర్పు వచ్చాకే రిమాండ్ పై స్పష్టత రానుంది.అయితే హైకోర్టులోనూ అల్లు అర్జున్ కు చుక్కెదురైతే…కోర్టు మెయిన్ గేటు నుండి కాకుండా, వెనక గేటు నుండి బన్నీని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.చంచల్ గూడ జైలు వద్ద కూడా పోలీసు బందోబస్తును పెంచినట్లు సమాచారం.

Read More