జైలు నుండి ఇంటికి చేరుకున్న హీరో అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈక్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 4 గంటలకు డార్లింగ్ వస్తారని తెలిపాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, సుధీర్ బాబు తదితర నటీనటులు బన్నీ నివాసానికి వచ్చారు. మేనల్లుడిని చూసి భావోద్వేగానికి గురైన చిరంజీవి సతీమణి సురేఖ…! మేనల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పరామర్శించారు. జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్న ఆయన్ను చూడగానే ఆమె భావోద్వేగానికి గురయ్యారు. హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. ఘటనకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. ఆ తర్వాత బన్నీ కూడా ఆమె చేతిపై ముద్దు పెట్టి మేనత్తకు ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Author: admin
తాను ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు నటుడు మోహన్ బాబు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.! ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదు మరియు ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలను బయటపెట్టాలని మీడియాను కోరుతున్నాను అని ఆయన పేర్కొన్నారు. విలేకరిపై దాడి కేసులో మోహన్ బాబుకు ఊరట లభించలేదని వార్తలు వచ్చాయి. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో పోలీసులు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని ఆ వార్తల సారాంశం. ఈనేపథ్యంలో మోహన్ బాబు ఆ వార్తలను ఖండిస్తూ పోస్ట్ చేశారు.
న్యూయార్క్ లో అనుమానాస్పద డ్రోన్స్ కలకలం సృష్టించాయి. ఆకాశంలో డ్రోన్ల లాంటి వస్తువులు ఎగరడంతో గురువారం రాత్రంతా అక్కడి ప్రజలు భయంభయంగా గడిపారు. విచిత్రమైన వస్తువులు ఎగురుతున్న వీడియోను న్యూజెర్సీ సెనేటర్ ఆండీ కిమ్ షేర్ చేశారు.ఫెడరల్ అధికారులు వాటి గురించి సరైన సమాచారం వెల్లడించకపోవడం స్థానికులను ఇబ్బందికి గురి చేసింది.ఈ విషయాన్ని గవర్నర్ ఫిల్ మర్ఫీ సీరియస్ గా తీసుకున్నారు.అధ్యక్షుడు జో బైడెన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఇరాన్ మదర్షిప్ నుంచే అవి వచ్చాయంటూ వసంతాలు వినిపిస్తున్నాయి. బైడెన్ ప్రభుత్వానికి తెలియకుండానే అవి ఎగురుతున్నాయా? అంటూ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రశ్నించారు.వాటిని కూల్చేయాలని డిమాండ్ చేశారు.
తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు శుక్రవారం ఆయనకు బెయిలు మంజూరు చేసింది. ఆయనతోపాటు ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో ఏడుగురు నిందితులు కూడా బెయిలును పొందారు. రేణుక స్వామి హత్య కేసులో వీరికి ఈ ఉపశమనం లభించింనట్లు అయింది. రేణుకా స్వామి అసభ్య సందేశాలు పంపించడంతో పవిత్ర గౌడ ఆగ్రహానికి గురి అయ్యారు. అదే విషయాన్ని దర్శన్ కి చెప్పారు. ఆయన తన బృందంతో కలిసి రేణుకా స్వామి పై దాడి చేశారు. హత్య చేశారు. ఇది బెంగళూరులో కలకలం సృష్టించింది.
న్యాయమూర్తులు ఋషి, సన్యాసి మాదిరిగా జీవించాలని సుప్రీం కోర్టు తెలిపింది. గుర్రాల మాదిరిగా వేగంగా పని చేయాలని చెప్పింది. న్యాయ సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా సంయమనం పాటించాలని తెలిపింది సామాజిక మాధ్యమాలను వాడవద్దని స్పష్టం చేసింది. తీర్పులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని కోరింది. న్యాయ వ్యవస్థలో తళుకుబెళుకు ఆకర్షణలకు చోటు లేదని వివరించింది. మధ్యప్రదేశ్ కు సంబంధించిన ఇద్దరు న్యాయమూర్తుల కేసులో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేశారు.
డే లైట్ అదా పద్ధతిని అనుసరించడం అసౌకర్యంగా ఉందని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. డే లైట్ ఆదా సమయం వల్ల అమెరికన్లపై చాలా భారం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. డే లైట్ సేవింగ్ టైమ్ ప్రకారం వసంత కాలంలో ఒక గంట ముందుకు, శరదృతువులో ఒక గంట వెనక్కి గడియారంలో సమయాలను ప్రజలు మార్చుకావాల్సి వస్తుందన్నారు. మొదటి ప్రపంచ యుద్ధకాలం నుంచి ఈ పద్ధతినీ అమెరికన్లు అవలంభిస్తున్నారు. ఇప్పుడున్న రోజుల్లో ఇది ‘కాలం చెల్లిన పద్ధతి’ అని ఇప్పటికే పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.
సినిమాల్లో మద్యం, మాదక ద్రవ్యాలు పాటలు ఉండడం పై నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. సినిమాల్లోని ప్రతి అంశం భావోద్వేగాలకు సంబంధించింది. చిత్రబృందంతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలనీ ఆమె చెప్పారు. అనంతరం ఆమె అల్లు అర్జున్ అరెస్టు విషయం గురించి మాట్లాడారు. బన్నీ చేసిన దానిలో తప్పు లేదన్నారు. ఆయనకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఆమె చెప్పారు. ఆమె నటించిన ఎమర్జెన్సీ విడదలకు సిద్ధంగా ఉంది. ఇందిరా గాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని దీనిని తెరకెక్కించారు.
ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు అమలులోకి వచ్చినా జరిగేది 2029లోనే అని పేర్కొన్నారు. “వన్ నేషన్ వన్ ఎలక్షన్” విధానానికి ఇప్పటికే మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. వైసీపీ చేసే నాటకాలు చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. పబ్బం గడుపుకునేందుకు ఏది పడితే అది మాట్లాడుతోందని ఆ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని పేర్కొన్నారు. ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. తాజాగా తీసుకొచ్చిన స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ ను మరింతగా జనంలోకి తీసుకెళ్లాలని దానిపై ప్రతి చోటా చర్చ జరగాలని పేర్కొన్నారు. భావి తరాల మేలు కోసం చేపట్టే ఈ కార్యక్రమంలో అందరూ భాగం కావాలని పిలుపునిచ్చారు. విజన్-2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసూకోవాలని విజన్-2047 కూడా విజయవంతం అవుతుందని వివరించారు. సాగునీటి సంఘాలు, సహాకార తదితర ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని వెల్లడించారు. ఇక ముందు జరుగనున్న కలెక్టర్ల సదస్సులు…
రైతుల విషయంలో కూటమి ప్రభుత్వంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలను ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తిప్పికొట్టారు. ఎవరు రైతులకు భరోసాగా నిలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని మనోహర్ సామాజిక మాధ్యమం’ఎక్స్’ లో కౌంటర్ ఇచ్చారు. వైసీపీ పాలన చేసిన గత ఖరీఫ్ సీజన్లో డిసెంబర్ 13నాటికి- 9,40,936 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ చేసింది. కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకూ 16,34,151 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని వివరించారు. కలక్టరేట్ల దగ్గరకు బస్తాలు మోసుకువెళ్ళి ఫోటో షూట్ చేసిన వైసీపీ వాళ్ళు గత సీజన్లో గుంటూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కనీసం సేకరణ కూడా చేపట్టలేదు. This is వాస్తవం! అంటూ పేర్కొన్నారు. #WakeupJaganఎవరు రైతులకు భరోసాగా నిలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. వైసీపీ పాలన చేసిన గత ఖరీఫ్ సీజన్లో డిసెంబర్ 13నాటికి- 9,40,936 మెట్రిక్ టన్నుల ధాన్యం…
రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను మరోసారి న్యూఢిల్లీ నుండే పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గం నుండి ఢిల్లీ మాజీ సీఎం వారసులు బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు సార్లు ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్, మరోవైపు బీజేపీ నుండి మాజీ సీఎం సాహిబ్ సింగ్ కుమారుడు పర్వేష్ వర్మను అభ్యర్థులుగా ప్రకటించవచ్చు అనే వార్తల నేపథ్యంలో ఈస్థానంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషీ సైతం ఆమె పాత నియోజకవర్గమైన కాల్కాజీ నుండి పోటీ చేయబోతున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించి నాలుగో సారి అధికారులతో వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
