యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధాని, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ అల్ నహ్యాన్ భారత్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన ఉండనుంది.ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మధ్య ఆసియాలో శాంతి, సుస్థిరత, భద్రతకు భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గతంలో ఎన్నడూ లేనివిధంగా పురోగతి సాధించిందని అన్నారు. ఐఎంఈఈసీ (ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్) అమలును ఒక చారిత్రాత్మక చొరవగా అభివర్ణించారు.
Author: admin
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ ఒక దశలో 1000 పాయింట్లకు పైబడి నష్టాలలో పయనించి తిరిగి పుంజుకుని లాభాల బాట పట్టింది. కీలక రంగాల షేర్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 840 పాయింట్ల లాభంతో 82,133 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 219 పాయింట్ల లాభంతో 24,768 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.79గా ఉంది. ఐసీఐసీఐ, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హిందూస్తాన్ యూపీ లివర్, టైటాన్, హెచ్.డీ.ఎఫ్.సీ తదితర షేర్లు ప్రధానంగా రాణించాయి.
బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. దీనిపై ఆయన లోక్ సభలో మాట్లాడారు. బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను నివారించేందుకు హిందువులు, మైనారిటీల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆశీస్తున్నట్లు తెలిపారు. ఇటీవల భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్ కు వెళ్లి అక్కడి పరిస్థితులపై అక్కడి నేతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇక బంగ్లాదేశ్ లో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హాసీనా దేశం విడిచి వెళ్లిపోవడం తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు జరిగాయి. వీటికి వ్యతిరేకంగా గళం విప్పిన ఇస్కాన్ కు చెందిన చిన్మయి కృష్ణదాస్ ను అరెస్టు చేయడం ఆయనకు కనీసం న్యాయ సహాయం కూడా అందించకపోవడం కూడా బంగ్లాదేశ్ తీరును ఎండగడుతూ ప్రపంచవ్యాప్తంగా మానవతా వాదులు మండిపడుతున్నారు. ఆగష్టు…
బంగ్లాదేశ్ లో జరుగుతున్న దారుణాలను ఉద్దేశించి అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది. అక్కడ మైనారిటీ, హిందువులపై దాడులతో పాటు అక్కడి పరిస్థితులను అధ్యక్షుడు బైడెన్ పరిశీలిస్తున్నారని వైట్ హౌస్ ప్రతినిధి మీడియాతో చెప్పారు. ప్రజా భద్రత గురించి అక్కడి నాయకులతో మాట్లాడినట్లు చెప్పారు. ప్రజా సంక్షేమం, పరిస్థితులు మెరుగుపరచడం కోసం అక్కడి తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అని చెప్పారు.
నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 విడుదల సమయంలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు అల్లు అర్జున్ కు ఎన్నేళ్ల జైలుశిక్ష పడుతుందంటే? సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్పై 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈక్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసు రుజువైతే అర్జున్కు సుమారు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో సంధ్య థియేటర్ ఓనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం..! ఉన్నపళంగా తమతో రావాలంటే ఎలా?.. బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వరా?.. పోలీసులు తీసుకెళ్లడంలో నాకు…
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా వివిధ రకాల స్టాల్స్ ని పరిశీలించి, వారి వారి విజయపధాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు అధికారులు అందులో సంతకాలు చేశారు. 1.పేదరిక నిర్మూలన 2. ఉపాధి కల్పన 3. నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి 4.ఇంటింటికి నీటి భద్రత 5. రైతు-వ్యవసాయ సాంకేతికత 6. ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ (లాజిస్టిక్స్) 7. శక్తి మరియు ఇంధనాలు వ్యయ నియంత్రణ 8. అన్ని రంగాల పరిపూర్ణ ఉత్పాదన 9. సమగ్ర విధానాలతో స్వఛ్ఛాంధ్ర 10. అన్ని దశలలో సమగ్ర సాంకేతికత. అనే పది అంశాలతో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచిన సందర్భంగా కూటమి పాలనపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. కూటమి అర్ధ సంవత్సర పాలన పూర్తిగా “అర్ధ రహితం” అని విమర్శలు గుప్పించారు. 6 నెలల్లో ఇచ్చిన 6 సూపర్ హామీలకు దిక్కులేదు. మ్యానిఫెస్టోలో పెట్టిన 60 హామీలు పత్తాకు లేవు. మూడు సిలిండర్లలో ఈ ఏడాది సింగిల్ సిలిండర్ తో మమ అనిపించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 3 వేల నిరుద్యోగ భృతి,20 లక్షల ఉద్యోగాలు, స్కూల్ కి వెళ్ళే ప్రతి బిడ్డకు 15 వేలు, రైతుకి 20 వేల సహాయం చేసే పథకం అన్నదాత సుఖీభవ, ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకు 1500 రూపాయలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత ఇసుక పథకం ఇలా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుకు సంబంధించి ‘ఎక్స్’ లో విమర్శలు గుప్పించారు. వచ్చిన 6 నెలల్లోనే 17500 కోట్ల…
భారత రాజ్యాంగంపై లోక్ సభ, రాజ్యసభలలో రెండు రోజుల పాటు చర్చ జరిగనుంది. రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈమేరకు చర్చ జరపాలని నిర్ణయించారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగం ఆమోదించింది. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఇక ఈ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ జరగాలని కాంగ్రెస్ ప్రధానంగా డిమాండ్ చేసింది. ఈమేరకు అధికార, విపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక నేడు లోక్ సభలో నేడు రాజ్ నాథ్ సింగ్ దీనిని ప్రారంభిస్తారు. రాజ్యసభలో అమిత్ షా ఈనెల 16న ప్రత్యేక చర్చను ప్రారంభిస్తారు. 17న ప్రధాని మోడీ ఈచర్చపై ముగింపు ప్రసంగం చేస్తారు. పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఇప్పటికే ప్రధాని మోడీ వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. బీజేపీ నేతలు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు…
ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమలలో ఇటీవల ఒక ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.సాధారణ భక్తులను కొంత సమయం ఆపి మలయాళ నటుడు దిలీప్ కు వీఐపీ దర్శనo కల్పించారు.భక్తులను ఇబ్బంది పెట్టిన ఈ ఘటనపై కేరళ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.“ ఇది చాలా తీవ్రమైన విషయం” అని వ్యాఖ్యానించింది. ” నటులు అయితే అటువంటి వ్యక్తులకు ఉన్న ప్రత్యేక అధికారాలు ఏమిటీ?” అని దేవస్థానం బోర్డును, చీఫ్ పోలీస్ కోఆర్డినేటరును నిలదీసింది.ఇది కొన్ని నిమిషాల విషయం కాదని, నటుడి వీఐపీ దర్శనం కోసం ‘సోపానం’ ముందున్న మొదటి రెండు వరుసల భక్తులను చాలాసేపు ఉక్కిరిబిక్కిరి చేశారని జస్టిస్ అనిల్ కె.నరేంద్ర, జస్టిస్ మురళీకృష్ణల ధర్మాసనం తెలిపింది.డిసెంబరు 5న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ తెప్పించుకొని చూసిన కోర్టు ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది.
రామ్ చరణ్ ఉపాసన దంపతుల కుమార్తె క్లింకార. తాజాగా ఆ పాప ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉపాసన.తన తండ్రి, తాతాయ్యాలతో కలిసి కుమార్తె దేవాలయానికి వెళ్లినట్టు తెలిపారు. అపోలో హాస్పిటల్ ప్రగనం లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పారు.పాప అక్కడ పాల్గొన్నట్లు తెలిపారు. పాపని చూస్తుంటే తాను చాలా హ్యాపీగా ఉన్నానని అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. పాప ఫేస్ బ్లర్ గా ఉండడం పై పలువురు నెటిజన్స్ స్పందించారు. ఫేస్ రివెల్ చేయమని కోరారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)
