Author: admin

నేపాల్ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ అశోక్ రాజ్ సిగ్ద‌ల్ భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము నేపాల్ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ అశోక్ రాజ్ సిగ్ద‌ల్ కు జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియ‌న్ ఆర్మీ గౌర‌వ పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేశారు. సైనిక ఖ‌డ్గం మరియు బిరుదు పత్రం, ఇండియ‌న్ ఆర్మీ క్యాప్‌ తో సత్కరించారు.‌ భార‌త్‌-నేపాల్ దేశాల మ‌ధ్య ఉన్న సైనిక సంబంధాల‌ను మ‌రింత పటిష్టం చేసుకునే విధంగా భార‌త్ లో ఆయ‌న పర్యటిస్తున్నారు. పలువురు అధికారులతో చర్చలు జరిపారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కూడా సమావేశమయ్యారు. రక్షణ పరమైన అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియ‌న్ ఆర్మీ గౌర‌వ పుర‌స్కారాన్ని అందుకున్న ఆయనకు రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు.

Read More

iGoT కర్మయోగి భారత్ పోర్టల్‌లో 7 లక్షలకు పైగా ఉద్యోగులను నమోదు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నమోదు చేయడం ఇదే మొదటి సారి. ఇక ఈ ప్లాట్‌ఫారమ్ జాతీయ సివిల్ సర్వీసుల (ఐఏఎస్, ఐపీఎస్) సిబ్బందికి సంబంధించిన శిక్షణ, ఇతర రకాల సహాయం అందించేందుకు మిషన్ కర్మయోగి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక వేదికను ఏర్పాటు చేసింది. ప్రజల భాగస్వామ్య స్పృహతో జాతీయ ప్రాధాన్యతతో భవిష్యత్తు సాంకేతికతను సేవల వితరణ చేసే విధంగా సివిల్ సర్వీసులను తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం.

Read More

అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే ట్రంప్ తన దూకుడు చూపిస్తున్నారు.ఇప్పటికే ఉక్రెయిన్ – రష్యా యుద్ధం, ఇజ్రాయిల్ హామస్ యుద్ధాల గురించి మాట్లాడిన ఆయన తాజాగా ఇరాన్ తో యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.తాను పదవిలో ఉన్నప్పుడు ఇరాన్ తో యుద్ధం చేయడంపై ఆయన స్పందించారు.ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అని వ్యాఖ్యానించారు.రష్యా పై ఉక్రెయిన్ క్షిపనులుతో విరుచుకుపడడం అత్యంత ప్రమాదకరమైన విషయంగా పరిగణిస్తునట్టు ఆయన చెప్పారు. వచ్చే నెలలో ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Read More

హెచ్‌-1బీ, ఎల్‌ 1 వీసాదారులకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఈ వీసాదారుల జీవిత భాగస్వాముల కోసం ఆటోమేటిక్‌ వర్క్‌ పర్మిట్‌ పునరుద్ధరణ గడువును పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 180 రోజులుగా ఉన్న ఈ గడువును 540 రోజులకు పొడిగిస్తున్నట్టు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ ప్రకటించింది.ఇది ఎవరెవరికి వర్తిస్తుందని విషయం పై కొన్ని సూచనలు చేసింది.ఇది 2022 మే 4వ తేదీన, ఆ తర్వాత దరఖాస్తు చేసే వారికి వచ్చే ఏడాది జనవరి 13 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది.

Read More

నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ మాట్లాడారు.దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి ఆయన స్పందించారు. రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరుగుతూ ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయ వేదికల్లో పాల్గొన్నప్పుడు భారత్‌లోని రోడ్డు ప్రమాదాల అంశం చర్చకు వస్తే తల దించుకోవాల్సి వస్తున్నదని రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. తాను కేంద్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశంలోని రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. మానవ ప్రవర్తన మెరుగుపడలంటే సమాజంలో మార్పు అవసరం అని ఆయన అన్నారు. చట్ట బద్దం అయిన పాలన గౌరవించాలని ఆయన తెలిపారు.

Read More

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ లో భారత స్టార్ షట్లర్స్ గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ ద్వయం విజయం సాధించింది. గ్రూప్ దశలో మొదటి మ్యాచ్ లో ఓటమిపాలైనా రెండో గేమ్ లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుని గెలుపు కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన గ్రూప్-ఏ రెండో మ్యాచ్ లో 21-19, 21-19తో మలేషియాకు చెందిన టీనా- పెర్లీ టాన్ జోడీ పై నెగ్గింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ లో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. గ్రూప్-ఏ లో ఆడిన రెండు మ్యాచ్ లలో గెలిచి చైనా జోడీ నాకౌట్ స్థానం ఖరారు చేసుకుంది. ఒక్కో విజయంతో జపాన్, భారత్ నాకౌట్ కోసం పోటీ పడుతున్నాయి. ఇక మలేషియా రెండు పరాజయాలతో నిష్క్రమించింది. తదుపరి మ్యాచ్ లో ఈ రెండు తలపడనున్నాయి.

Read More

విడాకులు తీసుకున్న భార్యకు భర్త చెల్లించాల్సిన భరణం కుసంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భరణం విషయాన్ని నిర్ణయించేందుకు ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించింది. ప్రవీణ్‌ కుమార్‌ జైన్‌, అంజు జైన్‌ విడాకుల కేసును విచారించిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ఇంతకీ ఆ ఎనిమిది అంశాలు ఏమిటంటే. 1.భార్యాభర్తల సామాజిక, ఆర్థిక స్థితి 2.భార్య, పిల్లల భవిష్యత్తు, కనీస అవసరాలు 3.భార్యాభర్తల విద్యార్హతలు 4.ఆదాయ వనరులు, ఆస్తులు 5.అత్తింటి వారి ఇంట్లో ఉన్నప్పుడు భార్య జీవనశైలి 6.భార్య ఉద్యోగ, ఉపాధి స్థితి 7.భార్య నిరుద్యోగి అయితే న్యాయపోరాటానికి అయ్యే సహేతుకమైన ఖర్చు 8.భర్త ఆర్థిక స్థితి, ఆదాయం, ఇతర బాధ్యతలు

Read More

స్టైల్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది.అందులో నిజం లేదని తెలిపింది. ఇలాంటి వార్తలు ప్రచురించ వద్దని చెప్పింది.పుష్ప 2 థాంక్స్ మీట్ కోసం బన్నీ ఢిల్లి వెళ్ళారు. అక్కడ ప్రముఖ పొలిటికల్ అనాలసిస్ నీ కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన పొలిటికల్ పార్టీ పెడుతున్నారని ప్రచారం జరిగింది.

Read More

తాను నటించిన అన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందడానికి అభిమానులే కారణం అన్నారు నటి నయనతార.ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోస్ అందరి ఫ్యాన్స్ తనని కూడా ఇష్ట పడుతుంటారని అన్నారు. తన సినిమాలను ఎంజాయ్ చేస్తుంటారని చెప్పారు. అందువల్లే తన సినిమాలు అన్నీ మంచి విజయాన్ని అందుకుంటున్నాయి అని ఆమె చెప్పారు.ప్రస్తుతం ఆమె ముక్తి అమ్మన్ 2 కోసం వర్క్ చేస్తున్నారు.

Read More

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ సంచలనం సృష్టించాడు. విశ్వనాథాన్ ఆనంద్ తరువాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. తాజాగా జరిగిన చివరిదైన 14వ గేమ్ లో విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ గేమ్ కు ముందు ఇరువురు ఆటగాళ్లు 6.5-6.5 తో సమంగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు మొదటి గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ గెలుపొందగా.. రెండో గేమ్ డ్రా అయింది. మూడో గేమ్ లో భారత యువ కెరటం గుకేశ్ విజయం సాధించాడు. ఆతర్వాత నుండి వరుసగా 7 డ్రా లతో ఈ ఛాంపియన్ షిప్ సాగింది. తరువాత గుకేశ్, లిరెన్ లు చెరొక విజయంతో నిలిచారు. మొత్తంగా ఇద్దరూ చెరొక రెండు గెలుపులు సాధించారు. అనంతరం జరిగిన డ్రాతో మొత్తం 9 గేమ్ లు డ్రా అయ్యాయి. ఇక ఈ ఛాంపియన్ షిప్ లో…

Read More