Author: admin

నట దిగ్గజం, మాజీ సీఎం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, యుగపురుషుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మహాపురుషుడు ఎన్టీఆర్ శతజయంతిని గత ఏడాది జరుపుకున్నాం. ఏడాది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉత్సవాలు జరిపి ఆయనకు ఘన నివాళి అర్పించాం. ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న ఈ సినీ వజ్రోత్సవ వేడుక అపూర్వ ఘట్టం. ఎన్టీఆర్ తొలిసారి నటించిన ‘మనదేశం’ చిత్రం విడుదలైన 75 ఏళ్లు కాగా ఎన్టీఆర్ మొదటి సినిమా హీరోయిన్ కృష్ణవేణి. 102 సంవత్సరాల వయసులోనూ ఈ వేడుకకు ఆమె హాజరుకావడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. కారణజన్ముల చరిత్ర మనం గుర్తు చేసుకోని స్పూర్తి పొందాలని…

Read More

పుష్ప 1, 2 లకు కొనసాగింపుగా పుష్ప 3 వస్తుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో విజయ్ దేవరకొండ యాక్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఈ కథనాలపై రష్మిక స్పందించారు. తనకు ఆ విషయం గురించి ఏం తెలియదు అన్నారు. సుకుమార్ ఎక్కువగా సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తారని చెప్పారు. పుష్ప 2 క్లెమాక్స్ లో చూపించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని తాను కూడా ఆశక్తిగా ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పారు. డిసెంబర్ 5 న విడుదల అయిన పుష్ప 2 ది రూల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేసింది. అతి తక్కువ సమయంలో ఆ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ సినిమాగా ఇది పేరు తెచ్చుకుంది.

Read More

‘ ఆర్ ఆర్ ఆర్ ‘ తో ఘన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన మహేష్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా షూట్ ప్రారంభం కానుంది. తాజాగా ఆయన ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేశారు. తన సతీమణి రమ తో కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో పాల్గొన్న ఆయన రవితేజ నటించిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలోని లంచ్ కొస్తవా, మంచె కొస్తవ పాటకు డాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. జక్కన్న డ్యాన్స్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Read More

దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న నేర సామ్రాజ్యం గురించి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పెరుగుతున్న నేరాల గురించి కేంద్రమంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. “భారత్లోని మెట్రో నగరాలతో పోలిస్తే అత్యధికంగా మహిళలపై నేరాలు జరుగుతున్నది దిల్లీలోనే. ఆవిషయంలో తొలి స్థానంలో ఉంది. హత్యలు, దోపిడీలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేర గణాంకాలను పరిశీలిస్తే ‘నేర రాజధాని’గా మన దేశం, దిల్లీ మారేలా ఉన్నాయి. పాఠశాలలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు తరచూ వస్తున్నాయి. డ్రగ్స్ సంబంధిత నేరాలు 300 శాతానికి పైగా పెరిగాయి” అని కేజీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

Read More

నటుడు అల్లు అర్జున్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కాల్ చేశారు. బెయిల్ పై విడులైన బన్నీ నీ పరామర్శించారు. తాజా పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెప్పారు. అల్లు అర్జున్ అరెస్టు అయిన విషయం తెలియడంతో శుక్రవారం సాయంత్రం అల్లు అరవింద్ కు సిఎం చంద్రబాబు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టు గురించి అడిగి తెలుసుకున్నారు అరవింద్ కు ధైర్యం చెప్పారు.

Read More

డిసీజ్ ఎక్స్ అనే కొత్త వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఇటీవల ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వ్యాధి వలన వందల మంది మరణించారు. ప్రస్తుతం డిసీజ్ ఎక్స్ వ్యాధి సోకిన రోగుల్లో జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తహీనత, తీవ్రమైన ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినది కావచ్చని భావిస్తున్నారు. కాంగో ప్రావిన్స్ లోని జీ హెల్త్ జోన్ లో అక్టోబర్ 24న ఈ వ్యాధి మొదటి సారిగా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసీజ్ ఎక్స్ ను ఎబోలా, జికా వైరస్ల జాబితాలో చేర్చింది. డిసీజ్ X” అనే పదం గ్లోబల్ ఎపిడెమిక్ లేదా పాండమిక్‌కు కారణమయ్యే అవకాశం ఉన్న ఊహాజనిత, తెలియని వ్యాధికారకాన్ని సూచిస్తుంది.

Read More

వైవిధ్యమైన కధాంశాలున్న చిత్రాలతో విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరించడంలో అల్లరి నరేష్ ముందుంటారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘బచ్చల మల్లి’. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.నేచురల్ స్టార్ నాని ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈసందర్భంగా చిత్ర‌ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 1990 నేపథ్యంలో సాగే ఈ కథలో నరేశ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. https://youtu.be/aggB9HZItzg?si=eloao4gZ5fyTFqDU

Read More

పంజాబ్-హార్యానా సరిహద్దు ప్రాంతమైన శంభు దగ్గర రైతులు మరోసారి ఢిల్లీ చలో మార్చ్ కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. రైతులు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం ఈ మార్చ్ చేస్తూన్నారు. రైతుల మార్చ్ ను దృష్టిలో ఉంచుకుని హార్యానా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఈరోజు ఉదయం నుండి ఈనెల 17 అర్థరాత్రి వరకు నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 6 నుండి రైతులు ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈరోజుతో కలిపి మూడు సార్లు పోలీసులు వారి ప్రయత్నాలు భగ్నం చేశారు.

Read More

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో ఎస్.ఏ.ఈ.ఎల్, నార్ఫండ్, ఎన్డీబీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ఐ.సీ.ఈ) పాలసీ కింద పెట్టుబడుల గురించి ఈసందర్భంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులను స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎస్.ఏ.ఈ.ఎల్ వారు వినియోగించే వినూత్నమైన వేస్ట్-టు-ఎనర్జీ టెక్నాలజీని గురించి కూడా వివరించిందని పేర్కొన్నారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించుకొని రైతుల ఆదాయాన్ని పెంచే ఇటువంటి ప్రాజెక్టులను ఏపీలో అభివృద్ధి చేయడానికి పూర్తి సహకారం అందించే దిశగా చర్చించినట్లు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న పరిస్థితుల గురించి చర్చించినట్లు పేర్కొన్నారు.

Read More

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను ఒక్కొకటిగా తొలగించుకుంటూ వస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే రూ.22 వేల కోట్ల విలువైన టెండర్లకు అధారిటీ ఆమోదం తెలిపింది, మరో రూ.20 వేల కోట్లకు నేడు జరిగే అధారిటీ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈరోజు వెంకటపాలెం వద్ద కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను మంత్రి పరిశీలించారు. 217 చదరపు కి.మీ ల పరిధిలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు 16 రోడ్లు,నార్త్ నుంచి సౌత్ కి 18 రోడ్లు వస్తున్నాయి మరియు సీడ్ కేపిటల్ నుంచి E11,E13,E15 రోడ్లను జాతీయ రహదారికి కలపేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రోడ్లలో ఎక్కువగా ఉన్న అటవీ భూమి తీసుకునే ప్రక్రియ చివరి దశకు వచ్చిందని పేర్కొన్నారు.

Read More