Author: admin

మీడియా వ్యక్తి పై చేయి చేసుకున్నందుకు చింతిస్తున్నాను అని నటుడు మోహన్ బాబు అన్నారు.తాను ఎన్ని సేవా కార్యక్రమాలు చేశానని ఈరోజు తాను చేసిన సేవలను పక్కన పెట్టేసి.. కొట్టిన విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించడం ఏం బాలేదని తెలిపారు.తాను ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఒక్కసారి అర్థం చేసుకోవాలని అన్నారు.తన కుటుంబ విషయాల్లో బయటవల్లు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమస్యలు ఎదో ఒక రోజు తప్పకుండా సద్దుమనుకుతాయని అన్నారు.మోహన్బాబు కుటుంబంలో ఆస్తి విషయంలో తగాదాలు నెలకొన్న విషయం తెలిసింది.మంగళవారం జలపల్లి లోని మోహన్ బాబు నివాసంలో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది.వివాదంలో భాగంగా కవరేజ్ చేయడానికి వెళ్లిన ఒక విలేకరి పై ఆయన మైక్ తో దాడి చేశారు.అనంతరం ఆయన హాస్పిటల్ లో చేరారు. ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు

Read More

న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ప్రజలను ఆకర్షించేందుకు అధికార ఆప్ పార్టీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.హామీల వర్షం కురిపిస్తుంది.తాజాగా మహిళల కోసం ప్రత్యేక హామి ఇచ్చారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. తాము మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెలా రూ.2,100 ఆర్థికసాయం చేస్తామని ప్రకటించారు. ‘నేను ప్రతి మహిళకు రూ. వెయ్యి ఇస్తానని హామీ ఇచ్చాను.ఈ ప్రతిపాదనకు గురువారం ఉదయం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.మరో 10-15 రోజుల్లో ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ డబ్బు అభ్యర్థుల ఖాతాల్లో బదిలీ చేయడం సాధ్యం కాదు.మరోవైపు ద్రవ్యోల్బణం కారణంగా ఆ మొత్తం చాలదని పలువురు మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు.అందుకే నెలకు రూ.2,100 ఇవ్వాలని నిర్ణయించాం’ అని తెలిపారు.

Read More

పశ్చిమ కనుమల్లో జీవవైవిధ్య సంరక్షణకు చేసిన కృషికి ప్రముఖ జీవావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కు ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ పురస్కారాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ పురస్కారం 2005లో స్థాపించబడింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (UNEP) కింద ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ప్రకటించే పురస్కారం అత్యున్నతమైనది. 2010 మార్చిలో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన 14 సభ్యుల మాధవ్ గాడ్గిల్ కమిటీ అద్భుతమైన జీవావరణానికి, అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న జీవజాతులకు ఆలవాలమైన పశ్చిమ కనుమలను పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన జోన్లుగా విభజించాలంటూ 2011 ఆగస్టు 31న కేంద్రానికి నివేదికను ఇచ్చింది. ఇక ఈ పురస్కారాన్ని 2009 లో తులసి తంతి, 2018లో ప్రధాని మోడీ, 2022లో పూర్ణిమా దేవి బర్మాన్ ఇదివరకు అందుకున్న భారతీయులుగా ఉన్నారు.

Read More

తన కుటుంబ పరువు,మర్యాదలను తక్కువ చేసేలా మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కొంతకాలం క్రితం నటుడు నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.తాజాగా ఈ విచారణను వచ్చే వారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.ఈ రోజు వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని గత విచారణ సందర్భంగా మంత్రికి కోర్టు సమన్లు జారీ చేసింది.పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరుకాలేక పోతున్నట్లు మంత్రి తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.మరో తేదీ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.ఈ క్రమంలోనే తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

Read More

అంతరిక్ష రంగంలో భారత్‌ వరుసగా అద్భుత విజయాలు అందుకుంది.ఈ మేరకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఓ కీలక ప్రకటన చేశారు.2035 ఏడాదికి భారత్‌కు సొంతంగా అంతరిక్ష కేంద్రం ఉంటుందని తెలిపారు.2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగు పెడుతాడని చెప్పారు.ఇప్పటికే అమెరికా, రష్యా, జపాన్, కెనాడా, యూరప్‌ దేశాలు కలిసి ఓ స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశాయి.అలాగే చైనా కూడా సొంతగా స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది.2035లో నాటికి ఇక భారత్‌కు కూడా సొంత అంతరిక్ష కేంద్రం ఉన్న దేశంగా నిలవనుంది. అంతరిక్ష పరిశోధనలు మెరుగుపరిచేందుకు అభివృద్ధి చేస్తున్న మాడ్యులర్‌ స్పేస్‌ స్టేషన్ తొలి మాడ్యూల్‌ 2028లో ఎల్‌వీఎం 3 వాహకనౌక ద్వారా ప్రారంభించనట్లు తెలుస్తుంది.నాలుగేళ్ల తర్వాత స్పేస్ స్టేషన్‌ తయారుకానుంది.అందులోని మాడ్యుల్స్‌ని వివిధ దశల్లో నింగిలోకి పంపిస్తారు.ఆ తర్వాత అంతరిక్షంలోనే వాటిని లింక్ చేస్తారు.మొత్తానికి 2035 నాటికి స్పేస్ స్టేషన్ పూర్తవుతుంది.ఈ స్టేషన్‌కు భారత అంతరిక్ష…

Read More

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం పుష్ప 2 ది రూల్.ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు.ఇందులో రష్మిక కథానాయిక నటించింది.ఈ నెల 5వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా ఇది విడుదల అయింది.అల్లు అర్జున్ నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు.తాజాగా ఈ చిత్రం మరో రికార్డు కొల్లగొట్టింది.విడుదలైన 6 రోజుల్లోనే రూ.1000 కోట్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది.బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్, కల్కి 2898 ఏడీ చిత్రాల తర్వాత రూ.1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన చిత్రం పుష్ప2 కావడం విశేషం.దీనిపై అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More

నటి కీర్తి సురేష్ వివాహం వేడుకగా జరిగింది.తన స్నేహితుడు ఆంటోనీతో గురువారం ఆమె పెళ్లి జరిగింది.గోవాలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు,సినీ ప్రముఖులు పాల్గొన్నారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు.దీనికి సంబంధించిన ఫొటోలను కీర్తి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.ఈరోజు సాయంత్రం క్రిస్టియన్‌ పద్ధతిలో మరోసారి వివాహ వేడుక నిర్వహించనున్నారని టాక్‌. కీర్తి సురేష్ – ఆంటోనీ దాదాపు 15 ఏళ్ల నుండి స్నేహితులు.కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ డిసెంబర్‌ 25న విడుదల కానుంది.

Read More

అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులలో ట్రేడింగ్ కొనసాగించాయి. నేటి ట్రేడింగ్ లో నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 236 పాయింట్ల నష్టంతో 81,289 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 93 పాయింట్ల లాభంతో 24,548 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.87గా ఉంది. హిందూస్తాన్ యూనీలివర్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, మారుతీ సుజుకి, ఎల్ అండ్ టీ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

వన్ నేషన్-వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. పార్లమెంటరీ హాల్ లో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. జమిలి ఎన్నికలు అనగా..వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు లోక్ సభ ఎన్నికలతో పాటు ఒకేసారి నిర్వహించడమే దీని ద్వారా ఎంతో సమయం ఖర్చు ఆదా అవుతుంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేతృత్వంలోని ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లుకు సంబంధించి పలు సిఫార్సులు చేసింది.

Read More

అధికారాన్ని కోల్పోయిన వైసీపీకి భారీ షాక్ తగిలింది.ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు రాజీనామా చేశారు.ఈమేరకు ఆయన మాట్లాడుతూ… పార్టీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు గుప్పించారు.కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే…ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదని ఆయన అన్నారు.ప్రభుత్వానికి కనీసం ఒక ఏడాది సమయం ఇవ్వాలని చెప్పారు.5 నెలల సమయం కూడా ఇవ్వకుండానే ధర్నాలు చేయాలంటే ఎలాగని ప్రశ్నించారు.ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలని అవంతి అన్నారు.5 ఏళ్ళు పాలించాలని కూటమికి ప్రజలు అవకాశం ఇచ్చారని వ్యాఖ్యానించారు.ఎన్నో పథకాలను అమలు చేసి కూడా… ఎన్నికల్లో ఓడిపోయామంటే…తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని చెప్పారు.పార్టీ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని అన్నారు.వైసీపీ పాలనలో పార్టీ కార్యకర్తలంతా నలిగిపోయారని చెప్పారు. తాడేపల్లిలో కూర్చొని జగన్ ఆదేశాలు ఇస్తుంటారని… క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడేది కార్యకర్తలని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో కార్యకర్తలకు గౌరవం లేదని విమర్శించారు. అవంతి రాజీనామా చేసిన కాసేపటికే మరో…

Read More