Author: admin

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్టులో భాగంగా ఇచ్చే యూనిఫాం, బెల్టులు, బ్యాగ్‌ల రంగులను ప్రభుత్వం మార్పు చేసింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తీసుకురానున్నారు. బెల్టుల అంచులకు నలుపు రంగు, మధ్యలో తెలుపు రంగు ఉండనుంది. బెల్టులపై కేవలం ప్రత్యేకంగా రూపొందించిన గ్రాడ్యుయేట్‌ బొమ్మతో కూడిన లోగో ఉండనుంది. బ్యాగ్‌లు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న వాటిని ప్రభుత్వం ఎంపిక చేసింది. యూనిఫాం లేత ఆకుపచ్చ, గులాబీ రంగు పెద్ద గడుల చొక్కా, లేత ఆకుపచ్చ రంగు ప్యాంట్‌తో కూడినవి ఇవ్వనున్నారు. 2025 జూన్‌ 12న బడులు తెరిచే రోజే విద్యార్థులకు అందించనున్నట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు త్వరలో టెండర్లు పిలవనున్నారు.

Read More

అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ నీ ఉద్దేశించి ఆయన విమర్శలు చేశారు.2021లో కరోనా వీజృమించిన సమయంలో అందజేసిన చెక్కుల్లో రాసుకొక్కుండా తెలివి తక్కువ పని చేశాను.2020లో ట్రంప్ పేరుతో చెక్కులు జారీ అయ్యాయి.దానివల్ల ఆయన ప్రజలకు డబ్బు ఇచ్చినట్టు అయింది.ఆయన పేరు పొందారు అని తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న ట్రంప్ వచ్చే నెల నుంచి అధికారాన్ని చేపట్టనున్నారు.

Read More

భార‌త ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాలో పర్యటిస్తున్నారు.ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కలినిన్‌గ్రాడ్ లోని యంటార్ షిప్‌యార్డ్‌ను సంద‌ర్శించారు. మల్టీ-రోల్ స్టెల్త్-గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ఐ.ఎన్.ఎస్ తుషిల్ ను నౌకాద‌ళానికి అందించారు. ఈ సంద‌ర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఐ.ఎన్.ఎస్ తుషిల్ నౌక భారతదేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. రష్యాతో దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. ఐ.ఎన్.ఎస్ తుషీల్ (F70) అనేది భారత నౌకాదళానికి చెందిన తల్వార్ -క్లాస్ ఫ్రిగేట్ . ఐఎన్‌ఎస్‌ తుషిల్‌’ యొక్క బరువు 3,900 టన్నులు కాగా, పొడవు 125 మీటర్లు.ఈ యుద్ధ నౌకలో భారత పరిజ్ఞానం 26 శాతం వరకు ఉంది. ఇందులో శక్తిమంతమైన ఆయుధాలు ఉంటాయి. వాటిలో గైడెడ్ మిసైళ్లను, అధునాతన రాడార్లు, ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. ఈ నౌక చేరికతో భారత నౌకాదళ సామర్థ్యం మరింత పెరిగింది. 2016లో భారత్- రష్యాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు, 250…

Read More

భూల్ భూలయ్య 3 తో విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్.తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన బాలీవుడ్ లో పరిస్థితులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.సినిమా విజయం అందుకున్నప్పటికీ ఇండస్ట్రీ లో ఒక్కరు కూడా తనకు మద్దతు ఇవ్వలేదని అన్నారు.తన విజయానికి ఎవరు కూడా అభినందనలు తెలపలేదని తెలిపారు.తాను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను అని వెల్లడించారు.కార్తిక్ చేసిన తాజాగా చేసిన కామెంట్స్ మరోసారి బీ టౌన్ లో కొత్త నటీనటులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే ప్రశ్న లేవనేతాయి.

Read More

‘మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ’ (ఎంఆర్‌ఎన్‌ఏ) కొవిడ్‌ టీకాలతో ప్రాణానికి ముప్పు ఉంద‌ని ప్రపంచవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య నిపుణులు తెలిపారు. శారీరక వైకల్యం బారినపడే అవకాశముందని వారు చెప్పారు. ఎంఆర్‌ఎన్‌ఏ తరహా కొవిడ్‌ టీకాల వినియోగాన్ని వెంటనే నిలిపివేయాల‌ని కోరారు. ఈ మేర‌కు వారు సంత‌కం చేసిన ఒక పిటిష‌న్ తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ టీకాల‌పై పూర్తి స్థాయివిచార‌ణ చేయాల‌ని చెప్పారు. సంప్రదాయ టీకాలకు భిన్నమైన ‘మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ’ (ఎంఆర్‌ఎన్‌ఏ) టీకాల వ‌ల్ల ఎంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయ‌ని గ‌తంలో ఎన్నో క‌థ‌నాలు చ‌క్క‌ర్లు కొట్టాయి.

Read More

డిజిటల్‌ యుగంలో సవాళ్లు పొంచి ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు.సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఆమె. సైబర్‌ నేరాలు, డీప్‌ ఫేక్, ప్రజల గోప్యతకు భంగం వంటి విషయాలు మానవులకు కొత్త ముప్పుగా పరిణమిస్తున్నాయని అన్నారు.వీటిని నివారించాలంటే ప్రజల హక్కులను, గౌరవాన్ని కాపాడే డిజిటల్‌ వాతావరణాన్ని కల్పించడం ముఖ్యమని మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి పేర్కొన్నారు. ముఖ్యంగా ఆమె ఏఐ టెక్నాల‌జీ గురించి మాట్లాడారు. ‘‘కృత్రిమ మేధ మన రోజూవారీ జీవితంలోకి వచ్చేసింది. మన సమస్యలను పరిష్కరిస్తూనే పలు కొత్త ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. దీనికి ప‌రిష్కారం వెత‌కాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంది’’ అని చెప్పారు.

Read More

రామ్‌చ‌ర‌ణ్ కథానాయకుడిగా, దర్శకుడు శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం “గేమ్ ఛేంజ‌ర్‌”.ఇందులో కియారా అడ్వానీ క‌థానాయిక‌గా నటిస్తుంది.ప్ర‌స్తుతం ఇది చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యం నెట్టింట వైర‌ల్‌గా మారింది.ఇటీవ‌ల విడుద‌లైన‌ నానా హైరానా పాట కోసం రూ. 10 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ని టాక్‌. మెలోడిగా రూపుదిద్దుకున్న ఈ పాట‌ను కార్తిక్‌, శ్రేయా ఘోష‌ల్ ఆల‌పించారు.ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందించారు.విడుద‌లైన వారం రోజుల్లోనే 40 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది ఈ పాట‌.జ‌న‌వ‌రి 10న ఈ చిత్రం విడుద‌ల కానుంది.శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు దీనిని నిర్మిస్తున్నారు.ఇందులో శ్రీ‌కాంత్‌,ఎస్‌జె సూర్య‌,అంజ‌లి కీల‌క పాత్ర‌లు పోషించారు.

Read More

2024 క్రీడా ఈవెంట్స్ లో భారతీయులు ఎక్కువగా వెతికిన వివరాలకు సంబంధించి గూగుల్ తాజాగా ఒక జాబితాను ప్రకటించింది. అందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి స్థానంలో నిలిచింది. భారతీయులు ఎక్కువగా శోధించిన క్రీడా ఈవెంట్స్: 1.ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2. టీ-20 ప్రపంచ కప్ 3.ఒలింపిక్స్ 4.ప్రో కబడ్డీ లీగ్ 5.ఇండియన్ సూపర్ లీగ్ 6.ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 7.కోపా అమెరికా 8.దులిప్ ట్రోఫీ 9.యూ.ఏ.ఎఫ్.ఈ యూరో 10.అండర్-19 ప్రపంచ కప్.

Read More

న‌టుడు మోహ‌న్‌బాబు అస్వ‌స్థ‌తకు గుర‌య్యారు. జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం సినీనటుడు మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మోహన్‌బాబు వెంట ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. మంచు మోహ‌న్ బాబు కుటుంబంలో గ‌త కొన్ని రోజుల నుంచి గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. మోహ‌న్‌బాబు, మ‌నోజ్ ప‌రస్ప‌ర ఫిర్యాదుల‌తో ఈ గొడ‌వ‌లు అంత‌టా చ‌ర్చ‌కు దారి తీశాయి. మంగ‌ళ‌వారం నుంచి రాత్రి వ‌ర‌కు జ‌ల్‌ప‌ల్లిలోని మోహ‌న్‌బాబు నివాసంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మనోజ్‌, మోహన్‌ బాబు లైసెన్స్‌ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిల్మ్‌నగర్‌ పోలీసులు వీరిద్దరి నుంచి తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నారు. మోహన్‌బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జర్నలిస్టులపై దాడికి దిగడంతో మోహన్‌బాబుకు వ్యతిరేకంగా పలువురు జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు. మీడియాపై దాడికి నిరసనగా ఆయన…

Read More

దేశ రాజ‌ధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఆప్ మ‌రోసారి అధికారం చేప‌ట్టేందుకు ఎంతో ప్ర‌య‌త్నిస్తుంది.ఈ మేర‌కు కేజ్రీవాల్ ప్ర‌చారంతో స్పీడ్ పెంచారు. తాజాగా ఓ ఆటో డ్రైవ‌ర్ ఇంట్లో స‌తీమ‌ణితో క‌లిసి ఆయ‌న భోజ‌నం చేశారు.ఆటో డ్రైవ‌ర్ల క‌ష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు.అనంత‌రం వారిపై వరాల జ‌ల్లు కురిపించారు.ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఐదు హామీలు ప్రకటించారు.వచ్చే ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్‌ కూతురి పెళ్లికి రూ.లక్ష సాయం ఇస్తామని తెలిపారు. అదే విధంగా ప్రతి దీపావళి,హోలీకి రూ.2,500, ఒక్కో ఆటోడ్రైవర్‌కు రూ.10 లక్షల జీవిత బీమా,రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని వెల్లడించారు. ఆటో డ్రైవర్ల పిల్లల పోటీ పరీక్షలకు సంబంధించిన ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుంద‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.

Read More