Author: admin

దేశ రాజ‌ధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఆప్ మ‌రోసారి అధికారం చేప‌ట్టేందుకు ఎంతో ప్ర‌య‌త్నిస్తుంది.ఈ మేర‌కు కేజ్రీవాల్ ప్ర‌చారంతో స్పీడ్ పెంచారు. తాజాగా ఓ ఆటో డ్రైవ‌ర్ ఇంట్లో స‌తీమ‌ణితో క‌లిసి ఆయ‌న భోజ‌నం చేశారు.ఆటో డ్రైవ‌ర్ల క‌ష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు.అనంత‌రం వారిపై వరాల జ‌ల్లు కురిపించారు.ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఐదు హామీలు ప్రకటించారు.వచ్చే ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్‌ కూతురి పెళ్లికి రూ.లక్ష సాయం ఇస్తామని తెలిపారు. అదే విధంగా ప్రతి దీపావళి,హోలీకి రూ.2,500, ఒక్కో ఆటోడ్రైవర్‌కు రూ.10 లక్షల జీవిత బీమా,రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని వెల్లడించారు. ఆటో డ్రైవర్ల పిల్లల పోటీ పరీక్షలకు సంబంధించిన ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుంద‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.

Read More

2025 ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి షెడ్యూల్ త్వరలో రానుంది. భారత్ ఆడే మ్యాచ్ లు మినహ పాకిస్థాన్ వేదికగా ఈ టోర్నీ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశాలు దాదాపు కష్టమేనని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కాగా, భధ్రతా కారణాలు రీత్యా బీసీసీఐ భారత జట్టును అక్కడికి పంపేందుకు నిరాకరించింది. ఈనేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ ఒకటే పరిష్కారమని ఐసీసీ పాక్ కు తేల్చి చెప్పింది. హైబ్రిడ్ మోడల్ కు సరేనని కానీ భవిష్యత్తులో తమ జట్టు కూడా ఐసీసీ టోర్నీలలో భారత్ కు వెళ్లకూడదని నిర్ణయిస్తే తమకు ఇదే విధంగా హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ లు ఏర్పాటు చేయాలని కోరింది. రెండు జట్లకు సమానంగా ఏ నిర్ణయం మైన ఉండాలని కోరింది ఇలా…

Read More

దీపం 2.O పథకం విజయవంతంగా అమలవుతోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ రోజు వరకూ రూ.476.15 కోట్లు సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేసినట్లు వివరించారు. ఉచిత గ్యాస్ సిలెండర్ ను లబ్ధిదారులైన ఆడపడుచులకు అందించే బృహత్తర కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం సఫలమైందని పేర్కొన్నారు. దీపం 2.O పథకం అమలును తెలిపే గణాంకాలను సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. పథకం అమలుకు మార్గనిర్దేశనం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. దీపం 2.O కు సహకరిస్తున్న ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. పారదర్శకంగా పాలించే మంచి ప్రభుత్వం ఇదని మనోహర్ పేర్కొన్నారు. దీపం 2.O పథకం విజయవంతంగా అమలవుతోంది. ఈ రోజు వరకూ రూ.476.15 కోట్లు సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేశాము. ఉచిత గ్యాస్ సిలెండర్ ను లబ్ధిదారులైన ఆడపడుచులకు అందించే బృహత్తర కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం…

Read More

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లేఖ రాశారు.రాష్ట్ర విభజనలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్‌ తీసుకోవాలి అని లేఖలో పేర్కొన్నారు.బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన అధికారంలో ఉన్నాయి.కేంద్రం నుండి రావాల్సినవి రాబట్టేందుకు పవన్‌ శ్రద్ధ పెట్టాలని కోరారు.సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యను కొలిక్కి తీసుకురావాలని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లేఖలో వెల్లడించారు.

Read More

హ‌రిక‌థ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ సంచలన వ్యాఖ్య‌లు చేశారు.హ‌రిక‌థ లాంటి క‌థ‌లో తాను భాగ‌మైనందుకు ఆనందంగా ఉంద‌ని చెప్పారు.దాదాపు 48 ఏళ్ల‌గా తాను ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాన‌ని చెప్పారు.ఈ సినిమా క‌థ విన్న‌ప్పుడు షాక‌య్యాన‌ని తెలిపారు.త‌న‌ను ఇందులో భాగం చేసిన వారికి ధ‌న్య‌వాదాలు చెప్పారు.ఇప్పుడున్న రోజుల్లో హీరో అనే మాట‌కు అర్థం మారిపోయింద‌న్నారు.చంద‌నం దుంగ‌ల దొంగ కూడా హీరో అంటూ ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు.ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి.ఆయ‌న ఎవ‌రిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని ప‌లువురు మాట్లాడుకుంటున్నారు.

Read More

అగ్ర దేశం అమెరికాను కెన‌డా ప్ర‌ధాని ట్రూడో హెచ్చ‌రించారు.తమ నుండి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై ట్రంప్‌ టారీఫ్‌లు విధిస్తే,చివరకు వారు కొనే ప్రతి వస్తువు ధరను పెంచుతుందని అమెరికా ప్రజలే అర్థం చేసుకొంటున్నారని ట్రూడో అన్నారు. హాలీఫాక్స్‌ ఛాంబరాఫ్‌ కామర్స్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయ‌న ఈ విధంగా మాట్లాడారు. కెనడాపై ట్రంప్‌ అదనపు సుంకాలు విధిస్తే…మేము ఏంటో చూపిస్తాం.ప్ర‌తిచ‌ర్య‌ల‌కు దిగుతాం అని ఆయ‌న అన్నారు. అమెరికాలో ట్రంప్‌ గత కార్యవర్గంతో పోలిస్తే కొత్త బృందంతో డీల్‌ చేయడం పెద్ద స‌వాలుగా ఉంద‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు.ప్రజల జీవితాలను సరళతరం చేస్తానన్న హామీతో ట్రంప్‌ అధికారం ద‌క్కించుకున్నారు.కానీ ఇప్పుడు వారికి అసలు వాస్తవాలు బోధపడుతున్నాయి.కెనడా నుండి వచ్చే ప్రతి వస్తువుపై సుంకాలు విధిస్తే…జీవన వ్యయాలు మరింత పెరిగిపోతాయని వారికి అర్థమవుతోంది’’ అని కెన‌డా ప్ర‌ధాని తెలిపారు.

Read More

ఆర్థిక‌ప‌ర‌మైన‌,రెగ్యులేట‌రీ స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతున్న బోయింగ్ సంస్థ ఉద్యోగుల్ని క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో తొల‌గించ‌నున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా అమెరికాలోని బోయింగ్ సంస్థ‌లో భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించారు. వాషింగ్ట‌న్‌, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఉన్న అద‌న‌పు ఉద్యోగుల‌ను తీసి వేశారు. సుమారు 17 వేల మందిని తొల‌గించే ప‌నిలో బోయింగ్ సంస్థ ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలోనే వాషింగ్ట‌న్ రాష్ట్రంలో 400 మంది, కాలిఫోర్నియా రాష్ట్రంలో 500 మందిని సంస్ధ విధుల నుంచి త‌ప్పించింది. అయితే, లేఆఫ్‌ల గురించి ఉద్యోగులకు ఇప్ప‌టికే స‌మాచారం అందించ‌డం జ‌ర‌గింద‌ని ఆ సంస్థ తెలిపింది.

Read More

అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహార వీరమల్లు’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పీరియాడికల్ కథాంశంతో రూపొందుతోంది. ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కీలక విషయాన్ని పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. పవన్ ఈ చిత్రీకరణలో పాల్గొననున్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ అలరించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం‌కీరవాణీ సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. నిష్ణాతులైన సాంకేతిక నిపుణులు ఈచిత్రానికి పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రం వచ్చే ఏడాది మార్చి 28న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలిపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీ.ఆర్.డీ.ఏ) ఆమోదించిన 20 సివిల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు సంబంధించి రూ.11,467 కోట్ల వ్యక్తమవుతుందని పేర్కొంది. వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టే విధంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, ప్రజా ప్రతినిధుల నివాసాలు, ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారుల నివాసాల నిర్మాణలు పూర్తి చేయడానికి నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. జడ్జిలు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లలో 1200 అపార్ట్మెంట్లు కోసం…

Read More

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని మార్చ‌డం అన్యాయం అని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత అన్నారు.తాజాగా ఆమె ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.బ‌తుక‌మ్మ‌ను విగ్ర‌హంలో చేర్చ‌క‌పోవ‌డాన్ని ఆమె త‌ప్పుబ‌ట్టారు.బ‌తుక‌మ్మ‌ను ఎందుకు పెట్ట‌లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు.ఉద్యమ కాలంలో పెద్దలు నిర్ణయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌తీక‌గా భావించే బతుకమ్మను విగ్రహంలో ఎందుకు చేర్చలేదు? తొమ్మిది మంది కళాకారులను సన్మానిస్తామన్నారు..ఆ జాబితాలో మహిళలు ఎక్కడ? స్ఫూర్తి నింపే తెలంగాణ తల్లి విగ్రహం కాదని…కాంగ్రెస్‌ తల్లిని పెట్టుకున్నారు.ఉద్యమకాలం నాటి ప్రతీకలను అవమానించే ప్ర‌యత్నం చేస్తున్నారు.సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్‌ తల్లిని తిరస్కరిస్తున్నాం’’ అని తెలిపారు.

Read More