భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 26న (బాక్సింగ్ డే) మెల్ బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ టికెట్లు భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఈ స్టేడియం కెపాసిటీ లక్ష కాగా ఇప్పటికే మొదటి రోజు ఆటకు సంబంధించిన టికెట్లన్నీ అభిమానులు కొనుగోలు చేశారు. తొలి రోజుకు సంబంధించి పబ్లిక్ కు అందుబాటులో ఉన్న టికెట్లన్నీ అమ్ముడైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఇక ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ విజయభేరీ మోగించింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచి 1-1తో సమంగా నిలిచింది. మొదటి రెండు టెస్టులకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఇక మూడవ టెస్టు బ్రిస్బేన్ లో గబ్బా వేదికగా ఈనెల 14న మొదలవనుంది. ఈ సిరీస్ లో గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించేందుకు రెండు జట్లూ పోటీపడుతున్నాయి.
Author: admin
రష్యా అధ్యక్షుడు పుతిన్ తనకు,చైనాకు మాత్రమే భయపడతారని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నకు తాను చెప్పినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ లతో ఇటీవల సమావేశమైన విషయం గురించి ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘దీర్ఘశ్రేణి క్షిపణులను అందించడం, రష్యా సైనిక సామర్థ్యాన్ని తగ్గించడం, వీలయినంత ఎక్కువమంది ప్రాణాలను కాపాడడమే మా లక్ష్యం.పుతిన్ నాకు, అమెరికాకు మాత్రమే భయపడతారు.ఇతర దేశాలు సాధించలేని వాటిని సాధించే సామర్థ్యం అమెరికాకు ఉందని మాకు తెలుసు.యుద్ధాన్ని ముగించడంలో ముందడుగు వేయాలంటే మనలో ఐక్యత అవసరం’’ అని జెలెన్‌స్కీ రాసుకొచ్చారు.ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
నేటి ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు మందకొడిగా ముగిశాయి. ఉదయం లాభాల్లో పయనించిన సూచీలు క్రమంగా ఫ్లాట్ గా కదలాడాయి. ఇక బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ పాయింట్ లాభంతో 81,510 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 8 పాయింట్ల నష్టంతో 24,610 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.85గా ఉంది. హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
నేటితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా డాక్టర్ శక్తికాంతదాస్ పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్బీఐ గొప్ప వారసత్వాన్ని సొంతం చేసుకున్న సంస్థ అని ఆయన తెలిపారు. ఆర్బీఐలో అధికారులు, సిబ్బందికి మధ్య అద్భుతమైన సమన్వయం ఉందని అన్నారు.మొత్తం ఆర్‌బిఐ బృందానికి ధన్యవాదాలు. విశ్వాసం మరియు విశ్వసనీయత కలిగిన సంస్థగా ఆర్‌బీఐ మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. తన పదవీ కాలంలో అందరూ సహకరించారని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కారణంగానే కోవిడ్ సమయంలోనూ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బంది రాలేదని తెలిపారు. 2018లో ఆర్ బీ ఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్.. పదవీ కాలం 2021లోనే పూర్తి అయింది.అయితే కేంద్రం ఆయన పదవిని మరో మూడేళ్లు పొడిగించింది.ఈ గడువు కూడా నేటితో ముగియనుంది. ఇక నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.గతంలో ఆయనకు రెవెన్యూ శాఖ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో విచారణ చేపట్టిన పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన వ్యక్తి ఈ బెదిరింపు కాల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని అతనిని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బందికి ఆగంతకుడి నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు రావడంతో పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, మెసేజులను ఉప ముఖమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. పేషీ అధికార్లు బెదిరింపు కాల్స్, మెసేజుల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో వెంటనే ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మితిమీరిన మాటలను పోలీసులు ఉపేక్షించాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి,సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చిన మాటలు అనే ఆయన ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.ఈ మేరకు ఈరోజు ఉదయం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.విజయసాయిరెడ్డిని జైలుకు పంపడానికి పింక్ డైమండ్‌పై చేసిన అసత్య ఆరోపణ ఒక్కటి చాలన్నారు.దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు జగన్‌తో అవినీతిలో ఆయన పోటీ పడ్డారని విమర్శలు చేశారు.
రాజ్యసభ ఛైర్మన్ గా ఉన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆయన పక్షపాత ధోరణిలో వ్యవహారిస్తున్నారని ఆరోపించింది. తీర్మానం ప్రవేశపెట్టాలంటే 50 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది కాగా 70 మంది మద్దతుగా సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు ఒకరు తెలిపారు. ఇక పార్లమెంటులో విపక్షాల నిరసనలపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. సభా గౌరవాన్ని కాపాడుకునేలా ప్రవర్తించాలని కోరారు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రజల ఆకాంక్షలని నెరవేర్చే విధంగా కృషి చేయాలన్నారు. ఇక ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
తన కుటుంబంలో జరుగుతోన్న గొడవల గురించి తాజాగా మీడియాతో మాట్లాడారు నటుడు మంచు మనోజ్.ఆస్తి, డబ్బు కోసం తాను పోరాటం చేయడం లేదని…ఆత్మ గౌరవం కోసమే తాను పోరాడుతున్నానని అన్నారు.తనకు ప్రాణహని ఉందని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తనకు రక్షణ ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు న్యాయం కావాలని పెద్దలను కలుస్తానని ఆయన తెలిపారు. ‘‘నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం.ఇది నా భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన విషయం.నన్ను అణగదొక్కేందుకు నా భార్యను బెదిరించారు. నా ఏడునెలల పాపను దీనిలోకి లాగారు. నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరాను. నాకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తామనే వారు నా మనుషులను బెదరగొట్టి వేరే వాళ్లని లోపలికి పంపించారు. నా మనుషులను ఇక్కడి నుంచి పంపించే అధికారం పోలీసులకు ఎక్కడిది? ఫిర్యాదు…
ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. పార్లమెంటు ముందు రాహుల్ తమాషా చేశారని విమర్శించారు. రాహుల్ గాంధీ తాజాగా ప్రధాని మోడీ, పారిశ్రామిక వేత్త అదానీ మాస్క్ లతో ఉన్న వ్యక్తులను ఇంటర్వూ చేయడంపై కిరణ్ రిజిజు ఈవిధంగా స్పందించారు. రాహుల్ గాంధీకి ప్రజల బాధలు పట్టవని అయితే మిగిలిన ఎంపీలు అలా కాదని తమను గెలిపించిన ప్రజలపై తమకు బాధ్యతలున్నాయని అన్నారు. రాహుల్ ప్రధానిని అవమానపరుస్తూ తమాషా చేశారని విమర్శించారు. ఇలాంటివి చేయడం సెలవులు ఆనందించడానికి విదేశాలకు వెళ్లడం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సమాజ్‌వాదీ పార్టీ, టిఎంసి, రాజ్యసభలోని కాంగ్రెస్ ఎంపీలందరూ, లోక్‌సభలో కొందరు కాంగ్రెస్ ఎంపీలు & చాలా మంది పార్టీ ఎంపీలు పార్లమెంటు చర్చలలో పాల్గొనేందుకు నిజంగా ఆసక్తి చూపుతున్నారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు,సైన్యాధికారులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.బెంగాల్,బిహార్,ఒడిశాలు తమ దేశంలో అంతర్భాగమంటూ బంగ్లాదేశ్‌కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు,మాజీ సైన్యాధికారులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ శాసనసభలో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. బంగ్లా నాయకులు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.‘‘మీరు బెంగాల్, బిహార్, ఒడిశాలను ఆక్రమిస్తుంటే మేం లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా? ఆ ఆలోచన కూడా చేయకండి’’ అని హెచ్చరించారు.భారత్ వైపు చూసే దమ్ము ఎవరికీ లేదు అని దీదీ తెలిపారు.అలాంటి ఆలోచనలు మానుకోవాలని ఆ దేశ నాయకులకు సూచించారు.బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు.
