Author: admin

అల్లు అర్జున్‌ను ప్రదర్శనపై తెలుగు అగ్ర కథానాయకుడు వెంకటేష్ ప్రశంసలు కురిపించారు.చూపు తిప్పుకోలేకపోయానంటూ ఎక్స్ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘‘అల్లు అర్జున్‌.. నీ యాక్టింగ్‌ అత్యద్భుతంగా ఉంది.ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రదర్శన ఇది.నీ నుండి చూపు తిప్పుకోలేకపోయా.దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి వస్తోన్న ప్రశంసలు చూస్తుంటే ఆనందంగా ఉంది.రష్మిక యాక్టింగ్‌ చాలా బాగుంది.చిత్ర దర్శకుడు సుకుమార్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తోపాటు టీమ్‌ అందరికి కంగ్రాట్స్‌’’ అని పేర్కొన్నారు.దీనిపై అల్లు అర్జున్‌ స్పందించారు.‘‘థాంక్యూ సర్‌.మీ నుండి ప్రశంసలు రావడం చాలా ప్రత్యేకంగా ఉంది.మా వర్క్‌ మీకు నచ్చినందుకు ఆనందంగా ఉందని రిప్లై ఇచ్చారు.

Read More

ఉమ్మడి ప్రకాశం జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సూపర్-6 అమలుపై కూటమి నేతల్ని ప్రజలు నిలదీస్తున్నారని దుయ్యబట్టారు. సమాధానం చెప్పలేక నెలకొక డైవర్షన్ పాలిటిక్స్‌ను కూటమి నేతలు తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ గత కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్నారని అసలు ప్రభుత్వంలో ఎవరున్నారు? అని నిలదీశారు. మెడికల్ కాలేజీలు, పోర్టులను ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. మనం అందరం పోరుబాట పట్టాల్సిన టైమ్ వచ్చేసిందని శ్రేణులకు పిలుపునిచ్చారు.

Read More

వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్ లో నేడు జిల్లా కలెక్టర్ల సదస్సు జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులు, అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనకు ఆరు నెలలు పూర్తవుతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహించి 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది రెండో కలెక్టర్ల సదస్సు. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం ద్వారా గత ప్రభుత్వ హయాంలో వెంటిలేటర్ మీదకు వెళ్లిన రాష్ట్రానికి ఆక్సిజన్ అందించి ప్రజలు బతికించుకున్నట్టు అయ్యిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని తీసుకొస్తుందని ఆ సంక్షోభాన్ని పరిష్కరించడం ద్వారా మన నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని వివరించారు. ఐటీ మంత్రి ఇటీవల అమెరికా పర్యటనలో వివిధ కంపెనీలతో చర్చించారని…

Read More

మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తమ మిత్రుల కోసం మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా ఉపయోగించడం ఆపాలని ఆరోపించారు. ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ కు చెందిన ప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతి భారతీయునికి క్రెడిట్ యాక్సెస్ కల్పించేలా రూపొందించబడ్డాయి. మోడీ ప్రభుత్వం ఈ జీవనాడి లాంటి వాటిని ధనిక మరియు శక్తివంతమైన సంస్థలకు మాత్రమే ప్రైవేట్ ఫైనాన్షియర్‌లుగా మార్చిందని ఆరోపించారు. నేను ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాను, వారు మన ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థితి మరియు సామాన్య ప్రజలపై దాని ప్రభావం గురించి వివరించారని తెలిపారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రజల కంటే లాభానికి ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తుంది మరియు తద్వారా ప్రజలకు సమర్థవంతంగా…

Read More

నిన్న ఫ్లాట్ గా ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు కూడా దాదాపుగా ఫ్లాట్ గానే ముగిశాయి. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులలో పయనించి ఆఖరికి స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 16 పాయింట్ల లాభంతో 81,526 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 31 పాయింట్ల లాభంతో 24,641 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.82గా ఉంది. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, అల్ట్రా టెక్ సిమెంట్స్, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

సిరియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారత పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 75 మంది భారతీయులను సిరియా రాజధాని డమాస్కస్ నుండి లెబనాన్ కు తరలించారు. భారతీయ పౌరులు సురక్షితంగా లెబనాన్ చేరుకున్నారని, కమర్షియల్ ఫ్లైట్స్ ద్వారా స్వదేశానికి తిరిగి వస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిరియాలోని భారతీయ పౌరుల అభ్యర్థనలు, అక్కడి భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తరువాత మన పౌరులను తీసుకొని రావడానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. డమాస్కస్, బీరట్ లోని భారత రాయబార కార్యాలయాలు దీనికి సహకరించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక తాజాగా తరలించిన 75 మందిలో జమ్మూ కశ్మీర్ చెందిన 44 మంది యాత్రికులు ఉన్నారు. వారు సైదా జైనాబ్ వద్ద చిక్కుకుపోయారని మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాలలో ఉన్న భారతీయ పౌరుల భద్రతకు భారత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని…

Read More

వివాహితులైన మహిళల రక్షణార్ధం ఉద్దేశించిన చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అత్తవారింట్లో భర్త మరియు వారి తరపు కుటుంబ సభ్యుల వేధింపుల నుండి రక్షణ కల్పించడం కోసం తీసుకువచ్చిన 498 ఏ చట్టాన్ని కొందరు వ్యక్తిగత కక్ష సాధించడం కోసం తప్పుడు కేసులు పెడుతున్నారని ఆక్షేపించింది. పోలీసులు, యంత్రాంగం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యక్తిగత కక్ష సాధింపులకు తావు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈమేరకు తెలంగాణకు సంబంధించిన ఓ కేసు విచారణలో భారత అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి రద్దు చేయాలంటూ తాను కోర్టుకెక్కితే భార్య తనపై వేధింపుల కేసు పెట్టిందని, తప్పుడు ఉద్దేశంతో కక్ష సాధింపు కోసం పెట్టిన ఈ కేసును కొట్టేయాలని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి సుప్రీంను ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ ను కొట్టేయడంతో సుప్రీంలో ఈ పిటిషన్ వేశారు. దీనిని…

Read More

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి,పవర్ స్టార్,పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అత్యధికంగా శోధించిన రెండవ నటుడిగా అవతరించారు.2024లో ఎక్కువగా సెర్చ్ చేసిన నటుల జాబితాను సంస్థ విడుదల చేసింది.ఇందులో హాస్య నటుడు కాట్ విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు.నటుడిగా, రాజకీయ వేత్తగా ఈ ఏడాది పవన్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలవడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారని గూగుల్ పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ జాబితాలో అత్యుత్తమ స్థానం దక్కించుకున్న భారతీయ నటుడు కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈ జాబితాలో భారత్ నుంచి హీనా ఖాన్, నిమ్రత్ కౌర్ కూడా ఉండటం విశేషం.

Read More

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లోని అండ‌ర్ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీ.యూ.ఈ.టీ) ను వచ్చే సంవత్సరం (2025) నుండి కంప్యూటర్‌ బేస్డ్ టెస్టు (సీ.బీ.టీ) విధానంలో నిర్వహించనున్నట్లు యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ తెలిపారు. అంతేకాకుండా ఈ పరీక్షల్లో సబ్జెక్టులను 63 నుండి 37కు తగ్గిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంతకుముందు అభ్యర్థులు గరిష్ఠంగా ఆరు సబ్జెక్టులలో పరీక్షలు రాసే వీలుండేదని ఇప్పుడు వాటిని ఐదుకు తగ్గిస్తున్నట్లు తెలిపారు.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న గృహ నిర్మాణాలపై తాజాగా సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వ‌హించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గానికీ ఒక మోడల్ కాలనీని నిర్మించ‌నున్న‌ట్టు ఈసందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న కాలనీలలో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Read More