ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ నుండి దేశ రాజధాని ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసు ప్రారంభించిబడింది. ఇటీవలే ముంబైకి కూడా నేరుగా విమాన సర్వీసు ప్రారంభించారు. ఇక ఢిల్లీ నుండి రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్ పోర్ట్ కు మొదటి విమాన సర్వీసు విమానం చేరుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఢిల్లీ నుండి నేరుగా అక్కడికి చేరుకున్నారు. విమానం రన్ వే పై దిగిన అనంతరం వాటర్ కెనాల్స్ తో స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Author: admin
నేడు ప్రముఖ నటులు సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదినం. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. నా ప్రియ మిత్రుడు లెజెండరీ రజనీకాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మరియు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా దర్శనం కాస్త ఆలస్యం అవుతుందని భక్తులు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
తన గురించి సోషల్ మీడియా లో వైరల్ గా మారిన వార్తలను ఉద్దేశించి సాయి పల్లవి అసహనం వ్యక్తం చేశారు.రామాయణ సినిమా కోసం ఆమె నాన్ వెజ్ మానేశారని…షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా చెఫ్ నీ వెంట తీసుకువెళ్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ కథనాలపై ఆమె తాజాగా స్పందించారు.ఆయా వార్తల్లో నిజం లేదని అన్నారు.ఇలాంటి పనికిమాలిన వార్తలు రాస్తే లీగల్ గా యాక్షన్ తీసుకుంటాను అన్నారు.రామాయణ ప్రాజెక్టు తో సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.నితీశ్ తివారీ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
నటుడు మోహన్ బాబు పై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు అయింది.నిన్న జలపల్లి లోని తన నివాసానికి కవరాజ్ కోసం వెళ్లిన ఒక విలేకరి పై ఆయన దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిని సీరియస్ గా తీసుకున్న జర్నలిస్టులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు బీఎన్ఎస్ 118 కింద కేసు పెట్టారు. తాజాగా నిపుణుల సూచన మేరకు దానిని బీఎన్ఎస్ 109 అటెంప్ట్ టు మర్డర్ కింద మార్చారు. మరోవైపు ప్రస్తుతం ఆయన కాంటినెంటల్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు.
ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచ కప్-2034కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఫిఫా అధికారికంగా ధృవీకరించింది. ఈ మెగా టోర్నీ నిర్వహాణ కోసం సౌదీ ఒక్కటే ఆసక్తి చూపడంతో ఆ దేశానికే ఆతిథ్య హక్కులు దక్కాయి. 15 నెలల పాటు జరిగిన బిడ్ ప్రక్రియలో సౌదీ మాత్రమే ఆసక్తి కనబరిచింది. ఇక 2030 ఫిఫా ప్రపంచ కప్ ను ఆరు దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి. పోర్చుగల్, స్పెయిన్, మొరాకో లో ఎక్కువ మ్యాచ్ లు జరుగుతాయి. అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే లో ఒక్కో మ్యాచ్ నిర్వహించనున్నారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు అనుభవం రాళ్ళు, కొండలతో ఉన్న మాదాపూర్ ప్రాంతంలో ఆయనకు ఒక మహా నగరం కనిపించింది. ఈరోజు సైబరాబాద్ మహా నగరంగా మారింది అంటే ఆయన విజన్ కారణమని పేర్కొన్నారు. ప్రతీరోజూ మా కార్యాలయాల ముందుకు వివిధ వర్గాల ప్రజలు వచ్చి సమస్యలు చెప్తున్నారు. జీతాలు పెంచలేకపోతున్నాం, మొన్న సత్యసాయి జిల్లాలో కనీసం 30 కోట్లు జీతాలు గత ప్రభుత్వం ఇవ్వలేకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఇవ్వగలిగామని తెలిపారు. జరిగిన తప్పులను సరిదిద్ది, రాష్ట్ర వ్యవస్థలను గాడిలో పెట్టడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు తెలిపారు. దయచేసి అందరూ సహకారం అందించాలని కోరారు. ఉదాహరణకు కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ 3 చెక్ పోస్టులు పెట్టిన తరవాత కూడా ఇంకా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే…
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన మూడో వన్డేలో కూడా భారత మహిళల జట్టు 83 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదటి రెండు మ్యాచ్ లు ఓడి సిరీస్ కోల్పోయిన భారత్ నామమాత్రమైన మూడో మ్యాచ్ లో కూడా తడబడింది. దీంతో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్లాండ్ (110) సెంచరీతో రాణించింది. కెప్టెన్ తహ్లియా మెక్ గ్రాత్ (56 నాటౌట్), ఆష్లే గార్డెనెర్ (50) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 వికెట్లు, దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 45.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటయింది. స్మృతి మంథాన (105) సెంచరీతో మంచి ప్రదర్శన కనబరిచింది.…
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ ,నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం “హరిహర వీరమల్లు”.ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.గతంలో ఈ చిత్రం 60 శాతం వరకు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించగా కొన్ని అనివార్య కారణాలు వలన ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ చివరిదశలో ఉంది.తాజాగా ఈ చిత్రం గురించి నిధి అగర్వాల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో పాల్గొన్న ఆమె సినిమా చిత్రీకరణ చాలా వరకూ పూర్తైందన్నారు.ప్రేక్షకులకు తప్పకుండా ఇది నచ్చుతుందని చెప్పారు.పవన్‌కల్యాణ్ గారితో వర్క్ చేయడం గొప్ప అనుభవం అని నటి నిధి అగర్వాల్ అన్నారు.ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె చెప్పారు.మార్చి 28న విడుదల కానుంది.రెండు భాగాలుగా ఈ చిత్రం సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈమేరకు 2025 మార్చి 17 నుండి ప్రారంభమై మార్చి 31 వరకు జరగనున్నాయి. విద్యార్థులు మెరుగ్గా సమాయత్తం అవ్వడానికి మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ రోజులలో పరీక్షలను ప్లాన్ చేసారు. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ అదనపు సమయాన్ని అధ్యయనం చేయడానికి మరియు అద్భుతమైన స్కోర్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించుకోండి! నా సోదరులు మరియు సోదరీమణులందరికీ శుభాకాంక్షలు! అని లోకేష్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
