లాభాలు ఆశచూపి పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొడుతున్న కాల్ సెంటర్ల గుట్టును రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ బయటపెట్టింది.అంతర్జాతీయ నెట్‌వర్క్‌గా పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా ప్రజలను వీరు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.ఈ కాల్‌సెంటర్లలో పనిచేసేవారు రోజూ వివిధ దేశాలకు చెందిన వందల మందికి ఫోన్ చేసి పెట్టుబడుల స్కీమ్‌లు అంటూ ఆశజూపుతున్నారు. భారీ లాభాలు వస్తాయంటూ వారిని బుట్టలో వేసుకుని డబ్బుల కట్టించుకుంటారు. ఇలాంటి మోసపూరిత చర్యలతో బాధితుల నుంచి రోజుకు కనీసం 1 మిలియన్ డాలర్ (భారత కరెన్సీలో దాదాపు రూ.8 కోట్లు) దోచుకుంటున్నారని అధికారులు తెలియజేశారు. భారత్ తోపాటు దాదాపు 50కి పైగా దేశాల్లో వీరి బాధితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన వారు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.
Author: admin
మోహన్‌బాబు,మనోజ్ పరస్పర ఫిర్యాదులతో మంచు కుటుంబంలోని గొడవలు బహిర్గతం అయ్యాయి.ప్రస్తుతం ఇది తీవ్ర చర్చకు దారి తీసింది.మోహన్‌బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్, ఆయన సతీమణి మౌనికపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.తాజాగా మనోజ్ బహిరంగ లేఖ రాశారు.ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని అన్నారు.తనకు న్యాయం కావాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను ట్యాగ్ చేశారు. ‘‘నా (Manchu Manoj)పై, నా భార్య మౌనికపై మా నాన్న మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన,తప్పుడు,నిరాధార ఆరోపణలను ప్రస్తావిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది.మా నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా,నా పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగమిది.నా గొంతు బలంగా వినిపించకుండా, కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నమిది’’ అని మనోజ్ పేర్కొన్నారు.పది అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణ ఇచ్చారు.కుటుంబ విషయాలను ప్రస్తావించారు.ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. My humble request…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీ, అదానీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న సంగతి తెలిసిందే. అదానీపై వచ్చిన ఆరోపణల. నేపధ్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నేడు వినూత్నంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అదానీ మోడీ చిత్రాలతో ఉన్న బ్యాగులతో విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంటు ఆవరణలో నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాతో సహా పలువురు విపక్ష ఎంపీలు వినూత్న బ్యాగులను ధరించి వచ్చారు. ఈక్రమంలో ప్రియాంక గాంధీ వాద్రా వద్ద ఉన్న బ్యాగును రాహుల్ గాంధీ పరిశీలించారు. అనంతరం ఆ బ్యాగులను ధరించి ఆయన కూడా నిరసన తెలిపారు.
నటుడు మంచు మనోజ్,ఆయన సతీమణి మౌనికపై కేసు నమోదైంది.కుటుంబంలో కలహాలు తలెత్తడంతో మనోజ్‌పై ఆయన తండ్రి మోహన్ బాబు నిన్న సాయంత్రం రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఆస్తుల విషయంలో తగాదాలు ఏర్పడ్డాయని ఫిర్యాదులో పేర్కోన్నారు.ఆగంతకులతో కలిసి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఈనేపథ్యంలోనే మనోజ్ – మోనిక దంపతులపై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, మనోజ్ కూడా నిన్న పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.విజయ్ రెడ్డి, కిరణ్ అనే వ్యక్తులపై ఆయన నిన్న పహాడీ షరీఫ్‌లో ఫిర్యాదు చేశారు.
నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు కొంతకాలం క్రితం వెన్ను గాయమైన విషయం తెలిసిందే.తాజాగా ఆమె తన ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చారు.తాను ప్రస్తుతం కోలుకుంటున్నానని అన్నారు.శరీరం చెప్పే మాట వినాలని దాన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నారు. తాను చేసిన తప్పు మరెవరూ చేయొద్దని తెలిపారు. గాయమైనప్పుడు నేను పెద్దగా లెక్క చేయలేదు.రెండు వారాల్లో తగ్గిపోతుందనుకున్నా.తీరా చూస్తే ఇప్పటికి ఎనిమిది వారాలు అయింది.ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటా.నేను చెప్పేది ఒక్కటే నేను చేసిన తప్పు మీరు చేయొద్దు అన్నారు.80కేజీల బరువు ఎత్తుతున్నప్పుడు రకుల్‌కు గాయమైన సంగతి విధితమే. గాయాన్ని ఆమె లెక్క చేయలేదు.నొప్పి తీవ్రతరం కావడంతో వైద్యులను సంప్రదించగా..కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఎన్నికల సమయం దగ్గరవుతున్న కొద్దీ అక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఇటీవల విడుదలైన పుష్ప 2 పోస్టర్లతో అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య వాడి వేడి రాజకీయం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ, ఆప్ పార్టీలు…సోషల్ మీడియా సహా అన్ని మాధ్యమాల ద్వారా ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ క్రమంలో కేజ్రీవాల్ ‘ఝుకేగా నహీ (తగ్గేదేలే)’ అంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ ఇటీవల ఓ పోస్టర్ విడుదల చేసింది.పుష్ప సినిమాలో హీరో పోజులో ఉన్న కేజ్రీవాల్..చీపురు చేత పట్టుకొని నాలుగోసారి మళ్లీ అధికారం తమదేనని ఆ పార్టీ పేర్కొంది.దీనికి బీజేపీ దీటుగా సమాధానం ఇచ్చింది.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్…పుష్ప క్యారక్టెర్ తరహాలోనే కుర్చీలో కూర్చున్నట్లు దానిని రూపొందించారు.‘అవినీతిపరులను అంతం చేస్తామంటూ.. ‘రప్పా-రప్పా’ అని రాసి ఉన్న ఆ పోస్టర్‌ను ఆ పార్టీ విడుదల చేయడంతో దిల్లీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.ప్రస్తుతం…
కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎమ్.కృష్ణ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో కన్నుమూశారు. యాభై ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పాత్ర పోషించారు.1932 మే1 న కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లా సోమనహాళ్లిలో జన్మించిన ఆయన 1962లో ఎన్నికల్లో పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా మద్దూర్ నుండి గెలిచి 30 ఏళ్లకే శాసనసభలోకి ప్రవేశించారు. 1989-93 శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. 1993-94లో డిప్యూటీ స్పీకర్ గా కూడా ఉన్నారు. 1999-2004 మధ్య కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2004-2008 వరకు మహారాష్ట్ర గవర్నర్ గా పని చేశారు. 2009-12 మధ్య విదేశాంగ మంత్రిగా ఉన్నారు. 1971-2014 వరకు పలుమార్లు లోక్ సభ, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేశారు. 2017లో బీజేపీ లో చేరారు. గతేడాది…
తనకు ప్రాణహనీ ఉందని తెలిపారు నటుడు మంచు మనోజ్ తెలిపారు.తాజాగా ఆయన ఫహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.దాదాపు 10మంది ఆగంతకులు ఆదివారం తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహనీ ఉందని చెప్పారు. నిన్న తన నివాసానికి వచ్చిన కిరణ్, విజయ్ అనే వ్యక్తులు ఇంటి సీసీ టీవీ ఫుటేజ్‌ని బలవంతంగా తీసుకువెళ్లారని చెప్పారు.ఫిర్యాదు మేరకు మనోజ్ స్టేట్‌మెంట్ రికార్డు చేశామని సీఐ మీడియాతో తెలిపారు.ఈ ఫిర్యాదులో కుటుంబ సభ్యుల పేర్లు లేవని ఆయన స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలోని ఓ రైతుకు వింత అనుభవం ఎదురైంది. పట్టణానికి చెందిన మన్హర్‌కు కోళ్ల ఫామ్ ఉంది.దాన్ని మరింత పెద్దగా చేయాలని అతడు భావించాడు.అందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో బ్యాంకులో లోను తీసుకోవాలని భావించాడు.స్థానిక బ్యాంక్ మేనేజర్‌ను కలవగా..నాటు కోడి లంచంగా ఇవ్వమని కోరాడు.లోన్ కోసం ఆ రైతు మేనేజర్ ఒక కోడిని ఇచ్చాడు.అది మొదలు దాదాపు రూ.39 వేలు విలువ చేసే నాటు కోళ్లను మేనేజర్ లాగించేశాడు.నెలలు గడుస్తున్నా పని జరగకపోవడంతో ఆ రైతు నిరాశకు గురయ్యాడు.పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలో 13,86,630 మందికి ఈ.ఎస్.ఐ కింద ఆరోగ్య భీమా ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖా సహాయమంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. లోక్ సభలో టీడీపీ ఎంపీలు బైరెడ్డి శబరి, కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతితో కలిపి మొత్తం 560 బెడ్స్ సామర్థ్యంతో ఈ.ఎస్.ఐ హాస్పిటల్స్ మంజూరు చేసినట్లు వివరించారు. 345 బెడ్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ హాస్పిటల్స్ కు 745 పోస్ట్ లు మంజూరు చేయగా 473 పోస్ట్ లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. విజయనగరంలో 100 బెడ్స్ హాస్పిటల్ 48%, విశాఖపట్నంలో 400 బెడ్స్ హాస్పిటల్ 32% పూర్తయినట్లు వివరించారు. అచ్యుతాపురం లో హాస్పిటల్ ఇంకా టెండర్ల దశలో ఉన్నట్లు తెలిపారు. ఇక ఆయా హాస్పిటల్స్ కు మంజూరు చేసిన నిధులు ఖర్చైన నిధుల వివరాలను వెల్లడించారు.