Author: admin

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు నియమించబడ్డారు. ఈమేరకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక తాజా నిర్ణయంతో జనసేన నుండి నలుగురికి ఏపీ మంత్రివర్గంలోకి స్థానం లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి బీద మస్తాన్ రావు, సాన సతీష్ , భారతీయ జనతా పార్టీ నుండి ఆర్. కృష్ణయ్య పేర్లు ప్రకటించారు. ఇక జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనదని చంద్రబాబు పేర్కొన్నారు.

Read More

జపాన్ విద్యా విధానాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విశేష గుర్తింపు ఉన్న విష‌యం తెలిసిందే.ప్ర‌ముఖులు సైతం దీనిని ప్ర‌శంసిస్తుంటారు.ఈనేప‌థ్యంలోనే జ‌పాన్‌కు చెందిన ఒక కంపెనీ సరికొత్త ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చింది.జపాన్‌కు వచ్చే విదేశీ పర్యటకులను ఆకట్టుకునేందుకు ఉండోకయ (Undokaiya) అనే సంస్థ సరికొత్త పథకాన్ని రూపొందించింది. తమ దేశానికి వచ్చే విదేశీ పర్యటకులు రూ.17వేలు చెల్లిస్తే…వారికి ఒక రోజంతా అక్కడి మాధ్యమిక పాఠశాల విద్యార్థి పొందే అనుభవాలను కల్పిస్తామని ప్రకటించింది.ఇందులో పాల్గొనాలనుకునే వారికి వయసుతో సంబంధం లేదని చెప్పింది.ఏ వయసు వారైనా విద్యార్థి జీవితాన్ని ఆస్వాదించవచ్చని వెల్ల‌డించింది.ప్రతిరోజూ 30 మందికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుందని చెప్పింది.

Read More

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ రేసు రసవత్తరంగా సాగుతోంది. తాజాగా సౌతాఫ్రికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేరుకుంది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో గెలిచి 63.33% తో మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్ గెలిస్తే సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. త్వరలో పాక్-సౌతాఫ్రికా జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగనుంది. ఇక ఆస్ట్రేలియా ప్రస్తుతం 60.71% తో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. భారత్ 57.29%తో మూడో స్థానంలో ఉంది. మరోవైపు శ్రీలంక ఫైనల్ రేసులో 45.45% వెనుకబడింది. దీంతో ప్రధానంగా పోటీ సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా-భారత్ లో మధ్యే ఉంది. ఆసీస్ తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది.…

Read More

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో 11వ గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ పై గెలిచి 6-5తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ తాజాగా జరిగిన 12 వ గేమ్ లో ఓటమి చెందాడు. దీంతో ఇరువురు ఆటగాళ్లు మళ్లీ 6-6 సమమయ్యారు. గడిచిన రౌండ్లలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న గుకేశ్ ఈ రౌండ్ లో స్థాయికి తగిన విధంగా రాణించలేకపోయాడు. ఇక ఈ ఛాంపియన్ షిప్ లో ఇంకా 2 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఇప్పటివరకు మొదటి గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ గెలుపొందగా.. రెండో గేమ్ డ్రా అయింది. మూడో గేమ్ లో భారత యువ కెరటం గుకేశ్ విజయం సాధించి సమం చేశాడు. ఆతర్వాత నుండి వరుసగా 7 డ్రా లతో ఈ ఛాంపియన్ షిప్ సాగింది. మొత్తం 8 గేమ్ లు డ్రా అయ్యాయి.

Read More

కరేబియన్‌ దేశం హైతీలో దారుణం జ‌రిగింది.సైట్ సోలైల్ మురికి వాడ‌లో ఉన్న వివ్‌ అన్సన్మ్‌ గ్యాంగ్‌కు మోనెల్‌ మికానో ఫెలిక్స్‌ అనే వ్యక్తి నాయకుడు. ఇటీవల అతడి కుమారుడు అనారోగ్యానికి గుర‌య్యాడు.దీంతో అత‌డు ఓ మంత్రగాడిని క‌ల‌వ‌గా…త‌న కుమారుడికి చేత‌బ‌డి చేసిన‌ట్లు తెలుసుకున్నాడు.ఆ ప్రాంతంలోని వృద్ధుల వ‌ల్లే త‌న కుమారుడికి ప్రాణ హ‌నీ ఉంద‌ని మంత్రగాడు చెప్ప‌డంతో మోన‌ల్ తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యాడు.మురికివాడలో ఉన్న 60 ఏళ్లు పైబడిన వృద్ధులపై అతడి ముఠా సభ్యులు దాడి చేశారు.ఈ దాడి కార‌ణంగా రెండు రోజుల్లో 110 మంది ప్రాణాలు కోల్పోయార‌ని అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాలు పేర్కొన్నాయి.

Read More

రెబల్ స్టార్ ప్ర‌భాస్ భోజ‌న ప్రియుడ‌నే విష‌యం తెలిసిందే. అతిథుల‌ను గౌర‌వించ‌డంలోనూ ఆయ‌న ముందుంటారు.అతిథుల‌కు మంచి భోజనాలు పంపిస్తుంటారు.తాజాగా ఆయ‌న న‌టుడు జ‌గ‌ప‌తిబాబుకు ఆయ‌న భోజ‌నం పంపించారు.దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు.వివాహ భోజ‌నంబు…ఇది ప్ర‌భాస్ ప్ర‌మేయం లేకుండా జ‌రిగింది.ఎవ‌రూ చెప్పొద్దు.చెప్తే ఇత‌ను పెట్టే ఫుడ్‌తో బ‌లి.అదే బాహుబ‌లి లెవ‌ల్‌…బాగా తిని సుష్టిగా పడుకున్నానని ఆయ‌న పేర్కొన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బందికి ఆగంతకుడి నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఒక ఆగంతకుడు చంపేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు పంపించినట్లు జనసేన పార్టీ సోషల్ మీడియాలో పేర్కొంది. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, మెసేజులను ఉప ముఖమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. పేషీ అధికార్లు బెదిరింపు కాల్స్, మెసేజుల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి పేషీకి బెదిరింపు కాల్స్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి కార్యాలయ సిబ్బందికి ఆగంతకుడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరించిన ఆగంతకుడు. ఆ క్రమంలో అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు పంపించాడు. పేషీ సిబ్బంది బెదిరింపు…— JanaSena Party (@JanaSenaParty) December 9, 2024

Read More

భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత పేసర్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య పరస్పరం మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. వీరివురిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలకు ఉపక్రమించింది. మహామ్మద్ సిరాజ్ కు 20% ఫైన్ విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి లోని ఆర్టికల్ 2.5ని ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించింది. ఇక ఇద్దరికీ చెరొక డీ మెరిట్ పాయింట్లు ఇచ్చింది. ఇద్దరూ తమ తప్పు అంగీకరించారని మ్యాచ్ రిఫరీ ప్రతిపాదించిన చర్యలకు అంగీకారం తెలిపినట్లు పేర్కొంది.

Read More

తనని డ్యాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారంటూ వస్తున్న వార్తల పై జాని మాస్టర్ స్పందించారు.ఆయా కథనాల్లో నిజం లేదని స్పష్టం చేశారు.అధారులు లేని ఆరోపణలతో నన్ను యూనియన్ నుంచి పూర్తిగా తొలగించారు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.యూనియన్ పై నాకు ఎంతో గౌరవం ఉంది.నా పదవీ కాలం ముగియక ముందే అనధికారికంగా ఎలక్షన్స్ పెట్టి సొంత నిర్ణయాలు తీసుకున్న వారిపై నేను చట్టపరంగా పోరాటం చేస్తా.టాలెంట్ ఉన్నవారికి పని లేకుండా చేయడం ఎవరి వల్ల కాదు ‘ అని మాస్టర్ అన్నారు.ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

Read More

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.గతంలో ఆయనకు రెవెన్యూ శాఖ కార్యదర్శి గా వర్క్ చేసిన అనుభవం వుంది.రేపటి నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.మూడేళ్ల పాటు ఆయనకి ఈ అధికారాలు కలిగి ఉంటారు. ప్రస్తుతo గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం రేపటితో ముగియనుంది.దీంతో కేoద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది.2018లో ఆర్ బీ ఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్.. పదవీ కాలం 2021లోనే పూర్తి అయింది.అయితే కేంద్రం ఆయన పదవిని మరో మూడేళ్లు పొడిగించింది.ఈ గడువు కూడా డిసెంబర్ 10తో ముగుస్తుంది.

Read More