రాష్ట్రంలో రేషన్ షాపుల పునః ప్రారంభం కార్యక్రమానికి ఈరోజు ఉదయం పిఠాపురంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీకారం చుట్టారు. పిఠాపురం పట్టణం 18వ వార్డులో రేషన్ షాపును ప్రారంభించి కార్డుదారులకి బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే వర్మ, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు, సివిల్ సప్లైస్ సెక్రెటరీ సౌరభ్ గౌర్, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.
Author: admin
వైసీపీపై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. అబ్బే వాళ్ళేమీ మారలేదు….. వాళ్ళేమీ మారరు కూడా….. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో… ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారని సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చిన్న పిల్లవాడి చేతిలో నుండి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ విరగ్గొడుతూ వైసీపీ మద్దతుదారులు కొందరు కొంత వికృతంగా ప్రవర్తించడం అందులో కనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింత గా అర్థం చేసుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ… వాళ్ళకి సైకో నాయకుడు! ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదని దుయ్యబట్టారు. మైలవరం లో ఓ మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చి వాళ్ళు చేసిన పిచ్చి చేష్టలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. #PsychoJagan #YSRCPRowdyism అబ్బే వాళ్ళేమీ మారలేదు….. వాళ్ళేమీ…
మిస్ వరల్డ్ 2025గా థాయ్ లాండ్ కు చెందిన ఓపల్ సుచాత నిలిచింది. మొదటి రన్నరప్ గా ఇథియోపియాకు చెందిన హాసెట్ డెరెజే, రెండో రన్నరప్ మిస్ పోలండ్ మయా క్లౌడా, మూడో రన్నరప్ గా మార్టినిక్ సుందరి ఆరేలి జోచిమ్ నిలిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా మోర్లే ప్రకటించారు. హైదరాబాద్లోని హైటెక్స్ లో శనివారం ఉత్కంఠభరితంగా ఫైనల్స్ జరిగాయి. ప్రపంచ సుందరిగా గెలిచిన థాయ్ లాండ్ భామ ఓపల్ సుచాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా కిరీటాన్ని అలంకరించారు. సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. 21 ఏళ్ల సుచాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టూడెంట్, మోడల్. 2024 మిస్ యూనివర్స్ థాయ్ లాండ్ పోటీల్లో థర్డ్ రన్నరప్ గా నిలిచిన ఆమెకు కొద్దిలో కిరీటం మిస్సైంది. ఈసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. థాయ్…
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ను భారత్ మొత్తంగా 24 మెడల్స్ సాధించి ఘనంగా ముగించింది. ఇందులో 8 గోల్డ్, 10 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. దీంతో ఈ టోర్నీలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలో మన దేశానికి ఇది అత్యుత్తమ ప్రదర్శన. పోటీలో చివరి రోజు భారత్ 3 గోల్డ్, 3 సిల్వర్ మెడల్స్ గెలిచింది. మహిళల 4×100మీ రిలే రన్ లో నిత్య, శ్రాబని, అభినయ, స్నేహాల టీమ్ 43.86 సెకన్లలో టార్గెట్ చేరి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. మహిళల 5వేల మీ రన్ లో పారుల్ చౌదరి 15 నిమిషాల 15.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని సిల్వర్ గెలిచింది. 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్ లో కూడా ఆమె సిల్వర్ మెడల్ సాధించింది. పరుగులో పూజా, మహిళల 400 మీ హార్డిల్స్ లో విత్య, మెన్స్…
గత ప్రభుత్వం రేషన్ వ్యాన్‌ల పేరుతో బియ్యం స్మగ్లింగ్ చేసారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇకపై రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు ఇస్తామని చెప్పారు. వ్యాన్ కోసం ఎదురు చూడటం, వీధి చివర నుంచోవటం, సెలవులు పెట్టి వ్యాన్ ఎప్పుడు వస్తుందా? అని వేచి చూడాల్సిన అవసరం లేదని ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ షాపుకి వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చని తెలిపారు. దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన వారికి మాత్రం ఇంటి వద్దే రేషన్ ఇస్తాం.ముమ్మిడివరం నియోజకవర్గం, చెయ్యేరులో ప్రజావేదిక సభకు చంద్రబాబు హాజరై పెన్షన్ లబ్ధిదారులు, మహిళలతో మాట్లాడారు. సభకు హాజరైన ప్రజలకు ఆత్మీయ అభివాదం చేశారు. కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలను వివరించారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ గారి స్పూర్తితో దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశమని పేర్కొన్నారు. ఇటీవల పాస్టర్ మరణాన్ని కూడా హత్య…
అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక దీని నిర్మాణానికి మూడు సంస్థలతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక సంస్థలైన టీసీఎస్, ఎల్అండ్ టీ, ఐబీఎం సంస్థలు దీన్ని నిర్మించనున్నాయి. క్వాంటం పార్క్ ఐబీఎం.. 156 క్యూబిట్ క్వాంటం సిస్టం-2ను ఏర్పాటు చేయనుంది. టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్ సేవలు అందించనుంది. 2026 జనవరి 1 నాటికి క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.
దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 2,710 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. కేరళలో అత్యధిక కేసులు వస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ తరువాత స్థానంలో ఉన్నాయి. నాలుగు రోజుల్లోనే కేసులు వేగంగా పెరిగినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఏపీలో 16, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఢిల్లీలో తాజాగా జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వార్షిక వ్యాపార సదస్సు 2025లో ఏపీ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. ‘‘ఆర్థిక వృద్ధి, స్థిరత్వం: ఆంధ్రప్రదేశ్ బ్లూప్రింట్’’ అనే అంశం పై ఆయన ప్రసంగించారు. 1995లో దావోస్ వెళ్తున్నా అంటే, అప్పట్లో నన్ను వెళ్లొద్దు అనే వారు. పారిశ్రామికవేత్తలతో భేటీలు అయితే, ఓట్లు పోతాయని బెదిరించే వారని అన్నారు. సిఐఐని మొదటి నుండి తాను ప్రోత్సహించానని, వారి తరుపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని కోరారు.దేవుడు నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం ఇచ్చాడు. అమరావతిని దేశంలోనే ఒక బెస్ట్ సిటీగా ప్లాన్ చేస్తున్నాం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాను. విశాఖలో టీసీఎస్ మొదలవుతోంది.. ఆర్సెల్లార్ మిట్టల్ పరిశ్రమ ప్రారంభం కాబోతోంది. విశాఖకు గూగుల్ రాబోతోంది. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలు…
ఐపీఎల్ సీజన్ 18 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫైయర్ లో పంజాబ్ కింగ్స్ పై గెలిచి ఫైనల్ చేరింది. ఇక తాజాగా జరిగిన రెండో ఎలిమినేటర్ లో గుజరాత్ టైటాన్స్ పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో క్వాలిఫైయర్ కి అర్హత సాధించింది. రెండో క్వాలిఫైయర్ లో పంజాబ్ కింగ్స్ తో ముంబై నిర్ణీత తలపడనుంది. ఇక తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 81 (50; 9×4, 4×6) కీలక మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. జానీ బెయిర్ స్టో 47 (22; 4×4, 3×6), సూర్య కుమార్ యాదవ్ 33 (20; 1×4,…
గిరిజన గ్రామాలకు, PVTG ప్రాంతాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ PM జన్ మన్ పథకం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం, లక్కవరం నుండి చీదిగోంది వరకు సహకారంతో దాదాపు ₹87.19 లక్షల వ్యయంతో 1.01 కి.మీ రహదారి నిర్మించడం జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా దాదాపు 183 మంది గిరిజనులకు రహదారి సమస్య పరిష్కారం అయ్యిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, దాదాపు ₹1,000 కోట్ల నిధులతో – గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రారంభించిన అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా, ఇన్నేళ్లుగా సరైన రోడ్లు లేక వైద్యానికి, అవసరాలకు ఇబ్బందిపడుతున్న గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణాన్ని చేయడం ద్వారా వారి ఇబ్బందులు తొలగించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, వారికి అభివృద్ధిని చేరువ…
