Author: admin

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు…ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు…అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు…సైకో పాలనకు అంతం పలికి…..ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు…ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు….ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు…పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు….ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షల నెరవేర్చేందుకు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి…సంక్షేమాన్ని అందిస్తూ… అభివృద్ధి…

Read More

ప్రభాస్‌ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించి రెబల్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపారు. ఈ ఏడాది డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. టీజర్‌ ని ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు తెలిపారు. 16 వతేదీ ఉదయం 10.52 గంట‌ల‌కు టీజ‌ర్ రిలీజ్ చేస్తామ‌ని తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఇక‌, ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మరో యువ నటి రిద్ధి కుమార్ ప్ర‌త్యేక పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సంజయ్ దత్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. వారి మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ హను…

Read More

శ్రీ సత్యసాయి జిల్లా, అమరాపురం మండలం, ఉదుకూరు గ్రామానికి చెందిన డి. నరసింహమూర్తి ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ సైనికుడిగా సేవలందిస్తున్నారు. ఆయన భార్య, తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమి అమరాపురం మండలం కె.శివరం గ్రామంలో ఉంది. అయితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తి, తన రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని ఈ భూమిని అక్రమంగా కబ్జా చేశారని నరసింహమూర్తి ఆరోపించారు. సరిహద్దుల్లో ఉంటూ తన కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదనతో, ఆయన జమ్మూకశ్మీర్ నుంచే ఓ సెల్ఫీ వీడియో ద్వారా తన బాధని వెళ్లబోసుకున్నారు. తనకు న్యాయం చేయాలని, తన భూమిని తనకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్మీ జవాను భూ సమస్యను 24 గంటల్లోనే పరిష్కరించడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె.శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన…

Read More

ఐపీఎల్ సీజన్ 18 పూర్తయింది. టోర్నీలో అత్యద్భుతంగా సమిష్టిగా రాణించి 18 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో మొదటి సారిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కొలను సాకారం చేసుకుంది. ఇక అదేస్థాయిలో రాణించినప్పటికీ పంజాబ్ కింగ్స్ రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇక ఈ టోర్నీలో మిగిలిన విభాగాలలో తమ ఆటతీరుతో ఆకట్టుకుని వివిధ టీమ్ లో నుండి అవార్డులు అందుకున్నారు. ఐపీఎల్‌ 2025 అవార్డు దక్కించుకున్న జాబితా: ఐపీఎల్‌ 2025 ఛాంపియన్స్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్నరప్: పంజాబ్ కింగ్స్ ఆరెంజ్ క్యాప్: సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) – 759 పరుగులు పర్పుల్ క్యాప్: ప్రసిద్ధ్ కృష్ణ (గుజరాత్ టైటాన్స్) – 25 వికెట్లు మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (ముంబై ఇండియన్స్) – 320.5 MVP పాయింట్లు ఎమర్జింగ్ ప్లేయర్: సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) సూపర్ స్ట్రైకర్: వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) – స్ట్రైక్…

Read More

18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ఐపీఎల్ ట్రోఫీని మొట్టమొదటి సారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. అభిమానుల చిరకాల కోరికను ఈ సీజన్ లో నెరవేర్చి టైటిల్ విజేతగా అవతరించింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్ మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు… నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (43; 35 బంతుల్లో 3×4) పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ (16; 9 బంతుల్లో 2×4, 1×6) మయాంక్ అగర్వాల్ (24, 18 బంతుల్లో 2×4,1×6), రజత్ పాటిదార్ (26; 16 బంతుల్లో 1×4, 2×6), లివింగ్ స్టన్ (25; 15 బంతుల్లో 2×6), రొమారియో షెఫర్డ్ (17,9 బంతుల్లో 1×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జితేశ్ శర్మ (24;…

Read More

ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ కీలక ఒప్పందం చేసుకున్నాయి. రాష్ట్రంలో ప్రజల భద్రతకు మరింత దోహదం చేస్తుంది. రియల్-టైమ్ పౌర-కేంద్రీకృత పాలన కోసం అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఒక మైలురాయి అడుగులో, SHAR (ISRO) మరియు RTGS మధ్య ఈరోజు SHAR డైరెక్టర్ శ్రీ రాజరాజన్ మరియు RTGS CEO శ్రీ ప్రఖార్ జైన్ సమక్షంలో 5 సంవత్సరాల అవగాహన ఒప్పందం కుదిరిందని ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ సహకారం వ్యవసాయం, వాతావరణం, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక మొదలైన 42+ అప్లికేషన్లలో ఉపగ్రహ చిత్రాలు మరియు శాస్త్రీయ ఇన్‌పుట్‌లతో AWARE ప్లాట్‌ఫామ్‌ను మెరుగుపరుస్తుంది. AWARE ఉపగ్రహాలు, డ్రోన్‌లు, IoT, సెన్సార్లు, మొబైల్ ఫీడ్‌లు మరియు CCTV నుండి డేటాను సమగ్రపరచడం ద్వారా పౌరులకు మరియు ప్రభుత్వానికి SMS, WhatsApp మరియు మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా రియల్-టైమ్ హెచ్చరికలు…

Read More

సౌతాఫ్రికా క్రికెట్ స్టార్ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. 33 ఏళ్ల వయసులో ఈ సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ‘నాకు ఇది ఓ బాధకరమైన రోజు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఎంతో కాలంగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. నాకు, నా కుటుంబానికి ఏది మంచిదో ఆ నిర్ణయమే తీసుకున్నాను.. ఇది చాలా కష్టమైన నిర్ణయం అయినా, నాకు ఇదే సరైన సమయం అనిపిస్తోంది..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు ఈ సౌతాఫ్రికా క్రికెటర్ హెన్రీచ్ క్లాసిన్. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 4 టెస్టులు, 60 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడి వన్డేల్లో 4 సెంచరీలు 11 హాఫ్ సెంచరీలు, టీ20ల్లో 5 హాఫ్ సెంచరీలు చేశాడు. నాలుగు టెస్టుల్లో 104 పరుగులు చేశాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ఆడిన సౌతాఫ్రికా…

Read More

నార్వే చెస్‌ స్టార్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ పై భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ అదిరే విజయాన్ని నమోదు చేశాడు. నార్వే చెస్‌ టోర్నీలో భాగంగా తాజాగా జరిగిన రౌండ్‌-6 గేమ్ లో గుకేశ్‌ కార్ల్‌సన్‌ చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. గేమ్ చేజార్చుకున్న ఒత్తిడిలో టేబుల్ పై బలంగా గుద్ది కార్ల్ సన్ తన కోపాన్ని ప్రదర్శించగా, గుకేశ్ తన విజయాన్ని ఆస్వాదించాడు. మరోవైపు అర్జున్ చైనాకు చెందిన వీ యిపై, వైశాలి..హంపిపై గెలిచి ముందంజ వేశారు. గుకేశ్ విజయం పట్ల దేశవ్యాప్తంగా అభిమానులు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More

ఐపీఎల్ సీజన్ 18 ఫైనల్లోకి పంజాబ్ కింగ్స్ దూసుకెళ్లింది. తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ 2 లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ 44 (26; 4×4, 3×6), తిలక్ వర్మ 44 (29; 2×4, 2×6), జానీ బెయిర్ స్టో 38 (24; 3×4, 2×6), నమన్ ధీర్ 37 (18; 7×4) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఒమర్జాయ్ 2 వికెట్లు, వి.వి.కుమార్, జేమీసన్, చాహాల్, స్టోయినీస్ ఒక్కో వికెట్ తీశారు. ఇక అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలోనే…

Read More

ఆపరేషన్ సిందూర్ సమయంలో అభ్యంతరకర పోస్టు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్, లా స్టూడెంట్ శర్మిష్ఠ పనోలీని కోల్ కతా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోన్న నేపథ్యంలో దీనిపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సనాతన ధర్మంపై మాట్లాడిన వీడియోను పవన్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ ఒక వీడియో పోస్టు చేసింది. తన మాటలు కొంత మందికి బాధ కలిగించేవిగా ఉన్నాయని గ్రహించి తర్వాత ఆమె.. దాన్ని తొలగించి, క్షమాపణలు కూడా చెప్పింది. వెస్ట్ బెంగాల్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి ఆమెపై చర్యలు తీసుకున్నారు. కానీ, సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ కోట్లాది మంది బాధకు…

Read More