దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గతంలో ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారి, ఇప్పుడు మరోసారి విజృంభిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది, మరణాలు కూడా నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం… నిన్నటి వరకు 4,302గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య, ఈరోజు 4,866కు చేరింది. కేవలం 24 గంటల వ్యవధిలో 564 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏడుగురు కోవిడ్ కారణంగా మరణించారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1,487 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి ఢిల్లీలో 562, పశ్చిమ బెంగాల్ 538, మహారాష్ట్ర 526, గుజరాత్ 508 కేసులు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 105 కొత్త కేసులు వెలుగుచూడటం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు మొత్తం 44 కోవిడ్…
Author: admin
ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక నివాసంలో ‘సింధూర’ మొక్కను నాటారు. నేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్ తో భారత్ చేసిన యుద్ధంలో ధైర్య సాహసాలు చూపిన మహిళా బృందం ఇచ్చిన మొక్కను నాటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్ తో భారత్ చేసిన యుద్ధంలో కల్కు చెందిన తల్లులు, సోదరీమణులు తమ వీర పరాక్రమాలను ప్రదర్శించారు. ఇటీవల నేను గుజరాత్ లో పర్యటించిన సమయంలో ఆ మహిళా బృందం నన్ను కలిసింది. అప్పుడే వారు నాకు ఈ మొక్కను అందించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మొక్కను నాటాను. ప్రధానమంత్రి నివాసంలో ఈ మొక్కను నాటే గొప్ప అవకాశం నా దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నంగా నిలుస్తుందని…
నేడు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతవరంలోని ఏడీసీఎల్ పార్కులో వన మహోత్సవం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ పరిశీలించారు. ఇద్దరూ మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలు, చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ అన్నారు.వచ్చే ఏడాదికి అయిదు కోట్ల మొక్కలు నాటి పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. నల్లమల కోసం మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న అంకారావు జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అడవుల పెంపకమే కాదు… కార్చిచ్చుల నివారణకు సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పర్యావరణంపై అవగాహన కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గతంలో ఒక ప్రభుత్వం ఉండేది.…
ఇండో-పసిఫిక్ రీజియన్ లో శాంతి సుస్థిరతల కోసం పరస్పరం వ్యూహాత్మక సహకారం కోసం భారత్, ఆస్ట్రేలియాలు అంగీకరించాయి. భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్ తాజాగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడికి ఘాటుగా బదులిస్తూ భారత్ చేపట్టిన చర్యలకు మద్దతు తెలిపారు. పాకిస్థాన్ మద్దతుతో సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు భారత్ కు ఉందని ఆస్ట్రేలియా ఉప ప్రధాని మార్లెస్ అన్నారు. భారత్ చేపట్టిన చర్య కచ్చితంగా, బాధ్యతగా, ఉద్రిక్తతలు పెరగకుండా ఉండే విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి కూడా అయిన మార్లెస్ తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆ సమావేశంలో సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరుకు మత మద్దతు ఉంటుందని మార్లెస్ తెలిపారు. ఇరుదేశాలు రక్షణ పారిశ్రామిక రంగాల్లో…
ఆపరేషన్ సిందూర్ లో భారత్ తన సొంత ఆయుధాలతో నే ఉగ్రమూకలను నాశనం సంగతి తెలిసిందే. స్వదేశీ ఆయుధాలు మన శక్తిని చాటాయని, అవి వేటికీ తీసిపోవని నిరూపించాయని ప్రధాని మోడీ అన్నారు. మేక్ ఇన్ ఇండియా రక్షణ ఆయుధాలు, వాటిని తయారు చేసే సంస్థలు ప్రభుత్వ ప్రాధాన్యాంశాలని స్పష్టం చేశారు. ప్రధాని అధ్యక్షతన మంత్రి మండలి తాజాగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ పై మంత్రులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రులంతా పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని ప్రధాని సూచించారు. మోడీ ప్రభుత్వ 11ఏళ్ల పాలనా విజయాలపై సమావేశంలో క్యాబినెట్ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రకృతి అంటే ఏ ఒక్కరి సొత్తూ కాదు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది. అడవులను కాపాడుకోవడం, జలవనరులను సంరక్షించుకోవడం మన కర్తవ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మంచి పరిసరాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుంది. అందుకే స్వచ్ఛ భారత్ లో భాగంగా మనం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టాం. చెత్తను ఇంధనంగా మారుస్తూ ప్రకృతిని కాపాడుతున్నాం. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలన అంశాన్ని థీమ్ గా తీసుకున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి మన వంతు బాధ్యతగా పనిచేద్దాం. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని వివరించారు.
టెక్ దిగ్గజం, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత, ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ భారత్ లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. ఆయన ఈనెల 1న భారత్ కు వచ్చారు. భారతీయ సంప్రదాయ దుస్తులైన కుర్తా పైజామా ధరించి, గర్భాలయంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలోని హనుమాన్ గార్హీ ఆలయాన్ని కూడా ఎరోల్ మస్క్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె అలెగ్జాండ్ర మస్క్ కూడా ఉన్నారు. సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కు ఎరోల్ మస్క్ గ్లోబల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. ఎరోల్ మస్క్ రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయోధ్య ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఎరోల్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామాలయ దర్శనం చాలా అద్భుతమైన, మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నారు. నేను ఇప్పటి…
భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం అర్జున్ ఇరిగేశి నార్వే చెస్ టోర్నమెంట్ లో టైటిల్ రేసులో నిలిచేందుకు అవసరమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ టోర్నీలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాకు చెందిన ఫాబియానా కరువానాపై గెలిచి 3 పాయింట్లు తన ఎకౌంటు లో వేసుకున్నాడు. మరో భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ పై అమెరికా గ్రాండ్ మాస్టర్ హికరు నకముర విజయం సాధించాడు. 11.5 పాయింట్లతో నకముర, గుకేశ్ ఉమ్మడిగా 3వ స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల విభాగంలో భారత క్రీడాకారిణి కోనేరు హంపి 13.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మొదటి సారి టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ విజయోత్సవ కార్యక్రమం లో విషాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ క్రమంలో స్టేడియం వద్దకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుండి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని వివిధ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సచివాలయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ అందజేశారు. పవనన్నతో పాటు, ఇతర మంత్రులకు కూడా పుస్తకాన్ని అందజేశానని లోకేష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైందని పవనన్న అన్నారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావడాన్ని ప్రశంసించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చిపోలేదన్నారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా పవనన్నతో పంచుకున్నానని లోకేష్ పేర్కొన్నారు.
