తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న గద్దర్ అవార్డులపై ప్రముఖ సినీనటుడు, జ్యూరీ ఛైర్మన్ మురళీమోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎఫ్ఎసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 నుండి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను నేడు ప్రకటించారు. ఏడాదికి మూడు చిత్రాల చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులను ప్రకటించారు. 2014 జూన్ 2 నుండి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. వీటితోపాటు సినీ రంగానికి సేవలు అందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాకవి, దివంగత కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రకటించారు. ఆయా సంవత్సరాలకు ఉత్తమ చిత్రాలు: 2014 ప్రథమ ఉత్తమ చిత్రం: రన్ రాజా రన్ రెండో ఉత్తమ చిత్రం: పాఠశాల మూడో ఉత్తమ చిత్రం అల్లుడు శీను 2015 ప్రథమ ఉత్తమ చిత్రం: రుద్రమదేవి రెండో ఉత్తమ చిత్రం: కంచె మూడో ఉత్తమ చిత్రం:…
Author: admin
సౌత్ కొరియా వేదికగా జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో భారత అథ్లెట్లు పతకాలతో సత్తా చాటుతున్నారు. తెలుగు అథ్లెట్ యర్రాజీ జ్యోతి గత ఏడిషన్‌లో (2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్) కూడా స్వర్ణంతో సత్తా చాటిన ఆమె ఈసారి కూడా ఆసియా అథ్లెటిక్స్‌లో మరోసారి సత్తా చాటింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం సాధించింది. గత ఎడిషన్‌లో 13.09 సెకన్ల సమయంలో పోటీని పూర్తిచేసి బంగారు పతకాన్ని జ్యోతి కైవసం చేసుకుంది. అయితే తాజాగా మాత్రం సరికొత్త రికార్డును సృష్టించింది. ఈసారి 12.96 సెకన్లలోనే పూర్తిచేసిన 1998లో కజకిస్తాన్ అథ్లెట్ ఓల్గా షిషిజినా (13.04 సెకన్లు), 2011లో చైనా క్రీడాకారిణి సున్ యావె (13.04 సెకన్లు) నమోదు చేసిన రికార్డులను అధిగమించింది. అంతేకాకుండా ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో వరుసగా రెండు, అంతకంటే ఎక్కువసార్లు పసిడి పతకాలు సాధించిన అయిదో క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె విజయం పట్ల…
కడపలో టీడీపీ మహానాడు విజయవంతంగా పూర్తయింది. భారీగా తెలుగు దేశం శ్రేణులు పాల్గొని విజయవంతం చేశారు. అధినేత చంద్రబాబు, అగ్రనేత లోకేష్ లు తమ ప్రసంగాలతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపి దిశా నిర్దేశం చేశారు. ఇక ఈ కార్యక్రమంపై లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. కడపలో 3రోజులపాటు పసుపు పండుగ మహానాడును విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన మహానాడు కమిటీల సభ్యులు, పార్టీనాయకులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా నా అభినందనలు. రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చిన పసుపు సైన్యానికి ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన కడప ప్రజానీకానికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. రాబోయే 40ఏళ్లపాటు పార్టీని ముందుకు నడిపించే ఆరు శాసనాల ఆవిష్కరణకు రాజకీయ చైతన్యానికి మారుపేరైన కడప గడప వేదిక కావడం శుభసూచకంగా భావిస్తున్నాను. కడప మహానాడు ఇచ్చిన స్పూర్తితో తెలుగుజాతిని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తానని లోకేష్ రాసుకొచ్చారు.
ఐపీఎల్ సీజన్ 18 లో మొదటి క్వాలిఫైయర్ లో సుదీర్ఘ కాలంగా ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న రెండు జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన బెంగళూరు ఫైనల్ చేరింది. ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో ఢీలా పడింది. 14.1 లో 101 పరుగులకు ఆలౌటయింది. స్టోయినీస్ (26), ప్రభ్ సిమ్రాన్ (18), ఒమర్జాయ్ (18) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో సుయాష్ శర్మ 3 వికెట్లు, హేజల్ వుడ్ 3 వికెట్లు, యష్ దయాళ్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫిల్ సాల్ట్…
భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) పై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న ప్రజలు మనవాళ్లే అని అక్కడి ప్రజలతో ధృఢమైన సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భౌగోళికంగా విడిపోయిన పీవోకే ప్రజలు ఏదో ఒకరోజు భారత్ లో ఏకమవుతారని ఆరోజు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేశారు. పీవోకే తిరిగి వస్తుందన్నారు. అక్కడ కొందరు మాత్రమే తప్పు దారి పట్టారని అన్నారు. గ్రేట్ ఇండియా మన విధానమని చెప్పారు. శక్తితో పాటు సంయమనం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ఇక ఆపరేషన్ సిందూర్ తో దేశ భద్రతకు మేకిన్ ఇండియా ముఖ్యమని రుజువైంది. మనం ఇప్పుడు ఫైటర్ జెట్స్, మిస్సైల్స్ సిస్టమ్స్ నిర్మించడంతో పాటు కొత్త తరం వార్ టెక్నాలజీపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ అవలంబించిన తీరును వివరించారు. కేవలం 23…
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినిమా అవార్డులను నేడు ప్రకటించారు. గద్దర్ పేరిట ఇవ్వనున్న ఈ అవార్డులును జ్యూరీ ఈరోజు ప్రకటించింది. కమిటీ ఛైర్మన్ జయసుధ, FDC ఛైర్మన్ దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ అవార్డుల ఎంపికపై తమకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని తమ కమిటీ ఏకగ్రీవంగా అవార్డులను ఎంపిక చేసిందని జయసుధ తెలిపారు. 2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్: కల్కి 2898ఏడీ (మొదటి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్) పొట్టేల్ (రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్) లక్కీ భాస్కర్ (మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్) ఉత్తమ నటీనటులు: ఉత్తమ నటుడు- అల్లు అర్జున్ (పుష్ప 2) ఉత్తమ నటి- నివేదా థామస్ (35 ఇది చిన్న కాదు). ఉత్తమ దర్శకుడు- నాగ్ అశ్విన్ (కల్కి). ఉత్తమ సహాయ నటుడు: ఎస్ సూర్య (సరిపోదా శనివారం) ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్), ఉత్తమ సంగీత…
టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా తనను మళ్లీ ఎన్నుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు జరుపుకోవడం టీడీపీ ఆనవాయితీ. అదే ప్రకారం కడప మహానాడులో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. నా పేరు ప్రతిపాదించిన, సమర్థించిన, ఆమోదించిన వారందరికి పేరుపేరునా కృతజ్ఞతలు. మీరు నా పై ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, ‘కార్యకర్తే అధినేత’ అనే సూత్రానికి అనుగుణంగా పని చేస్తానని ఈ సందర్భంగా మరొక్కమారు తెలుపుతున్నాను. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఎన్ డి ఏ కూటమి ఘన విజయం సాధించింది. ఆ విజయం మన బాధ్యతను పెంచింది. గాడితప్పిన రాష్ట్రాన్ని ఇప్పటికే చాలా రంగాల్లో సరిదిద్దాం. పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు తీసుకువెళుతున్నాం. పెట్టుబడుల కోలాహలంతో, పరుగులు పెడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులతో, భవిష్యత్తును అందంగా చూపించే మౌలికసదుపాయాల కల్పనతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాష్ట్రం…
వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. మండపేట, మదనపల్లె పురపాలక, గొల్లప్రోలు నగర పంచాయతీ, పెనుకొండ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్-2.0 గతంలో మాదిరిగా ఉండదు. సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే కాదు. అందరికంటే కార్యకర్తలే పైస్థాయిలో ఉంటారు. ప్రతి కార్యకర్తకూ నేడు జరుగుతున్న అన్యాయాలు, కష్టాలను చూస్తున్నా. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నవాళ్లు కష్టాలు పెడతారు. పర్వాలేదు. ఎవరు అన్యాయం చేసినా రెడ్ బుక్ అనను మీ ఇష్టం వచ్చిన పుస్తకంలో పేరు రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీతో రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ నోటికొచ్చిన హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గెలిచాక వాటన్నింటినీ పక్కన పెట్టింది. వాటిని అమలు చేసే బాధ్యతను పూర్తిగా విస్మరించారని జగన్ అని అన్నారు.
ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో భారత మిక్స్డ్ రిలే టీమ్ గోల్డ్ మెడల్ నిలబెట్టుకుంది. వ్యక్తిగత విభాగాలలో భారత అథ్లెట్స్ నలుగురికి సిల్వర్ మెడల్స్ దక్కాయి. ఒకరు బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. దీంతో భారత్ రెండో రోజు మొత్తం 6 మెడల్స్ సాధించింది. 4×400 మిక్స్డ్ రిలే పోటీలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. సంతోష్ కుమార్, రూపల్ చౌదరి, విశాల్, శుభ వెంకటేశ్ లో టీమ్ 3 నిమిషాల 18.12 సెకన్లలో రేసు పూర్తి చేసింది. చైనా రెండో స్థానంలో నిలిచి సిల్వర్, శ్రీలంక మూడో స్థానంతో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాయి. పురుషుల డెకాథ్లాన్ లో తేజస్విన్ శంకర్ 7518 పాయింట్లతో సిల్వర్ మెడల్ సాధించాడు. మెన్స్ ట్రిపుల్ జంప్ లో ప్రవీణ్ చిత్రవేల్ సిల్వర్, మహిళల 400 మీటర్ల రేసులో రూపల్ చౌదరి, 1500 మీ రన్ లో పూజ సిల్వర్ మెడల్స్ సాధించారు. మెన్స్…
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో ఓ మోస్తరుగా కదలాడి చివరికి నష్టాలతో ముగించాయి. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 239 పాయింట్లు నష్టపోయి 81,312 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 24,752 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.85.37గా కొనసాగుతోంది. ఇక సెన్సెక్స్ 30లో భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి. ఎల్.ఐ.సీ షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి. కంపెనీ షేర్లు ఉదయం 9 శాతం మేర లాభపడ్డాయి. చివరికి 7.96 శాతం వద్ద ముగిశాయి.
