Author: admin

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఈరోజు మహానాడు 2025 ప్రాంగణంలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు ‘యువగళం’ పాదయాత్ర కాఫీ టేబుల్ బుక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ తన పాదయాత్ర అనుభవాలను, ప్రజల ఆదరాభిమానాలను గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకాన్ని తనకు స్ఫూర్తిప్రదాత అయిన చంద్రబాబుకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని లోకేష్ తెలిపారు. పుస్తకంలోని అనేక కథనాలు, చిత్రాలు తనకు గత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయని, అదే సమయంలో తనపై ఉంచిన అపారమైన బాధ్యతను కూడా గుర్తుకు తెస్తున్నాయని ఆయన వివరించారు. యువగళం పాదయాత్ర ఆసాంతం తనకు అండగా నిలిచి, తనపై ప్రేమ, ఆప్యాయతలను కురిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నారా లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Read More

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నేడు సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను తెలిపారు. ముఖ్యంగా ఈ భేటీలో రైతులకు, వారి అభివృద్ధి కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర(MSP) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. MSP కోసం రూ.2 లక్షల 70 వేల కోట్లు కేంద్రం కేటాయించినట్టు వివరించారు. ఈ నిర్ణయంతో రైతులు పండించిన పంటలకు మంచి ధర వస్తుందని, వారి ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ పథకాన్ని కూడా ఆమోదించారు. గత 10-11 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు MSP భారీగా పెంచినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం MSP పెంపును కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందన్నారు. రైతులకు వడ్డీ రాయితీ…

Read More

సీనియర్ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లడం ఖరారైంది. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల సమ‌యంలో డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం ఎంఎన్‌ఎంకు రాజ్య‌స‌భ సీటు కేటాయించారు. ఇక ఇందులో భాగంగా కమల్ హాసన్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తూ డీఎంకే తాజాగా నేడు ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8 స్థానాలకు వచ్చే నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో తమిళనాడు నుంచి 6, అసోం నుంచి 2 స్థానాలు ఉన్నాయి. తమిళనాడులో ఈ స్థాయిలో డీఎంకేకు 134 మంది శాసనసభ్యులు ఉన్న నేపథ్యంలో ఆరు సీట్లలో నాలుగు డీఎంకేకు, మిగిలిన రెండు అన్నాడీఎంకేకు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం డీఎంకే తన నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. వారిలో కమల్ హాసన్ కూడా ఉన్నారు. కమల్ హాసన్ తో పాటు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు…

Read More

ఎన్టీఆర్ తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు టీడీపీ వ్యవస్థాపకులు ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నీరాజనమని పేర్కొన్నారు. మాయాబజార్, మిస్సమ్మ, సంపూర్ణ రామాయణం వంటి అనేక చిత్రాలలో అజరామర నటనతో చిరస్థాయిగా నిలిచిపోయారని “సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు” అనే అక్షర సత్య ఆలోచన, రాజకీయాల పట్ల ఎన్టీఆర్ గారి దృక్కోణాన్ని తెలియచేస్తుందని కొనియాడారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులో వాటా, విద్యావకాశాల విస్తరణలో భాగంగా ఎంసెట్ ప్రవేశ పరీక్షను ప్రారంభించడం, ఈ రోజు మహానాడు జరిగే కడప ప్రాంతానికి నీళ్లు అందించే తెలుగుగంగ ప్రాజెక్ట్ వంటి అనేక చారిత్రక నిర్ణయాలతో ఎన్టీఆర్ గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం…

Read More

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త, ‘అన్న’ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు ఘన నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు: యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త, ‘అన్న’ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు అవసరాలను తీర్చడమే తన జీవితాశయంగా భావించిన ధీరోదాత్తుడు అన్న ఎన్టీఆర్. ‘సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఆయన. అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చినా, మండల వ్యవస్థతో పాలనారంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లినా, పక్కా ఇళ్ల…

Read More

తెలుగు సినిమా దిగ్గజం, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు నివాళులు అర్పించారు. ఆయన ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. పలువురు ప్రముఖులు, నందమూరి అభిమానులు నేడు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఎన్టీఆర్ కు నివాళులు తెలుపుతున్నారు.

Read More

ఉగ్రవాదుల దుశ్చర్యలకు భయపడేది లేదని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మరోసారి స్పష్టం చేశారు. టూరిజాన్ని ఘర్షణలతో ముడిపెట్టవద్దని, ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను అంచనా వేయడానికి టూరిజాన్ని కొలమానంగా చూడవద్దని అభ్యర్థించారు. ఉగ్ర చర్యలకు ప్రభుత్వం భయపడబోదని స్పష్టమైన సందేశం పంపడానికి తాజాగా ఆయన క్యాబినెట్ ప్రత్యేక సమావేశాన్ని పహల్గాంలోని క్లబ్ లో నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడులను ఖండించి బాధితుల పక్షాన నిలిచిన వారికి, ముఖ్యంగా పహల్గాం వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. వారికి వందనాలు చెబుతూ మీడియా సమావేశాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 22న ఉగ్ర దాడి తదనంతరం ‘ఆపరేషన్ సిందూర్’ తో భారత్ గట్టిగా బదులిచ్చిన విషయం తెలిసిందే.

Read More

ఉగ్రవాదులకు నిలయమైన పాకిస్థాన్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి నిప్పులు చెరిగారు. ఉగ్రవాదం మే ఆ దేశ యుద్దనీతి అని దుయ్యబట్టారు. ఆ దేశం అనుసరిస్తున్న ఉగ్రవాదం పరోక్ష పోరు కిందనుంచి అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న యుద్ధ వ్యూహామని పేర్కొన్నారు. ఆ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు భారత్ గట్టిగా బదులిస్తుందని మరోసారి పునరుద్ఘాటించారు. వసుధైక కుటుంబం అన్న భావన మన భారతీయ సంస్కారమనో మన పొరుగువారి సంతోషాన్నీ మనం కోరుకుంటాం. మన బలాన్ని సవాలు చేస్తే మనదేశం వీరుల గడ్డ అని కూడా చూపిస్తామని మోడీ తెలిపారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలను పాక్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించిందని మోడీ ఫైర్ అయ్యారు. ఉగ్రవాదుల శవపేటికలపై పాక్ జాతీయజెండా కప్పటంతోపాటు సైన్యం సెల్యూట్…

Read More

సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, హెచ్.ఎస్. ప్రణయ్ మంచి ప్రదర్శన కనబరిచారు. తాజాగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-14, 21-9తో కెనడాకు చెందిన వెన్ జాంగ్ పై గెలిచి ప్రిక్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. మాళవిక బాన్సోద్ 21-14, 18-21, 11-21తో థాయ్ లాండ్ కు చెందిన సుపనిద చేతిలో, రక్షిత శ్రీ 14-21, 8-21తో కొరియాకు చెందిన కిమ్ యున్ చేతిలో, అన్మోల్ ఖార్బ్ 11-21, 22-24తో చైనాకు చెందిన చెన్ యుఫెయ్ చేతిలో ఓడారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 19-21, 21-16, 21-14తో డెన్మార్క్ కు చెందిన రస్ముస్ గెమ్కీ పై విజయం సాధించి ప్రిక్వార్టర్స్ చేరాడు.

Read More

మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుకని మహానాడు… ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనేని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ స్పందించారు. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు ప్రత్యేకతను గుర్తుచేస్తూ పవనన్న అందించిన ప్రశంసలు స్పూర్తినిచ్చాయి. కష్టసుఖాల్లో అండగా ఉంటూ మీరు అందిస్తున్న ప్రోత్సాహం మాకు కొండంత బలం. మీ సహాయ, సహకారాలతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాం. థాంక్యూ పవనన్నా! అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

Read More