ఆంధ్రప్రదేశ్ 4 జాతీయ పంచాయితీ అవార్డులను సాధించింది. నాలుగు కేటగిరీలలో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మ సముద్రం, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయం పూడి, అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తగరంపూడి, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామపంచాయతీలకు పురస్కారాలు దక్కాయి. కాగా దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మొట్టమొదటి సారిగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ (DDUPSVP) కేటగిరీలో 4 జాతీయ అవార్డులను మన గ్రామ పంచాయతీలు సాధించడం గ్రామ స్వరాజ్ సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలకు నిదర్శనంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనత స్థానిక సంస్థల బలోపేతం, గ్రామాలు స్వయంసమృద్ధి సాధించే దిశగా, పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతూ, స్థానిక పరిపాలనను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.…
Author: admin
స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప-2’ కు కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చాయి.హైదరాబాద్ నగరంలోని సంధ్యా థియేటర్ వద్ద “పుష్ప-2” బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ మేరకు తెలంగాణ సినిమాటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు.అయితే హైదరాబాద్ నగరంలో బెనిఫిట్ షోలు వేయడం వలన శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కోమటిరెడ్డి అన్నారు.కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు వచ్చినవారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు.ఈ ఘటన నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం,అల్లు అర్జున్ బృందంపై పోలీసులు ఇప్పటికే కేసు ఫైల్ చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష సమావేశం నిర్ణయాలను గవర్నర్ శక్తి కాంత్ దాస్ తెలిపారు. కాగా, కీలక వడ్డీరేట్లకు సంబంధించి వివరాలు వెల్లడించారు. వరుసగా 11వ సారి కీలకమైన రెపో రేటును ఆర్.బీ.ఐ యథాతథంగా ఉంచింది.ఏప్రిల్ 2023 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా రెపో రేటుని పెంచలేదు. 6.5 శాతంగా కొనసాగించేందుకు అనుకూలంగా ఆరుగురు సభ్యుల కమిటీ 4:2 మెజారిటీతో నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించారు. రెపో రేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు కూడా యథాతథంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈఎంఐలలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. ఇక జులై-సెప్టెంబరు క్వార్టర్ లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్టానికి 5.4% కు పడిపోయిందని ఇదే క్వార్టర్ లో గతేడాది జీడీపీ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ హైవేలపై రూ.1,046 కోట్లతో చేపట్టిన 18 ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఆయా నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నట్లు తెలిపారు. లోక్ సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఎన్.హెచ్-216ఏపై మోరంపూడి, జొన్నాడ, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి, కైకవరం వద్ద నిర్మిస్తున్న 5 వంతెనలు పూర్తి కానున్నట్లు తెలిపారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి, గుంటూరు మిర్చి యార్డు వద్ద నిర్మిస్తున్న వంతెన జనవరి 6 నాటికి ఎన్.హెచ్-16 పై గొలగమూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న రెండు వంతెనలు వచ్చే ఏడాది సెప్టెంబర్ 11 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎన్.హెచ్-16 పై నాగులుప్పలపాడు గ్రోత్ సెంటర్,…
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, రాణి జెట్సన్ పెమా వాంగ్‌చుక్ లు భారత్ లో పర్యటించనున్నారు. ఈమేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం తాజాగా భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో విదేశాంగశాఖా మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ రాజు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుగు పొరుగు దేశాలైన భారత్, భూటాన్ ల మద్య దశాబ్ధాల నుండి స్నేహ సంబంధాలు ఉన్నాయి. పరస్పర అవగాహనతో ఇప్పటికే పలు ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకుని వాటిని రెండు దేశాలు అమలు చేస్తున్నాయి.
గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం పౌర సదుపాయాల కల్పనలో ఒక మైలు రాయిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి అమరావతి వచ్చిన గూగుల్ క్లౌడ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ కంట్రీ ఎండీ బిక్రమ్ సింగ్ బేడీ ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం జరిగింది. రోజువారీ జీవితంలో పౌరులకు అవసరమైన వివిధ ధృవీకరణ పత్రాలు, ఇతర అన్ని సేవలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సెల్ ఫోన్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలనే దే ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ పేర్కొన్నారు. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ ను ప్రజలకు చేరువ చేయడమే ప్రధానోద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులకు…
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ వరుస డ్రా లతో కొనసాగుతోంది. తాజాగా మరో గేమ్ డ్రాగా ముగిసింది. ఇప్పటివరకు మొదటి గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ గెలుపొందగా.. రెండో గేమ్ డ్రా అయింది. మూడో గేమ్ లో భారత యువ కెరటం గుకేశ్ విజయం సాధించి సమంగా నిలిచాడు. ఆతర్వాత నుండి వరుస డ్రాలతో ఈ ఛాంపియన్ షిప్ సాగుతోంది. తాజాగా జరిగిన 9వ గేమ్ కూడా డ్రాగానే ముగిసింది. దీంతో మొత్తం 7 గేమ్ లు డ్రా అయ్యాయి. తాజా గేమ్ లో 54 ఎత్తుల తర్వాత గేమ్ డ్రా గా ముగిసింది. వరుసగా 6 గేమ్ లను డ్రాగా ముగించి చెరో 4.5 పాయింట్లతో ఇరువురు సమానంగా కొనసాగుతున్నారు. ఈ ఛాంపియన్ షిప్ లో ఇంకా 5 గేమ్ లు ఉన్నాయి.
నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతడు “సింబా” అనే చిత్రం చేస్తున్నాడు.అయితే ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమం జరగాల్సింది. కాకపోతే అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. దీనితో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.ఈ నేపథ్యంలో బాలకృష్ణ తాజాగా మీడియాతో మాట్లాడారు.ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మోక్షజ్ఞ సినిమా గురించి మాట్లాడారు.ఆ సినిమా రోజే ప్రారంభం కావాల్సింది.కాకపోతే మోక్షజ్ఞకు కాస్త ఆరోగ్యం బాలేదు.వాతావరణం మారడం వల్ల స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు.అందుకే ప్రారంభ కార్యక్రమాన్ని మరో రోజుకు వాయిదా వేశాం.ఏది జరిగిన మన మంచికే అనుకోవాలి అని ఆయన అన్నారు.
ఏపి మాజీ సీఎం, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా వైసిపి నేతలతో సమావేశమైయ్యారు.ఈ మేరకు ఆయన ఈరోజు తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ… 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కూటమి నేతలు అసత్య హామీలు ఇచ్చారని మండిపడ్డారు.అన్ని నియోజకవర్గాల ప్రజలతో మమేకమౌతామని వైఎస్ జగన్ చెప్పారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజల తరుపున నిలబడాల్సిన సమయం వచ్చిందని పార్టీ కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు.
నిన్న పుష్ప–2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్‌లో పడింది.దీనికి హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు.అయితే థియేటర్ లో జనాల మధ్య తొక్కిసలాట జరిగింది.అల్లు అర్జున్ వస్తున్నాడని ముందుగానే తెలిసినా…తగిన చర్యలు మాత్రం తీసుకోలేదు.ఇప్పుడు ఈ అంశంపై కేసు నమోదైంది. భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద పోలీసులు కేసు నమోదు చేశారు.అలాగే అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వని కారణంగా…బాధ్యత రహితంగా వ్యవహరించిన అల్లు అర్జున్ బృందంపై కూడా తెలంగాణ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు.దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోలేదన్నారు. థియేటర్‌లోకి వచ్చే వారిని అదుపు చేసేందుకు ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదన్నారు.రాత్రి 9.40 గంటలకు అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారని,ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో వారిని నెట్టివేసిందన్నారు.అప్పటికే థియేటర్ లోపల,…