Author: admin

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణ స్వీకారం చేశారు.శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు.వారితో ఆ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు.ఫడ్నవీస్ 3వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. కాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ,కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్,ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు,మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్,ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుండి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. महाराष्ट्राच्या वेगवान विकासाचा पुनश्च शुभारंभ 🙏#DevaBhauReturns #maharashtra #BJP #narendramodi pic.twitter.com/dP0uw1OuTr— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) December 5, 2024

Read More

పి.ఎస్.ఎల్.వి.-సి59 వాహక నౌకను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శ్రీహరికోట షార్ శాస్త్రవేత్తలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ వాహక నౌక ద్వారా యూరప్ అంతరిక్ష సంస్థకు చెందిన ప్రోటా-3లోని రెండు ఉప గ్రహాలను తీసుకువెళ్లడం, వాటి ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణంపై పరిశోధనలకు వీలు కలుగుతుంది. ఈ ప్రయోగం ద్వారా సౌర అన్వేషణలో మరో అడుగు వేస్తున్నామని తెలిపారు. ప్రధాన నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కాబట్టే అంతర్జాతీయ స్థాయిలో మన శాస్త్రవేత్తలు విజయాలు అందుకుంటున్నారని ఈ స్పూర్తితో మరిన్ని విజయవంతమైన పరిశోధనలు చేస్తారని ఆకాంక్షిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Read More

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.ఈరోజు సాయంత్రం 4.04 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రోఛైర్మన్ ఎస్. సోమనాథ్. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రోబా-3 ఉప గ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టగలిగినట్లు వివరించారు. ప్రోబా తదుపరి చేపట్టే ప్రయోగాలకు ఇస్రో ఛైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ఎస్ఐఎల్ భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని తెలిపారు. త్వరలో స్పేటెక్స్ పేరుతో పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం ఉంటుందని ఇస్రోఛైర్మన్ తెలిపారు. ఈ ఉపగ్రహంతోనే ఆదిత్య ఎల్-1 సోలార్ మిషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.

Read More

అదానీ జగన్ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏసీబీని పంజరంలో బంధించిందని ఆరోపించారు. టీడీపీ బోను నుండి ఏసీబీని విడుదల చేసి స్వేచ్చగా పనిచేసే ఆదేశాలు ఇవ్వండి. అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే.. చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని సోలార్ పవర్ డీల్ లో జగన్ కి రూ.1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని అన్నారు. ఈ విషయాన్ని అమెరికా FBI వెల్లడించింది. ఆధారాలు కూడా బయట పెట్టింది. ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా ? 2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ సోలార్ డీల్ పై హైకోర్టు లో పిటీషన్ కూడా వేసింది. ఇదొక కుంభకోణం అని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల…

Read More

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో అమరావతిల రాజధాని అభివృద్ధి పనులు వేగంగా అడుగులు పడుతున్నాయి.దీనితో గత 5 ఏళ్లుగా రాజధాని అంశంలో నెలకొన్న గందరగోళానికి తెరదించింది.ఈ మేరకు అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు,సంస్థలు ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.ఈ నేపథ్యలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) తన క్యాంపస్‌ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని సమాచారం.రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న బిట్స్ విద్యాలయానికి ఇప్పటికే గోవా,హైదరాబాద్,దుబాయ్‌లలో క్యాంపస్‌లు ఉండగా,తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనూ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అన్ని హంగులతో యాభై ఎకరాల విస్తీర్ణంలో అమరావతిలో క్యాంపస్‌ ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు.ఈమేరకు బిట్స్ ప్రతినిధులు నిన్న సీఆర్డీఏ అధికారులతో కలిసి కురగల్లులోని ఎస్ఆర్ఎం సమీపంలో,వెంకటాయపాలెంలోని బైపాస్ వద్ద స్థలాలను పరిశీలించారు.యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని…

Read More

అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘం PDSC డిమాండ్ చేసింది. ఈమేరకు ఒక ప్రకటనలో పేర్కొంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యతారహిత్యంతో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు, తన కొడుకు చావు బతుకుల్లో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని పెద్ద ఎత్తున అభిమానులు ప్రీమియర్ షో కు వచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అల్లు అర్జున్ దానికి భిన్నంగా వ్యవహరించి షో కి వచ్చాడని పేర్కొంది. దీంతో తొక్కిసలాట జరిగి ఒక నిండు ప్రాణం పోవడమే కాకుండా అనేకమంది హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లను 3వేల వరకు పెంచి పేద మధ్యతరగతికి చెందిన సినిమా అభిమానుల జేబులను గుల్ల చేశారు. సినిమా మీద పెట్టిన పెట్టుబడులను సొమ్ము చేసుకోవడం కోసం, భారీగా లాభాలను ఆర్జించి జనం సొమ్మును దోచుకోవడం కోసం విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. అభిమానుల భారీ స్పందనతో తొక్కిసలాట…

Read More

దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ప్రజల నిర్లక్ష్యం వలన బాధితుల సంఖ్య ప్రతిఏడాది పెరుగుతూనే ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు.చట్టాలంటే ప్రజలకు భయం లేకుండా పోయిందని అన్నారు.రోడ్డు ప్రమాదాల వలన ప్రతి రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారని వ్యాఖ్యానించారు.తానూ కూడా రోడ్డు ప్రమాద బాధితుడినే అని తెలిపారు.ఈరోజు లోక్ సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లోక్ సభలో సమాధానం ఇచ్చారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…దేశంలో ఏడాది కాలంలో 1.68 లక్షల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని… ఇందులో 60 శాతం మంది యువకులే ఉన్నట్లు పేర్కొన్నారు.మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగినట్లు వెల్లడించారు.అందుకే ఈ అంశం తనకు చాలా ప్రత్యేకమైనదని అన్నారు. కాగా ప్రజాప్రతినిధులు,మీడియా,ప్రజల సహకారం లేకుండా రోడ్డు ప్రమాదాలు తగ్గించడం సాధ్యం కాదని అన్నారు.జరిమానాలు ఎంత పెంచినా ప్రజలు…

Read More

అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, ఐటీ షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 809 పాయింట్ల లాభంతో 81,765 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 240 పాయింట్ల లాభంతో 24,708 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.70గా ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ , భారతి ఎయిర్టెల్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

గాజా విషయంలో భారత వైఖరిని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. గాజా విషయంలో ఆ సమస్య పరిష్కారానికి 2-స్టేట్ (ద్విదేశ) సిద్ధాంతానికి తాము మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. గాజా విషయంలో చేసే ఏ తీర్మానంలోనైనా హామాస్ బందీలు, ఉగ్రవాదం అంశం ప్రస్తావించాల్సిందేనని లేకపోతే అది వాస్తవిక దృష్టితో చూసినట్లు ఉండదని అన్నారు. మానవీయ చట్టాలకు, హింసకు స్వస్తి పలకడానికి, కాల్పుల విరమణకు భారత్ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని, ప్రజలను బందించడాన్ని భారత్ ఖండిస్తుందని పేర్కొన్నారు. ఎలాంటి తీర్మానాన్ని అయినా అందులో వాడిన పదాలతో సహా భారత్ పరిపక్వతతో చూస్తుందని తెలిపారు. భారత్ ఇజ్రాయెల్ రక్షణా సహాకారం పైనా జై శంకర్ మాట్లాడారు. అవి జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటామని స్పష్టం చేశారు. జాతీయ భద్రతా ప్రయోజనాల విషయంలో ఇజ్రాయెల్ తో పటిష్ట…

Read More

అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప ది రూల్‌’ చిత్రాన్ని తాము ప్రదర్శించడం లేదని ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ తాజాగా ప్రకటించింది.కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వేయడం లేదని తెలిపింది. ప్రేక్షకులకు అసౌకర్యం కల్పించినందుకు క్షమాపణలు చెప్పింది. సినీప్రియులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని మాత్రం చెప్పలేదు. ప్రసాద్స్‌ అంటే హైదరాబాద్‌ నగరవాసులకు ఎంతో ఇష్టం. ఇక్కడ సినిమాటిక్‌ అనుభూతి పొందాలని అందరూ కోరుకుంటారు. తాజా నిర్ణయంతో సినీ ప్రేమికులు నిరాశకు గురయ్యారు.

Read More