Author: admin

విశాఖపట్నంలో జరిగిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ లో ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ నాలెడ్జ్ హబ్ గా తయారవుతుందని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాలెడ్జ్ ఎకానమీలో యువత రాణిస్తున్నారని పేర్కొన్నారు. విదేశాలలో ఉన్న ఐటీ నిపుణులలో 30 శాతం తెలుగు వారేనని అన్నారు. జీవితంలో టెక్నాలజీ ఒక భాగంగా మారిందని ప్రస్తుతం ప్రపంచమంతా టెక్నాలజీ మీదే చర్చ జరుగుతోందని అన్నారు. 1995లో మొదటి సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. పీపీపీ మోడల్ లో హైటెక్ సిటీ నిర్మించినట్లు తెలిపారు. ఇకపై ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళ్లనున్నట్లు వివరించారు. డీప్ టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. డ్రోన్ల వినియోగం కూడా పెరుగుతోందని అన్నారు. ఏపీ ఆహారం ఉత్పత్తులు, సరఫరాల లో ప్రపంచ హాబ్ గా మారిపోతుందని అన్నారు. రాష్ట్రంలో…

Read More

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్.డీ.ఏ కూటమిలో అత్యంత ఆదర్శనీయ వ్యక్తి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేడని జాతీయ వ్యాప్తంగా పాపులారిటీ, వయసు రీత్యా పవన్ కు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ, వైసీపీ, జనసేన శ్రేణులు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. National popularity and age on his side, I truly believe that Dy. CM @PawanKalyan garu is the most ideal person amongst the leaders of the NDA ruling parties in Andhra Pradesh to lead and represent AP. AP…

Read More

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైస్సార్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.అయితే ఈ కేసులో భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది.అనంతరం భాస్కర్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరూతూ…వైస్ వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు వేశారు. సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది.ఈ నేపథ్యంలోనే ప్రతివాదులు భాస్కర్ రెడ్డి, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది.గతంలో సీబీఐ దాఖలు చేసిన భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను సునీత పిటిషన్ తో జతచేస్తూ…ఉత్తర్వులు ఇచ్చింది.తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి తోలి వారానికి వాయిదా వేసింది.

Read More

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు (డే/నైట్) మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 180 పరుగులకు ఆలౌటయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. నితీష్ రెడ్డి 42 (54; 3×4, 3×6) టాప్ స్కోరర్. కే..ఎల్.రాహుల్ 37 (64;6×4),గిల్ 31 (51; 5×4), అశ్విన్ 22(22; 3×4) , పంత్ 21(35;2×4) పర్వలేదనిపించారు. జైశ్వాల్ 0, రోహిత్ శర్మ (3), కోహ్లీ (7) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో చెలరేగాడు. పాట్ కమ్మిన్స్ 2 వికెట్లు, స్కాట్ బొలాండ్ 2 వికెట్లు తీశారు. భారత్ బ్యాటింగ్: యశస్వీ జైశ్వాల్ (0(, కే.ఎల్.రాహుల్ 37 (64;6×4), శుభ్ మాన్ గిల్ 31 (51; 5×4), విరాట్ కోహ్లీ 7(8;1×4), రిషబ్ పంత్ 21(35;2×4), రోహిత్…

Read More

ఈ ఏడాదికి గాను ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ 100 న‌గ‌రాల జాబితాను యూరోమానిట‌ర్ సంస్థ తాజాగా విడుద‌ల చేసింది.డేటా కంపెనీ లైట్‌హౌస్ భాగస్వామ్యంతో యూరోమానిటర్ ఇంటర్నేషనల్ ఈ వార్షిక నివేదిక‌ను తయారు చేసింది.ఈ జాబితాలో భార‌త్ నుండి కేవ‌లం న్యూఢిల్లీ మాత్ర‌మే స్థానం ద‌క్కించుకుంది.ఈ జాబితాలో ఢిల్లీకి 74వ స్థానంలో నిలిచింది. కాగా వ‌రుస‌గా 4వ ఏడాది కూడా పారిస్ న‌గ‌రం అగ్ర‌స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం విశేషం.రెండో స్థానంలో మాడ్రిడ్ నిలవగా…3వ ర్యాంకులో జ‌పాన్ రాజ‌ధాని టోక్యో నిలిచింది.టోక్యో తర్వాత మిగిలిన టాప్-10 నగరాలలో రోమ్,మిలన్,న్యూయార్క్,ఆమ్‌స్టర్‌డామ్, సిడ్నీ,సింగపూర్,బార్సిలోనా ఉన్నాయి.

Read More

ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, సిక్కింలను సెవెన్ సిస్టర్స్ గా పిలుస్తారనే సంగతి తెలిసిందే. కాగా ఈ రాష్ట్రాలకు చెందిన 250పైగా ఉన్న సాంప్రదాయ హస్తకళలు, మరియు జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం మరియు పర్యాటక రంగంలో ఆర్థిక అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ‘అష్టలక్ష్మీ మహోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్ర ప్రజల సంస్కృతులు, చేనేతవస్త్రాలు, హస్తకళలను, , వారి వైవిధ్యమైన జీవన శైలిని ప్రపంచానికి, భారతదేశానికి పరిచయం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 6, 2024 అష్టలక్ష్మీ మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఇది డిసెంబర్ 6 నుంచి 8 వరకు ఢిల్లీలోని భారత మండపంలోని ప్రగతి మైదాన్ లో జరుగుతోంది. ఈ ఎనిమిది రాష్ట్రాలను అష్టలక్ష్ములుగా పిలవబడే లక్ష్మీ దేవత యొక్క ఎనిమిది రూపాలైన ఐశ్వర్యం, శ్రేయస్సు, స్వచ్ఛత, సంపద, జ్ఞానం, కర్తవ్యం,…

Read More

రెబల్ స్టార్ ప్రభాస్ కథనాయకుడిగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు.ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది.ఇందులో ప్రభాస్ తో కలిసి నయనతార ఒక ప్రత్యేక పాటలో ఆడిపాడనున్నట్టు సమాచారం.ఇప్పటికే ఆమెతో దర్శక-నిర్మాతలు సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.ఈ నెలాఖరులో పాటను చిత్రీకరించే అవకాశం ఉంది.వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల చేయనున్నారు.

Read More

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్న చిత్రంలో రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్నాడు.అయితే ఇది రామ్ కు 22వ చిత్రం.ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.ఈ చిత్రంలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు.’మీకు సుపరిచితుడు…మీలో ఒకడు…మీ సాగర్’ అంటూ రామ్ పాత్రను పరిచయం చేశారు.ఈ చిత్రానికి దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటుగా, రెగ్యులర్ షూటింగ్ మొదలైందని దర్శక నిర్మాతలు తెలిపారు.ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ సిటీలో షూటింగ్ జరుగుతోంది.ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రానికి వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. DAY ONE of #RAPO22Meet “SAGAR” He’s all LOVE… can’t wait to play him..Be him.. Live him.. Experience him..❤️ pic.twitter.com/BuFinPuDix— RAm POthineni (@ramsayz) December 6, 2024

Read More

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 9వ రోజు ప్రారంభమయ్యాయి.రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాక చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు.కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటులో నగదు గుర్తించామని తెలిపారు.500 రూపాయిల కరెన్సీ నోట్లు దొరికాయని తెలిపారు.పార్లమెంట్ భద్రతా అధికారులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.నిన్న సభ వాయిదా పడిన తర్వాత సాధారణ తనిఖీ చేస్తున్న సమయంలో నగదు పట్టుబడిందని,ప్రస్తుతం అభిషేక్ సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 నుండి కరెన్సీ నోట్లను భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో విచారణ జరుగుతుందని,ఈ మేరకు ఆదేశించానని ధన్‌ఖడ్ చెప్పారు.ధన్‌ఖడ్ చేసిన ఈ ప్రకటనపై విపక్ష కాంగ్రెస్ ఎంపీలు ఒక్కసారిగా భగ్గుమన్నారు.నిరసనలకు దిగారు.విచారణ జరపకుండానే ఇలా పేరు ప్రకటించడం ఏమిటిని మండిపడ్డారు.గౌరవ సభా చైర్మన్ స్థానంలో కూర్చొని ఈ విధంగా ఎలా ప్రకటిస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు,రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.

Read More

వెస్ట్ బెంగాల్ సమీపంలోని సరిహద్దుల్లో టర్కీ తయారీ డ్రోన్లను బంగ్లాదేశ్ మోహరించిందన్న సమాచారంతో భారత్ అలర్ట్ అయ్యింది.ఈ మేరకు సరిహద్దుల వద్ద నిఘాను పెంచింది.బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఇవ్వడంతో ఈ పరిణామం చోటుచేసుకుందని తెలుస్తోంది. భారత సరిహద్దు సమీపంలో టర్కీ తయారీ‘బైరాక్టర్ టీబీ2 మానవరహిత వైమానిక వాహనాలను మోహరించినట్టు వచ్చిన నివేదికలను ఆర్మీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.నిఘా కార్యకలాపాల కోసం బంగ్లాదేశ్‌లోని 67వ ఆర్మీ వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిసింది.బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం వీటిని మోహరించినప్పటికీ,అధునాతన డ్రోన్లను సున్నిత ప్రాంతాల్లో ఉంచడంతో భారత్ అలెర్ట్ అయ్యింది.

Read More