బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ గెలిచి ఈ సిరీస్ ను విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. అడిలైడ్ వేదికగా రేపు డే/నైట్ పింక్ బాల్ టెస్టు ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో మొదటి మ్యాచ్ లో అందుబాటులో లేని కెప్టెన్ రోహిత్ శర్మ ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి టెస్టులో ఓపెనర్లుగా కే.ఎల్.రాహుల్, యశస్వీ జైశ్వాల్ ఓపెనర్లుగా సత్తా చాటిన నేపథ్యంలో రోహిత్ ఏ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడో అనే ప్రశ్నకు రోహిత్ తన సమాధానంతో స్పష్టతనిచ్చాడు. కే.ఎల్.రాహుల్ ఓపెనర్ గా వస్తాడని తాను మిడిల్ ఆర్డర్ లో వస్తానని తెలిపాడు. బ్యాటర్ గా తనకు అంత తేలిక కాదని అయితే జట్టుకు ఇదే ఉత్తమం అని పేర్కొన్నాడు. ఫలితం అనుకూలంగా రాబట్టడానికి దేనికైనా సిద్ధమని చెప్పాడు. కే.ఎల్.రాహుల్ జైశ్వాల్ తో కలిసి కీలక…
Author: admin
రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన మాజీ సీఎం జగన్ కు మరోసారి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.This is వాస్తవం…! మీ పాలనలో ఉత్తరాంధ్ర రైతులను పట్టించుకొన్నారా? మా కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఈ క్షణానికి 1,61,489 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మరి మీరేం చేశారు? ఓసారి లెక్కలు చూసుకోండి అంటూ గణాంకాలు కూడా తన పోస్ట్ కు జత చేశారు. ఇక మరోవైపు విశాఖపట్నంలో నిర్వహించిన పౌర సరఫరాల శాఖ రీజినల్ కాన్ఫరెన్స్ లో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. This is వాస్తవం…! @ysjaganమీ పాలనలో ఉత్తరాంధ్ర రైతులను పట్టించుకొన్నారా? మా కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఈ క్షణానికి 1,61,489 మెట్రిక్ టన్నుల ధాన్యం…
డ్రాగన్ దేశం చైనాలో భూమి ఒక్కసారిగా కుంగింది.షెన్ జన్ సిటీ లో రైల్వే పనులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.దీంతో రైల్వే పనులు చేస్తున్న కొంత మంది కార్మికులు భూమిలోకి కుక్కుకుపోయారు.వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి.క్షతగాత్రులను సమీప హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు.ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోని ఇళ్లను ఖాలి చేయించారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా బన్నీ తనయుడు అయాన్ ఆయనకు ఒక లేఖ రాశాడు. తండ్రిని చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నాడు. తన తండ్రి సాధించిన విజయాల పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ఈ లేఖను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. తన తనయుడి లేఖ పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు సాధించిన విజయాల్లో ఇదే అతి పెద్దదని తెలిపాడు. ఇలాంటి ప్రేమను పొందడం తన అదృష్టం అన్నాడు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఆగడం లేదు.గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఆయనకు ఇప్పటికే పలు మార్లు బెదిరింపులు వచ్చాయి.తాజాగా మరోసారి ఆయన వీటిని ఎదుర్కొన్నారు.ముంబయిలో బుధవారం రాత్రి ఆయన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సెట్ లోకి అడుగు పెట్టాడు.లారెన్స్ బిష్ణోయ్ పేరు చెబుతూ బెదిరింపులు పాల్పడ్డాడు.దీంతో అక్కడ ఉన్న వారంతా ఆ వ్యక్తిని పట్టుకున్నారు.పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ కు లారెన్స్ గ్యాంగ్ నుంచి ఇంతకాలంగా బెదిరింపులు వస్తున్నాయి.తాము ఎంతగానో పూజించే కృష్ణ జింకలను వెతాడినందుకు సల్మాన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే పలుమార్లు లారెన్స్ ముఠా డిమాండ్ చేసింది.క్షమాపణలు చెబితే చేయని తప్పును అంగీకరించినట్టు అని అందుకే సల్మాన్ ఆ పని చేయడని ఆయన తండ్రి సలీం ఖాన్ గతంలో అన్నారు.
బంగ్లాదేశ్ లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్న విషయం తెలిసింది.ఈ సమయంలో ఆ దేశ జైళ్ల శాఖ చీఫ్ సయిద్ మహమ్మద్ మొతాహెర్ హుస్సేన్ కీలక విషయాన్ని తెలియ జేశారు.జైళ్ల నుంచి ఉగ్రవాదులు తప్పించుకున్నారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు వ్యతిరేకంగా ఈ ఏడాది ఆరంభంలో విద్యార్థులు, పలు సంఘాలు ఉద్యమాలు చేసిన విషయం తెలిసింది.ఆ సమయంలో జైళ్ల నుంచి దాదాపు 2000 మంది ఖైదీలు తప్పించుకున్నారు.అందులో 1500 మందిని అధికారులు పట్టుకున్నారు.మిగిలిన వారంతా పరారీ లో ఉన్నట్లు మహమ్మద్ హుస్సేన్ వెల్లడించారు. అందులో కనీసం 70 మంది ఉగ్రవాదులు, హంతకులు ఉన్నట్లు తెలిపారు.
అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రూల్.ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఈరోజు l ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న ఈ సినిమా ప్రీమియర్ షోస్ పలు చోట్ల ప్రదర్శించారు. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన బెనిఫిట్ షో లో అపశృతి చోటు చేసుకుంది. అల్లు అర్జున్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.దీంతో తొక్కిసలాట జరిగింది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో రేవతి అనే మహిళ అస్వస్థత కు గురైంది. ఆమెను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె తనయుడు కూడా అస్వస్థత కు గురికాగా పోలీసులు సీపీఆర్ చేశారు. View this post on Instagram A post shared by NavyaAndhra Times (@navyaandhratimes)
బిట్ కాయిన్ విలువ దూసుకుపోతోంది. తాజాగా ఈ క్రిప్టోకరెన్సీ విలువ 1,00,000 (లక్ష) డాలర్లు దాటింది. ఇటీవల అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడం కూడా బిట్ కాయిన్ విలువ పెరిగేందుకు దోహదం చేసింది. క్రిప్టో కరెన్సీ పై నిబంధనల సడలింపు పై ట్రంప్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఇది 1,00,000 డాలర్ల మార్కు దాటింది. అమెరికా ఎన్నికల రోజున 69 వేల పైచిలుకు ఉన్న బిట్ కాయిన్ విలువ రెండు సంవత్సరాల క్రితం 17 వేల దిగువకు కూడా పడిపోయింది. ఇక తాజాగా లక్ష డాలర్లు దాటడం గమనార్హం. క్రిప్టో కరెన్సీ అనుకూల పాలసీలు వస్తాయనే అంచనాలు కూడా బలపడడంతో బిట్ కాయిన్ ఈ రేంజ్ ను దాటింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కేరళ ఎంపీల బృందం కలిసింది. కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలోని బృందం అమిత్ షా ను కలిసి ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన వయనాడ్ ను ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సంవత్సరం భారీ వర్షాలతో జులై 30న జరిగిన ప్రకృతి విధ్వంసంలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజకీయాలు పక్కనపెట్టి వయనాడ్ బాధితులకు సహాయం చేయాలని హోం మంత్రి అమిత్ షా ను కోరినట్లు ప్రియాంక తెలిపారు. ఎందరో నిరాశ్రయులయ్యారని పాఠశాలలు, వ్యాపారాలు, నివాసాలు కొట్టుకుపోయాయని వారిని ఆదుకోవాలని పేర్కొన్నారు.
లోక్ సభలోని ప్రశ్నోత్తరాల సమయంలో రైళ్ల వేగాన్ని పెంచే విధంగా తీసుకుంటున్న చర్యలకు సంబంధించి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు యం.శ్రీభరత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధామిచ్చారు. దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన రైల్వే ట్రాకులను ఆధునీకరించే ప్రక్రియ శరవేగంగా జరుగుతున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అప్పట్లో రైళ్లు గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంగా వెళ్లేలా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వాటిని క్రమంగా గంటకు 120 నుండి 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే విధంగా ఆధునీకరించే ప్రక్రియ శరవేగంగా జరుగుతుందన్నారు.