నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో తల్లితండ్రులు – ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించేలా విద్యాశాఖ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి స్థాయి నుండి స్థానిక నాయకుల వరకు పాల్గొననున్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పన, నాణ్యమైన విద్య అందించేందుకు సలహాలు, సూచనలపై చర్చలు జరపనున్నారు. రాజకీయ ప్రస్తావన లేకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం కార్యక్రమం జరగనుంది.
Author: admin
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తక్కువ ధరకే ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను ఇవ్వనుంది.ఈ మేరకు కేవలం రూ.300కే ఈ అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నాయి.అయితే ఈ కనెక్షన్ ఖరీదు రూ.300 అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.ఈ కనెక్షన్‌ను మొదట దశలో నారాయణపేట,సంగారెడ్డి,పెద్దపల్లి జిల్లాల్లో అమలు చేయనున్నారని సమాచారం.ఈ పథకాన్ని మొదటిగా కొన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు.ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేస్తారు.ఈ పథకం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.2500 కోట్లను కేటాయించింది.ఈ కనెక్షన్‌ను 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇస్తారు. రేపు ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.అయితే కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న అన్ని గ్రామాలకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరుతో పథకాన్ని ఈ ప్రారంభించింది.అయితే ఈ ఫైబర్ నెట్ కనెక్షన్ బాధ్యతను టీ ఫైబర్ సంస్థ టీ సంస్థ తీసుకుంది.
వచ్చే ఏడాది జరగనున్న ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రాలో భారత టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నగాల్ కు నేరుగా ప్రవేశం లభించింది. దీంతో కెరీర్ లో ఐదో గ్రాండ్ స్లామ్ ఆడనున్నాడు. అతను ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో 98వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెన్నిస్ ఆస్ట్రేలియా తాజాగా ప్రకటించిన జాబితాలో నగాల్ కు స్థానం దక్కింది. గతేడాది నగాల్ క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రా లో అడుగుపెట్టాడు. ఇక ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ లో ప్రపంచ నెంబర్ వన్ సినర్ టాప్ సీడ్ గా బరిలోకి దిగుతున్నాడు. మహిళల సింగిల్స్ లో సబలెంక టాప్ సీడ్ గా బరిలోకి దిగనుంది. Pic credits: Sumit nagal twitter
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.అటెండెన్స్ మొబైల్ యాప్‌లో సచివాలయానికి వచ్చిన టైమ్,వెళ్లిన టైమ్ రెండు నమోదు చేయాలని పేర్కొంది.తాజాగా యాప్‌లో మరికొన్ని అప్డేట్స్ చేశారు.ఏపీ ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఉద్యోగులు ఇక నుండి కచ్చితంగా సమయపాలన పాటించాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది.అంతేకాకుండా ఇక అటెండెన్స్ తప్పనిసరి చేసింది.సచివాలయ ఉద్యోగుల దగ్గర ఉండే అటెండన్స్ యాప్‌లో ఉదయం డ్యూటీకి వచ్చినపుడు ఒకసారి…సాయంత్రం ముగించుకొని వెళ్తున్నప్పుడు మరోసారి తప్పని సరి అటెండన్స్ నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో యాప్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు.కొత్తగా GSWS అటెండన్స్ యాప్ వెర్షన్ 2.2.1 లో ఉదయం 10:30 లోపు మాత్రమే అటెండన్స్ తీసుకుంటుందని వెల్లడించారు.అంతేకాదు సాయంత్రం 5 తర్వాత కచ్చితంగా బయోమెట్రిక్ వేయాల్సిందే.అప్పుడే ఫుల్ డే సాలరీ వస్తుందని ఎవరైనా ఉద్యోగి ఉదయం ఒకసారి అటెండెన్స్ వేసి సాయంత్రం…
సిరియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి మన పౌరులను తక్షణమే దేశం వీడాలని అడ్వైజరీ జారీ చేసింది. సిరియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు భారతీయ పౌరులు సిరియా ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సిరియాలో ఉన్న భారతీయులు డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో వారి అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ +963 993385973 (వాట్సాప్‌లో కూడా) మరియు అప్‌డేట్‌ల కోసం ఇమెయిల్ ID hoc.damascus@mea.gov.inలో టచ్ లో ఉండాలని తెలిపారు. వీలైన వారు, అందుబాటులో ఉన్న కమర్షియల్ ఫ్లైట్‌ల ద్వారా బయలుదేరాలని సూచించారు. మరియు ఇతరులు తమ భద్రత గురించి జాగ్రత్తలు తీసుకోవాలని మరియు వారి కదలికలను కనిష్ట స్థాయికి పరిమితం చేయాలని సూచించారు.
తనకు కేటాయించిన సీటు వద్ద నగదు లభ్యమైందంటూ రాజ్యసభ చైర్మన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు.రాజ్యసభకు వెళ్లేటప్పుడు ఒక రూ.500 నోటు తీసుకెళ్తుంటానని ఆయన చెప్పారు.నిన్న మధ్యాహ్నం 12.57 గంటల సమయంలో నేను పార్లమెంట్‌కు చేరుకున్నాను.మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సభలో ఆందోళన జరుగుతోంది.ఆ సమయంలో నేను క్యాంటీన్‌కు వెళ్లి 1.30 గంటల వరకు అక్కడే ఉన్నాను.అయోధ్య ప్రసాద్‌తో కలిసి క్యాంటీన్‌లో ఉన్నానని చెప్పారు.ఆ తర్వాత పార్లమెంట్ నుండి వెళ్లిపోయాను.కానీ మీరు నా పేరు ప్రస్తావించారని అభిషేక్ మను సింఘ్వీ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.కాగా ఆయన తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా విజయవాడ లోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో చేపట్టిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువులు, పర్యాటక శాఖల సహాయ మంత్రి సురేష్ గోపి పాల్గొన్నారు. కర్ణాటక సంగీతంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాలను, తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి గల గాఢ అనుబంధాన్ని చాటిచెప్పే ఉత్సవం కృష్ణవేణి సంగీత నీరాజనం అని ఆయన పేర్కొన్నారు. అందరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జీవం పోయడంలో కృషి చేసిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లు, రాష్ట్ర టూరిజం శాఖ అంతేకాకుండా ఎంతో అంకిత భావంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సంగీత పర్యాటకం, వారసత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు రోజుల పాటు కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం…
అండర్-19 ఆసియా కప్ లో భారత్ ఫైనల్ చేరింది. నేడు శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్ లో 7 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ వేటలో దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటయింది. లక్విన్ (69) అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. షరుజన్ (42) పరుగులతో పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో చేతన్ శర్మ 3 వికెట్లు, కిరణ్ 2 వికెట్లు, ఆయుష్ 2 వికెట్లు, హార్దిక్, గుహా చెరో వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో భారత్ 21.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్య వంశీ 67(36; 6×4, 5×6) అదరగొట్టాడు. ఆయుష్ మాత్రే 34(28;7×4) రాణించాడు. సిద్దార్థ్ (22), మహామ్మద్ అమన్ (25 నాటౌట్), కార్తీకేయ (11 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో వీరణ్ చముదిత, ప్రవీణ్, విహాస్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.…
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు (డే/నైట్) మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (13) వికెట్ ను కోల్పొయింది. ప్రస్తుతం నాథన్ మెక్స్వీనీ 38 బ్యాటింగ్ (97,6×4), మార్నస్ లబుషేన్ 20 బ్యాటింగ్ (67, 3×4) క్రీజులో ఉన్నారు. ఆసీస్ ఇంకా 94 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేసింది. మొత్తంగా మొదటి రోజు ఆధిపత్యం కనబరిచింది. ఇక అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. నితీష్ రెడ్డి 42 (54; 3×4, 3×6) టాప్ స్కోరర్. కే..ఎల్.రాహుల్ 37 (64;6×4),గిల్ 31 (51; 5×4), అశ్విన్ 22(22; 3×4) , పంత్ 21(35;2×4) పర్వలేదనిపించారు. జైశ్వాల్…
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈవారాంతాన్ని స్వల్ప నష్టాలతో ముగించాయి. వరుసగా ఐదు రోజుల పాటు లాభాల్లో పయనించిన సూచీలు నేటి సెషన్ లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్.బీ.ఐ కీలక వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపలేకపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 56 పాయింట్ల నష్టంతో 81,709 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 30 పాయింట్ల నష్టంతో 24,677 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.69గా ఉంది. యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, మారుతీ సుజుకి, ఎల్ అండ్ టీ, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.