Author: admin

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని విభజన అంశాలకు సంబంధించి చర్చలు జరిపేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఉన్నతాధికారుల కమిటీ సమావేశమైంది. ఈ ఏడాది జులై లో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ప్రజా భవన్ వేదికగా సమావేశమైన సంగతి తెలిసిందే. పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీకి కొనసాగింపుగా ఇప్పుడు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఉభయ రాష్ట్రాల ఆస్తుల పంపకాలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు తదితర విషయాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Read More

బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆమె స్పందిస్తూ…బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.తాజాగా మరో ముగ్గురు హిందూ సన్యాసులను అరెస్టు చేశారు.మనకు బంగ్లాదేశ్‌లో కుటుంబాలు,ఆస్తులు,మనకు ఇష్టమైనవారు ఉన్నారు.దీనిపై భారత ప్రభుత్వం ఎలాంటి వైఖరిని అవలంబించినా మేము అంగీకరిస్తాము.అయితే ప్రపంచంలో ఎక్కడైనా సరే మతపరంగా జరిగే దురాగతాలను మేము ఖండిస్తూనే ఉంటాము.బంగ్లాదేశ్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి,ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామని మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతా శాఖకు చెందిన ఇస్కాన్ చీఫ్‌తో మాట్లాడి సానుభూతిని,మద్దతును తెలిపినట్లు మమత పేర్కొన్నారు.బంగ్లాదేశ్‌లో భారతీయులపై దాడి జరిగితే దాన్ని తాము సహించలేమని అన్నారు.తాము తమ ప్రజలను తిరిగి తీసుకురాగలమని చెప్పారు.భారత ప్రభుత్వం ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్లవచ్చని,యూఎన్‌ శాంతి పరిరక్షక దళాన్ని పంపవచ్చని అన్నారు.

Read More

ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉండవల్లి లోని ఆయన నివాసంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవులు, ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన విషయాలు సహా పలు అంశాలపై వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. త్వరలో రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పలు సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More

రాష్ట్రంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని ఆక్షేపించారు. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉంది. కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని షర్మిల ఆరోపించారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చని అన్నారు. నిజాలు నిగ్గు తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుంది ? మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు…

Read More

ఏపి సిఎం,చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన కేసులకు సంబంధించి వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది.ఆయనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ…పెట్టుకున్న పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది.ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని పోలీసులను ఆదేశించింది.తదుపరి విచారణ ఈనెల 9వ తేదీకు వాయిదా వేసింది.ఈ నెల 9వ తేదీ వరకు వర్మపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Read More

కర్నూలులో ఏర్పాటు కావాల్సిన హైకోర్టును అమరావతికి తీసుకెళ్లి,హైకోర్టు బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదని, కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు.హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిందని గుర్తు చేశారు.అమరావతికి హైకోర్టును తరలించడం సరికాదని అన్నారు. కర్నూలులో బెంచ్ ను ఏర్పాటు చేయడం రాయలసీమకు అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు.కడప కేంద్రంగా ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించారని,కడపలో ఉంటే ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.రాజధానిని,హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేయడంతో, రాయలసీమ ప్రాంతంలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఏకపక్ష నిర్ణయాలతో ప్రాంతీయ విభేదాలు తలెత్తి,మళ్లీ వేర్పాటువాదం బలపడే ప్రమాదం ఉందని చెప్పారు.

Read More

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయనే భయాందోళనల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ కు సహాయం చేస్తూ వస్తున్న అమెరికా అణ్వాయుధాలను ఉక్రెయిన్ కు తిరిగి ఇవ్వబోవడం లేదని స్పష్టం చేసింది. సోవియట్ యూనియన్ పతనం తరువాత కీవ్ వదులుకున్న అణ్వాయుధాలను తిరిగి ఇవ్వబోమని ఉక్రెయిన్ తమను తాము రక్షించుకుంటూ రష్యాతో పోరిడేందుకే సాయం చేస్తున్నట్లు పేర్కొంది. పదవి నుండి వైదొలగేముందు బైడెన్ కు కొందరు ఉక్రెయిన్ కు అణ్వాయుధాలను ఇచ్చే అంశంపై సూచనలు ఇచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది.

Read More

‘ముఫాసా ది లయన్‌ కింగ్‌’ చిత్రానికి మహేశ్‌బాబు వాయిస్‌ ఓవర్‌ అందించిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 20న ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నమ్రత పాల్గొన్నారు. ‘‘మహేశ్‌ కాస్త బిజీగా ఉన్నారు. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.సాధారణంగా ఆయనకు డబ్బింగ్‌ చెప్పడం అంటే పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ, ఈ చిత్రంలో ముఫాసా పాత్రకు ఇష్టంతో డబ్బింగ్‌ చెప్పారు.ప్రేక్షకులు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా’’ అని అన్నారు.

Read More

స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మిత్రుడు,అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వచ్చిన విషయం తెలిసిందే.ఆ సమయంలో అల్లు అర్జున్ నంద్యాల పర్యటించడం తీవ్ర వివాదాస్పదమైంది.ఈ అంశం పోలీసు కేసు, న్యాయస్థానాల్లో పిటిషన్ల వరకు వెళ్లింది.ఈ మేరకు తాజాగా టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎక్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అల్లు అర్జున్ గారూ…. నంద్యాలలో మీరు చేసిన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.నంద్యాలలో మీరు ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించినట్టుగానే…ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నానని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. నంద్యాలను సందర్శించాలన్న మీ సెంటిమెంటు మాకు మాత్రం బాగా వర్కౌట్ అయిందని సెటైర్ వేశారు. అల్లు అర్జున్ గారూ… ఇప్పుడు మీ సెంటిమెంటే మా సెంటిమెంటు.అంతేకాదు, మీ పుష్ప-2 చిత్రం పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం…

Read More

అత్యంత వైవిధ్యమైన అందమైన వృక్ష సమూహం ‘మడ అడవులు’. ఉష్ణ, సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో సహజసిద్ధంగా వ్రేళ్ళు, మొదళ్ళు నీటిలో కనిపిస్తూ పైకి పచ్చని మొక్కలతో దట్టంగా పొదలలాగా కనిపించే వనాల సముదాయం మడ అడవులు. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల పచ్చగా కళకళలాడుతూ తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా నిలిచి ప్రకృతి విపత్తుల నుండి రక్షణగా నిలుస్తోంది ఈ పర్యావరణ వ్యవస్థ. ఉప్పు నేలలో ఆటుపోట్లకు చేరువలో పెరిగే ప్రత్యేక సామర్థ్యాన్ని ఇవి కలిగిఉంటాయి. వరదల నుండి, తుఫానుల తీవ్రత తగ్గించడంతో పాటు అలల ఉధృతి నుండి ఆ ప్రాంతన్ని నేల కోతకు గురికాకుండా కాపాడతాయి. సునామీ వంటి విపత్తుల సమయంలో భారీ నష్టం వాటిల్లకుండా రక్షిస్తాయి. నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో ఈ మడ అడవులు పెరుగుతాయి. ఈ అడవులు ఎన్నో జీవరాసులకు జీవనాధారముగా నిలుస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నాయి. నల్లమడ, తెల్లమడ, పొన్న,దుడ్డుపొన్న, కలింగ, తాండ్ర,…

Read More