తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత హరీశ్ రావుపై కేసు నమోదు అయింది.హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో తన ఫోన్ ట్యాప్ చేయించి వేధించారని సిద్ధిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.దీనితో హరీశ్ రావుపై ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు అయ్యాయి.హరీశ్‌రావుతోపాటు అప్పటి టాస్క్‌ఫోర్స్ డీజీపీ రాధాకిషన్‌రావుపైనా కేసు నమోదు అయింది.
Author: admin
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియా అమెరికాలో కటకటాల పాలయ్యారు.తన మాజీ ప్రియుడితోపాటు,అతడి స్నేహితురాలిని హత్య చేసిన ఆరోపణలతో ఆమెను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.న్యూయార్క్‌లో ఉంటున్న అలియా గత కొంతకాలంగా ఎడ్వర్డ్ జాకోబ్‌తో డేటింగ్‌లో ఉన్నారు.అనుకోని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు.ఈ క్రమంలోనే జాకోబ్ మరో అమ్మాయితో రిలేషన్ మొదలుపెట్టాడు.ఈ విషయం తెలిసి అలియా ఆగ్రహానికి గురయింది.జాకోబ్‌తోపాటు ఆయన స్నేహితురాలిని పలుమార్లు హెచ్చరించింది. ఇటీవల వారి ఇంటికి నిప్పటించింది.ఈ ప్రమాదంలో జాకోబ్,ఆయన స్నేహితురాలు కన్నుమూశారు.ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాగ్మూలం మేరకు అలియాపై కేసు నమోదు చేసి తాజాగా అరెస్ట్ చేశారు.ఈ కేసులో ఆమె కనుక దోషిగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు పెళ్లి పీటలెక్కనున్నారు. త్వరలో ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు.పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయితో ఈ నెల 22న ఆమె పెళ్లి జరగనుంది.రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరగనున్నఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలతోపాటు అత్యంత సన్నహితులు,పలువురు క్రీడాకారులు పాల్గొననున్నారు.ఈపెళ్లి గురించి సింధు తండ్రి మీడియాతో మాట్లాడారు.మా కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. గత నెలలోనే పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. ఇటీవల డేట్ ఫైనల్ చేసుకున్నాం.జనవరిలో సింధుకు వరుస టోర్నీలు ఉన్నాయి.అందుకే డిసెంబర్‌లోనే పెళ్లి చేయాలని నిర్ణయించాం.ఈ నెల 24న హైదరాబాద్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ ఉంటుంది.ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య గతేడాది నుంచి యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. దీని వల్ల పశ్చిమాసియా దేశంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ చెరలోని బందీలకు సంబంధించిన ఓ వీడియోను ఇటీవల హమాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిలిటెంట్ సంస్థపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టే లోపు బందీలను విడుదల చేయకపోతే నరకం చూపిస్తానని హెచ్చరించారు. ‘నేను అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న బాధ్యతలు అందుకుంటా. ఈలోపు బందీలను విడుదల చేయాలి. అలా కానీ పక్షంలో ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడేవారికి తప్పకుండా నరకం చూపిస్తా. చరిత్రలో ఎప్పుడూ చూడని తీవ్ర పరిణామాలు వాళ్లు ఎదుర్కొనేలా చేస్తా’ అని సోషల్‌మీడియా వేదికగా తెలిపారు.
ప్రముఖ సంగీత దర్శకుడు,గాయకుడు రమణ గోగులకు టాలీవుడ్‌లో మంచి పేరు ఉంది.గతంలో ప్రేమంటే ఇదేరా, తమ్ముడు, బద్రి, జానీ వంటి చిత్రాలతో ఆయన మ్యూజిక్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆయన మరోసారి తన మ్యూజిక్‌తో మేజిక్ చేయడానికి సిద్ధమయ్యారు.వెంకటేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” లో ఆయన గోదారి గట్టు మీద రామ చిలకే అనే పాట ఆలపించారు. తాజాగా ఈ పాటను చిత్రబృందం విడుదల చేసింది.భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా…రమణ గోగుల, మధు ప్రియ ఈపాట పాడారు.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు, 2013లో విడుదలైన 1000 అబద్ధాలు సినిమా తర్వాత రమణ గోగుల సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. దాదాపు 18…
విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు సంబంధించిన తొలిదశ డీపీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది.తొలిదశకు మొత్తంగా రూ .11498 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది.తొలిదశలో 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు ఒకటో కారిడార్,గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5 కిలోమీటర్లు 2వ కారిడార్,తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6 కిలోమీటర్లు 3వ కారిడార్ నిర్మించనున్నారు.రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్లు నాలుగో కారిడార్ నిర్మించనున్నామని పురపాలకశాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
2025 ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్న పాక్ భారత్ కోరిన హైబ్రిడ్ మోడల్ కు సంబంధించి ఒక మెలిక పెట్టిన సంగతి తెలిసిందే. భారత్ పాక్ కు వెళ్లడం నిరాకరించిన నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ ఒకటే పరిష్కారమని ఐసీసీ పేర్కొనగా… దీనిపై పాక్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. హైబ్రిడ్ మోడల్ కు సరే నని కానీ భవిష్యత్తులో తమ జట్టు కూడా ఐసీసీ టోర్నీలలో భారత్ కు వెళ్లకూడదని నిర్ణయిస్తే తమకు ఇదే విధంగా హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ లు ఏర్పాటు చేయాలని కోరింది. ఇక ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు మాజీ టీమిండియా టర్బోనేటర్ చురకలంటించాడు. మీకు ఇష్టం లేకపోతే భారత్ కు రావొద్దని పేర్కొన్నాడు. అందులో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నాడు. పాక్ జట్టు భారత్ కు రాకపోయినా ఎవరూ పట్టించుకోరని అన్నాడు. పాకిస్థాన్ లో పరిస్థితి వేరేలా ఉంటే ఈ విషయంలో భారత…
రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ లో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయిందని, ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ‘ఎక్స్’ వేదికగా దుయ్యబట్టారు. కాగా, దీనికి ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు నాదెండ్ల ట్వీట్ చేశారు.గుడ్ మార్నింగ్ జగన్ గారూ.. వాస్తవాలు చెప్పే లెక్కలు ఓసారి కళ్ళారా చూడండి. మీ నిర్వాకం తెలుస్తుంది. మీ పాలనలో సరిగ్గా ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43 మెట్రిక్ టన్నులు. బాధ్యతతో కూటమి ప్రభుత్వం సేకరించిన ధాన్యం 9.14 మెట్రిక్ టన్నులు. సేకరించిన 24 గంటల్లో రైతు ఖాతాలోకి డబ్బులు వేస్తున్నాం అంటూ నాదెండ్ల బదులిచ్చారు. రైతుకి అండగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వం అని మనోహర్ పేర్కొన్నారు. Good Morning @ysjagan గారూ..…
కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయిందని ‘ఎక్స్’ వేదికగా దుయ్యబట్టారు. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి, అవసరమైన సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతుల వద్ద ధాన్యం కొనే నాథుడే లేకుండాపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆక్షేపించారు. మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారన్నారు. మద్దతు ధర దక్కడం రైతులకు ఎండమావిగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. 75 కిలోల బస్తాకు రూ.1725ల చొప్పున ఏ ఒక్కరికీ అందే పరిస్థితి…
పుష్ప ది రూల్ ధరల పెంపునకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. డిసెంబర్ నాలుగో తేది ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.800 గా నిర్ణయించింది. 5వ తేది నుంచి 17వ తేది వరకు టికెట్ ధరను గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్ లో లోయర్ క్లాస్ రూ.100, ఉప్పర్ క్లాస్ రూ.150 వరకు పెంచుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం పై అల్లుఅర్జున్ హర్షం వ్యక్తం చేశారు