Author: admin

పృథ్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘లూసిఫర్’. రాజకీయ నేపథ్యమున్న యాక్షన్ భరిత వినోదాత్మక కథాంశంతో రూపొందిన ఈచిత్రం భారీ ప్రేక్షకాదరణ పొంది ఘన విజయం నమోదు చేసింది. కాగా, ఈచిత్రానికి రెండో భాగం కూడా రానుంది.’లూసిఫర్’:ఎంపురాన్ గా రానుంది. గతేడాది ప్రారంభమైన ఈచిత్ర చిత్రీకరణ తాజాగా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మోహన్ లాల్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. చిత్రీకరణ పూర్తయింది. యూ.కే, యూ.ఎస్.ఏ, యూ.ఏ.ఈ సహా 8 రాష్ట్రాలు మరియు 4 దేశాలలో 14 నెలల అద్భుతమైన ప్రయాణమని తెలిపారు . మురళీ గోపీ ఈ సినిమాకి మూలాధారమైన కథను అందించినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక కళాకారుడిగా తన ప్రయాణంలో ‘ఎంపురాన్ ‘ ఒక గొప్ప అధ్యాయమని పేర్కొన్నారు. 2025 మార్చి 27న ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More

రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు.సంక్రాంతి తర్వాత అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని తెలిపారు.అయితే నేరుగా రైతుల ఖాతాల్లో భరోసా నిధులు వేస్తామని వెల్లడించారు.మా నాయకురాలు సోనియా గాంధీ గ్యారంటీగా తాను మాటిస్తున్నాననంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఈ మేరకు రేషన్‌ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. మారీచుల మాయమాటలు నమ్మొద్దు అని అన్నారు. కాగా ‘రైతు భరోసాపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశామని తెలిపారు.అసెంబ్లీలో చర్చించి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తాం…రూ.2లక్షల రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో, రైతు భరోసా కూడా అదేవిధంగా అమలు చేస్తామని చెప్పారు. రూ.7లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్‌ తమకు ప్రభుత్వాన్ని అప్పగించారు.ప్రభుత్వం ఇంత అప్పుల్లో ఉందని కేసీఆర్‌,హరీశ్‌రావు, అధికారులు ఎవరూ చెప్పలేదని వ్యాఖ్యానించారు.

Read More

ఏపీలో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వివిధ కారణాలతో తెలుగుదేశం పార్టీని వీడిన బలమైన నాయకులను తిరిగి సొంత గూటికి తీసుకురావడానికి ఆ పార్టీ అధినేత,ఏపి సిఎం చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.గతంలో హైదరాబాద్ మేయర్ గా, ఎమ్మెల్యేగా పని చేసిన ఆ పార్టీ మాజీ నేత తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.ఈ నెల 3న ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు.అయితే తీగలను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి , బిఆర్ఎస్ నేత మల్లా రెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది.

Read More

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని ప్రతి నెలా మంగళవారం కల్పించేందుకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 3వ తేదీ మంగళవారం నుండి దర్శనం కల్పించనున్నారు. దీనికి సంబంధించి ఈనెల 2న తిరుపతి లోని మహాతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమల బాలాజీ నగర్ కమ్యునిటీ హాల్ లో 500 టోకెన్లు ఉదయం 3 నుండి 5 వరకు అందజేయనున్నారు. ముందుగా వెళ్లి టోకెన్లు తీసుకోవాలి. దర్శనం టికెట్ కోసం స్థానికులు ఒరిజినల్ ఆధార్ కార్డు చూపాలి. టోకెన్లు పొందిన భక్తులు దర్శనం సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని రావాలి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని దివ్య దర్శనం క్యూ లైన్ నుండి భక్తులకు దర్శనంకు అనుమతిస్తారు. దర్శనం అనంతరం ఒక లడ్డు ఉచితంగా అందిస్తారు. స్థానిక కోటాలో దర్శనం చేసుకున్న వారికి మరల 90 రోజుల వరకు దర్శనానికి అవకాశం…

Read More

ఫెంగల్‌ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి.ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన ప్రాంతాల్లో సైతం ఎటుచూసినా చెరువులు, నదుల్లా కనిపిస్తున్నాయి.చెన్నైలోని టి.నగర్‌ తదితర ప్రాంతాలు సైతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వ రవాణా స్తంభించింది.కొన్నిచోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాలు సైతం తిరగలేని పరిస్థితి నెలకొంది.3 రోజుల నుండి వణికిస్తున్న ఫెంగల్‌ తుఫాను తీరానికి సమీపించేకొద్దీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించడంతో తమిళనాడులోని 9 జిల్లాల్లో శుక్రవారం నుంచి విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.మరోవైపు,తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా తయారైంది.తీర ప్రాంతాల్లో 75-95 కి.మీ వేగంతో గాలులు వీయడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.కొన్ని చోట్ల సముద్రపు అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగసిపడ్డాయి.తిరుచ్చెందూర్‌లో సముద్రపు నీరు 80 అడుగుల మేర వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.చెన్నైలో విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు,ప్రైవేటు సంస్థలు కూడా మూతబడ్డాయి. సహాయ చర్యల కోసం…

Read More

గత ఏడాది నమోదైన దోపిడీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్ బల్యాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.వ్యాపారవేత్తల నుండి డబ్బులు ఎలా రాబట్టాలనే విషయంపై ప్రస్తుతం విదేశాల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ కపిల్ సంగ్వాన్‌తో బల్యాన్ చర్చలు జరిపినట్టుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్ ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ మేరకు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను నిన్న విచారణకు పిలిచిన ఆర్కేపురం క్రైంబ్రాంచ్ పోలీసులు అనంతరం అరెస్ట్ చేశారు.అయితే దోపిడీలకు పాల్పడుతున్న నరేశ్‌పై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీజేపీ నిలదీసిన అనంతరం ఈ ఘటన జరగడం విశేషం.బల్యాన్ అరెస్ట్‌ను ఆప్ తీవ్రంగా ఖండించింది.ఈ అరెస్ట్ అక్రమమని పేర్కొంది.ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Read More

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప ది రూల్‌’.రష్మిక కథానాయికగా నటించారు.డిసెంబర్‌ 5 ఈ చిత్రం విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్స్‌ భారీ స్థాయిలో నిర్వహిస్తోంది.ఇప్పటికే ముంబయి, చెన్నై, కొచ్చిన్‌లో ఈవెంట్స్‌ జరిగాయి.తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది.రేపు సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఈవెంట్‌ జరగనుంది.ఈ విషయాన్ని తెలియజేస్తూ…టీమ్‌ పోస్ట్‌ పెట్టింది.

Read More

ఫొటో క్రెడిట్‌ విషయంలో నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మధ్య ఎక్స్‌ వేదికగా తాజాగా వీరిద్దరి మధ్య ఓ సరదా సంభాషణ జరిగింది.రణ్‌వీర్‌ సింగ్‌తో దిగిన ఓ ఫొటోని తేజ షేర్‌ చేయగా.. ‘ఫొటో క్రెడిట్‌ లేదా పుష్పా’ అంటూ ప్రశాంత్‌ వర్మ పేర్కొన్నారు.అంతేకాకుండా ‘మనకు ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలని అని ఓ పెద్దాయన చెప్పారు’ అని పేర్కొన్నారు.ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ‘మనకు ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి. నిర్మాతలు ఇచ్చే పారితోషికమైనా తెరపై మన పేరైనా’ అని ఇటీవల పుష్ప 2 ఈవెంట్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలను ప్రశాంత్‌ వర్మ రిప్లైగా ఇవ్వడం వైరల్‌గా మారింది.

Read More

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ గా జై షా నేడు బాధ్యతలు స్వీకరించారు. భారత్ నుండి ఈపదవి స్వీకరించిన ఐదవ వ్యక్తి ఆయన. 36 సంవత్సరాల జై షా ఐసీసీ పగ్గాలందుకున్న అతి పిన్న వయస్కుడు. రెండు సంవత్సరాల పాటు జై షా ఈ పదవిలో కొనసాగుతారు. భారత్ నుండి ఇప్పటివరకు జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్.శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ లు ఐసీసీ ఛైర్మెన్లుగా పని చేశారు.

Read More

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. బియ్యం అక్రమ రవాణా గురించి వివరించారు. ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు, శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకు బియ్యం తరలించే పకడ్బందీ కుట్ర చేశారని మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఏ పోర్టులో లేని విధంగా కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతి జరిగింది.కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాల నుండి ఎగుమతి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులని తెలిపారు. ఒక్క కాకినాడలో జరిగిన దీని విలువ 48,537 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు ఇస్తే దాదాపు 6,300 కోట్ల రూపాయల బియ్యం లెక్కలు చూపించి ఇక్కడ నుండి తరలించేసారని ఆక్షేపించారు. ప్రభుత్వానికి ప్రతి కిలోకి 43.40 రూ ఖర్చయ్యే ఈ బియ్యాన్ని వీళ్ళు…

Read More