ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.ఏపీ లో తనపై నమోదు అయిన కేసు గురించి మాట్లాడారు.తాను ఎక్కడికి పారిపోలేదన్నారు.కొన్ని మీడియా తన గురించి తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. ‘ పోలీసులు నన్ను పట్టుకోవడం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు.నన్ను అరెస్టు చేస్తే జైలు లో కూర్చొని నాలుగు కథలు రాసుకుoటా.నేను ఎప్పుడో పెట్టిన పోస్టులకు ఏడాది తర్వాత ఎవరో స్పందించడం ఏంటి? నా అరెస్టు గురించి ఏ అధికారి చెప్పలేదు కదా? అలాంటప్పుడు నాపై ఎలా అలాంటి కథనాలు రాస్తారు? ప్రకాష్ రాజ్,నాగార్జున నన్ను దాచి పెట్టారని వార్తలు రాస్తున్నారు.నా గురించి కార్టూన్స్ వేస్తున్నారని వర్మ తెలిపారు.
Author: admin
అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తున్న రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతి. దీనిని ఉద్దేశించి తాజాగా అలనాటి నటి రేఖ ఆసక్తి కర కామెంట్స్ చేశారు. తాను ఈ షో చూస్తుంటానని చెప్పారు. బిగ్ బి ప్రతి డైలాగ్ తనకి గుర్తు ఉందని కపిల్ శర్మ షో లో చెప్పారు.అమితాబ్ షో గురించి రేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బి టౌన్ లో వైరల్ అయ్యాయి. కెరీర్ ఆరంభంలో రేఖ – అమితాబ్ ప్రేమించుకున్నారని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి.వీరిద్దరూ పెళ్లి చూసుకుందాం అనుకున్నారని టాక్.ఈ వార్తలపై అధికారికంగా వీళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు.అమితాబ్ అంటే తనకు చాలా ఇష్టం అని రేఖ చాలాసార్లు చెప్పారు.’నేను నటిగా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి పూర్తి కారణం అమితాబ్.ఆయన నుంచే నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా.ఆయన చాలా గొప్ప వ్యక్తి ‘ అని రేఖ గతంలో చెప్పారు.
అండర్-19 ఆసియా కప్ లో భారత్ భారీ విజయం సాధించింది. జపాన్ తో జరిగిన మ్యాచ్ లో 211 పరుగుల తేడాతో గెలిచి బోణీ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ అమన్ (122 నాటౌట్, 118 బంతుల్లో 7×4) శతకంతో సత్తా చాటాడు. ఓపెనర్ ఆయుష్ మాత్రే 54(29;6×4, 4×6) విధ్వంసం సృష్టించాడు. కార్తీకేయ 57(50;5×4,1×6) మంచి ప్రదర్శన కనబరిచాడు. వైభవ్ సూర్య వంశీ 23(23;3×4,1×6), హార్థిక్ రాజ్ 25(12;1×4, 2×6) బ్యాట్ ఝళిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో జపాన్ 128/8 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ కెల్లీ (50) టాప్ స్కోరర్. ఛార్లెస్ హింజ్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో హార్థిక్ రాజ్, కార్తీకేయ, చేతన్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా...యుధజిత్ ఒక వికెట్ పడగొట్టారు.…
దేశ రాజధాని ఢిల్లీ లో గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 నిబంధనలు అవలంబిస్తున్న విషయం తెలిసింది.అయితే వీటిని సడలించడం పై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది.ఆ నియమాలు సదలించడానికి అంగీకరించలేదు.కాలుష్యం తగ్గే వరకు వాటిని పాటించాలని తెలిపింది.వీటి కారణంగా ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులకు ఏదైనా పరిహారం అందించారా? లేదా? అనే వివరాలను వెల్లడించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 5వ తేదిన ఆయా అధికారులు అందుబాటులోకి రావాలని తెలిపింది.
బెయిల్ పై బయటకు వచ్చిన మర్నాడే డీఎంకే నేత సెంథిల్ బాలాజీ మంత్రిగా పదవి అందుకోవడం పై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.అసలు అక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నించింది.”బెయిల్ మంజూరు విషయంలో మేము సరైన నిర్ణయమే తీసుకున్నాం.అతడి బెయిల్ రద్దు చేయడం గురించి విచారణ జరిపేది లేదు.కానీ,సాక్షులు ప్రభావితం అవుతారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం.దీనిపై విచారణ జరుపుతాం” అని సుప్రీం స్పష్టం చేసింది.మనీ లాండరింగ్ కేసు లో సెంథిల్ బాలాజీ గతంలో అరెస్టు అయ్యారు. బెయిల్ పై బయటకి వచ్చిన ఆయన ఆ మరుసటి రోజే మంత్రిగా పదవి స్వీకరించారు.మంత్రి పదవి వల్ల సాక్షులపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని..బెయిల్ మంజూరు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పిటిషన్‌లో కోరుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది.దీనిపై కోర్టు విచారించింది.బెయిల్ పొందిన వెంటనే వి.సెంథిల్ బాలాజీకి తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.సాక్షులపై కొంత ఒత్తిడి వచ్చే…
నటి శోభిత ధూళిపాళ్ల అతి త్వరలో సింగిల్ లైఫ్ కి బై బై చెప్పేయనున్నారు.మరో రెండు రోజుల్లో ఆమె పెళ్లి జరగనుంది.ఈ నెల 4న నాగ చైతన్య తో ఆమె ఏడడుగులు వేయనున్నారు.తాజాగా ఆమె పెళ్లి కూతురిగా రెడీ అయ్యారు.ఎరుపు రంగు చీరలో ధరించి సిగ్గులోలికించారు.పెళ్ళికూతురు వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేశారు.ప్రస్తుతం అవి వైరల్ అయ్యాయి.అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతన్య – శోభిత పెళ్లి జరగనుంది.
ఇటీవలే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి పలు అంశాలపై చర్చించేందుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి.ఇక అధికార ప్రతిపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ప్రధానంగా రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 13, 14వ తేదీలలో లోక్ సభలో, 16, 17వ తేదీలలో రాజ్యసభలోనూ చర్చించేందుకు నిర్ణయించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రెండు సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 445 పాయింట్ల లాభంతో 80,248 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 142 పాయింట్ల లాభంతో 24,274 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.69గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో తాజాగా జీడీపీ వృద్ధి తగ్గుదల ప్రభావం మార్కెట్లపై పడింది. దీంతో నష్టాలతో ట్రేడింగ్ ఆరంభించిన సూచీలు మధ్యాహ్నం తరువాత నుండి పుంజుకుని లాభాల బాటలో పయనించాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, అల్ట్రా టెక్ సిమెంట్స్ , టైటాన్, జే.ఎస్.డబ్ల్యూ, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలతో ట్రేడింగ్ ముగించాయి.
నటుడు మోహన్ బాబు మనవరాళ్లు, విష్ణు కుమార్తెలు అరియనా, వివియానా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కన్నప్ప సినిమాలో వీరిద్దరూ నటిస్తున్నారు. ఈరోజు వాళ్ళ పుట్టిన రోజును పురస్కరించుకొని పోస్టర్ విడుదల చేశారు. మనవరాళ్లు ఎంట్రీ పై మోహన్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. నటన పై వాళ్లకు ఉన్న అభిరుచి చూసి తాను ఎంతో సంతోషించానన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25 న ఈ సినిమా విడుదల కానుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప సిద్ధమవుతోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. My heart swells with pride as I share #Ariaana & #Viviana in #Kannappa🏹. I can't wait for everyone to witness the magic, my little mommies create on the screen! ❤️ Happy Birthday Ari…
గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’. తాజాగా ఈ చిత్రాన్ని ప్రధాని మోడీ వీక్షించారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఈ చిత్రాన్ని చూశారు. 2002లో గుజరాత్‌లో గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆధారంగా చేసుకొని బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ తెరకెక్కించారు. విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలకపాత్ర పోషించారు. నవంబర్ 15న ఇది విడుదలైంది.