స్టైల్ స్టార్ల్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘పుష్ప ది రూల్’.ఈ చిత్రంలో రష్మిక కథానాయిక నటిస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ చిత్రం నుండి ‘పీలింగ్స్’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది.అన్ని భాషల్లోనూ ఈ పాట పల్లవి లిరిక్స్ మలయాళంలోనే ఉండనున్నాయి.అల్లు అర్జున్, రష్మిక స్టెప్పులు అదరగొట్టేశారు.దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు.శేఖర్ మాస్టర్ స్టెప్పులు కొరియోగ్రఫీ చేశారు. https://youtu.be/8RAd-_Qj_ac?si=twyXH4j3WUNRrbqg
Author: admin
భారత జీడీపీ వృద్ధి రేటు గత రెండేళ్ల కనిష్టానికి పడిపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి నూతన ఆలోచనలు, నూతన వ్యాపార ఒప్పందాలు ఆవశ్యకమని అన్నారు. కేవలం కొందరు బిలియనీర్లు మాత్రమే ఆర్థిక ప్రయోజనాలు పొందుతాన్నారని దీంతో ప్రగతి సాధ్యం కాదని అన్నారు. అందరికీ సమానంగా ముందుకు వెళ్లే అవకాశం లభిస్తేనే, మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. భారత దేశ జీడీపీ వృద్ధి రేటు రెండు సంవత్సరాల్లో అత్యంత తక్కువ స్థాయికి, 5.4% కి చేరుకుంది. రైతులు, కూలీలు, మధ్యతరగతి మరియు పేదలు అనేక ఆర్థిక సమస్యలతో పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. రాహుల్ ప్రస్తావించిన అంశాలు: రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయికి 6.21% కి చేరుకుంది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ సంవత్సరం బంగాళాదుంపలు…
‘ 12th ఫెయిల్ ‘ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విక్రాంత్ మస్సే.తాజాగా ఆయన నటనకు రిటైర్మెంట్ ప్రకటించారు.ఫ్యామిలీ తో సమయం గడపాలను కుంటున్నానని…అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.ఇంతకాలం తనకు సపోర్ట్ చేసిన సినీ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.17 ఏళ్ల వయసుకే విక్రాంత్ ఇండస్ర్టీలోకి అడుగు పెట్టారు.సీరియల్స్ తో నటుడిగా తెరంగేట్రం చేశారు.ఆ సమయంలో తాను 110 గంటల పాటు పని చేసిన సందర్భాలు ఉన్నాయని గతంలో ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.లూటేరా (2013), దిల్ ధడక్నే దో (2015), హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ (2017)లలో సహాయక పాత్రలు పోషించారు.హసీనా దిల్ రుబా, ఫిర్ ఆయి హసీనా దిల్ రూబా, సెక్టర్ 36 వంటి చిత్రాల్లో ఆయన యాక్టింగ్ అందరికీ నచ్చింది.
రేషన్ కార్డులలో మార్పులు చేర్పులతో పాటు కొత్తగా రేషన్ కార్డులు తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నేటి నుండి ఈనెల 28వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారికి సంక్రాంతి నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. గత రేషన్ కార్డులపై అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన రంగులు, మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్నాయి. దీంతో పాత రేషన్ కార్డులలో మార్పులు చేపట్టనుంది.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడ్ న్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.అక్రమ ఆయుధం కొనుగోలు కేసులో ఆ తనయుడు హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించారు.హంటర్ నిందితుడిగా తెలిన సమయంలో క్షమాభిక్ష పెట్టానని చెప్పిన ఆయన తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం అంతట చర్చకు దారి తీసింది.త్వరలో పదవి నుంచి దిగిపోతున్న సమయంలో ఆయన ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.’ ఒక తండ్రిగా తాను ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ‘ అని ఆయన పేర్కొన్నారు.
భువనేశ్వర్ లోని లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన డీజీపీలు, ఐజీపీల మూడు రోజుల సదస్సులో ప్రధాని మోడీ ఆఖరి రోజు పాల్గని మాట్లాడారు. 59వదైన ఈ సదస్సులో దేశ భద్రతకు సంబంధించిన పలు అంశాలపై కీలక మేధో మథనం జరిగింది. మావోయిస్టుల నియంత్రణ, ఉగ్రవాదం కట్టడి, సైబర్ నేరాల నిరోధం,మహిళలపై జరుగుతున్న దాడులు, జల మార్గాలలో పటిష్ట బందోబస్తు వంటి వాటిపై తీర్మానాలు జరిగాయి. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, ఏఐ టెక్నాలజీపై జరుగుతున్న అక్రమాలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ వంటి వాటితో జరుగుతున్న నష్టాలను ప్రస్తావించారు. వీటిని కట్టడి చేసే చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. స్మార్ట్ పోలీసింగ్ ను అమలు చేయాలని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.
తెలుగు చెస్ క్రీడాకారుడు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశీ 2800 ఎలో రేటింగ్ ను అందుకుని చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున దిగ్గజ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే ఇప్పటి వరకు ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు అర్జున్ ఈ అరుదైన ఘనత సాధించాడు. తాజా ఫిడే ర్యాంకింగ్స్ లో ఈ 21 సంవత్సరాల యువ కెరటం 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. చదరంగం చరిత్రలోనే 2800 ఎలో రేటింగ్ అందుకున్న 16వ ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం 2801 రేటింగ్ తో ఉన్నాడు. వరంగల్ కు చెందిన ఈ తెలుగు కుర్రాడు 14 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించాడు. ఇటీవల జరిగిన చెస్ ఒలింపియాడ్ లో టైటిల్ మరియు వ్యక్తిగత పసిడిని గెలుపొందాడు.
వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమితో తాము పొత్తుకు సిద్ధంగా లేమని వెల్లడించింది.ఒంటరిగానే పోటీ చేస్తామని పేర్కొంది.ఈ మేరకు ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తులకు దూరంగా ఉంటుందని,ఒంటరి పోరుకు సిద్ధమైనట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ చేసిన ప్రకటన వల్ల ఇండియా కూటమికి గట్టి షాక్ తగిలింది.అయితే ఈ సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిరాకరించిన విషయ తెలిసిందే.13 స్థానాల్లో ఒంటరిగా పోటీలోకి దిగింది.అయితే ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా పోటీ చేస్తామని కాంగ్రెస్ కూడా ప్రకటన చేసింది.ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాము ఒంటరిగా వెళ్తామని చెప్పింది.
సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో భారత్ మూడు టైటిల్స్ గెలుచి. సత్తా చాటింది. మహిళల డబుల్స్ లో గాయత్రి-ట్రీసా ద్వయం చైనాకు చెందిన బావో లి జింగ్-లీ కియాన్ జోడీ పై 21-18, 21-11తో విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. ఈ టోర్నీలో టైటిల్ గెలిచిన భారత మొదటి డబుల్స్ జోడీ కావడం గమనార్హం. మరోవైపు మహిళల సింగిల్స్ లో స్టార్ షట్లర్ పి.వి.సింధు చైనా క్రీడాకారిణి యూ పై 21-14, 21-16తో నెగ్గింది. దీంతో మూడోసారి టైటిల్ విజేతగా నిలిచింది. ఇదివరకు 2017, 2022లో టైటిల్ గెలిచింది. ఇక పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ సింగపూర్ ఆటగాడు జియా హెంగ్ జేసన్ పై 21-6, 21-7తో గెలిచి టైటిల్ విజేతగా నిలిచాడు. దీంతో మొత్తంగా భారత్ మూడు టైటిల్స్ తో అదరగొట్టింది.
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి.ప్రధాని పదవి నుండి షేక్ హసీనా బలవంతంగా తప్పుకోవాల్సి రావడం, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడం,ఇటీవల హిందువులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్ విశాఖలోనూ వినిపించాయి.అయితే ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద జనజాగరణ్ సమితి, హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. అయితే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ…నినాదాలు చేశారు.ఆంధ్ర యూనివర్సిటీలో హాస్టల్లో బంగ్లాదేశీ విద్యార్థులు వారి స్వదేశానికి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు.ఈ మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.