Author: admin

ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ పరుగుల వేటలో దూసుకెళుతున్నారు. తాజాగా నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ ను దాటాడు. 1625 పరుగులతో సచిన్ ఉండగా 1630 పరుగులతో రూట్ దానిని అధిగమించాడు. క్రైస్ట్ చర్చ్ లోని హాగ్లే ఓవల్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జో రూట్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి ఈ అరుదైన ఘనత సాధించాడు. జో రూట్ కు ఇది 150వ టెస్టు. ఇక ఈ జాబితాలో అలిస్టర్ కుక్(1611), గ్రేమ్ స్మిత్ (1611), శివనరైన్ చంద్ర పాల్ (1580) టాప్-5 లో ఉన్నారు.

Read More

తాజాగా ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ నుండి ముఖ్యమంత్రి ఉంటారని,ఇతర మిత్రపక్షాలైన ఏక్నాథ్ షిండే శివసేనకిఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కుతాయని అన్నారు.ఢిల్లీ జరిగిన సమావేశంలో మహాయుతి బిజెపి నుండి ముఖ్యమంత్రితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని,మిగిలిన రెండు పార్టీలకు ఉప ముఖ్యమంత్రులు ఉండాలని నిర్ణయించామని చెప్పారు.ఇలా ఆలస్యం జరగడం ఇది తొలిసారి కాదు.ఇంతకుముందు 1999లో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక నెల సమయం పట్టిందని ఆయన గుర్తు చేశారు.

Read More

జమ్మూ- కాశ్మీర్ కుల్గామ్ జిల్లాలో నిన్న రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.వారిద్దరినీ విచారిస్తున్నారని సమాచారం.ఈ మేరకు దిగువ ముండాలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానంగా అటుగా వెళ్తుండటంతో…అనుమానం వచ్చి వారిని ఆగమని భద్రతా బలగాలు చెప్పారు. అయితే ఆ ఇద్దరు ఉగ్రవాదులు పారిపోయే ప్రయత్నం చేశారు.దీనితో భద్రతా బలగాలు వెంటనే వారిని పట్టుకుని విచారించారు.విచారణలో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులని తేలింది.వారి నుండి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.అయితే వీరు ఏదైనా నేరం చేయబోతున్నారా అనే విషయంపై విచారణలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read More

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు & రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ )కి మరోసారి ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు దక్కింది.2024 సంవత్సరం గాను జాతీయ స్థాయి అవార్డు స్కోచ్‌కు ఏపీఎస్-ఆర్టీసీ ఎంపిక అయినట్లు సంస్థ ఈడీ ప్రకటించారు.తమ సంస్థకు అవార్డు రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ,డిజిటల్ టికెట్లు జారీ చేయడం, సంస్థ అన్ని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్టీసి ఈ అవార్డుకు ఎంపికైనట్లు వెల్లడించారు.ఈ మేరకు నిన్న ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తరపున సంస్థ చీఫ్ ఇంజనీర్ (ఐటీ) వై. శ్రీనివాసరావు అవార్డును అందుకున్నారు.ఇంతకుముందు ఒకసారి ఏపీఎస్ ఆర్టీసీ ఈ స్కోచ్ అవార్డును కైవశం చేసుకుంది.

Read More

ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గతంలో వైసిపి ప్రభుత్వం నియమించిన వక్ఫ్ బోర్డును రద్దు చేసింది. ఈ మేరకు నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త ప్రభుత్వ హయాంలో జారీ కాబడిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో -47 ను ఉపసంహరిస్తూ…ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఈ విషయాన్ని తెలియజేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ జీవో-75 జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్ 21న అప్పటి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నామినేట్ చేయబడ్డ సభ్యుల నియామకాల తీరుపై కొందరు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేస్తూ…హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ…

Read More

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అద్భుతమైన గెలుపును సాధించి 2వ సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తన యంత్రాంగంలో భారతీయులకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పలు భారత సంతతి వ్యక్తులను ముఖ్యమైన పదవుల్లో నియమించిన ఆయన తాజాగా…అత్యంత కీలకమైన ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) డైరెక్టర్‌గా ఇండో-అమెరికన్ అయిన కాష్ పటేల్‌ ను నామినేట్ చేశారు. అయితే ట్రంప్‌కు అత్యంత విధేయుడిగా కాష్‌ను చెప్పుకుంటారు.ఈస్ట్ ఆఫ్రికా నుండి వచ్చి న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో స్థిరపడిన గుజరాతీ మూలాలున్న కుటుంబంలో కాష్ పటేల్ జన్మించారు.ఆయన లా పూర్తి చేసిన తర్వాత ఫ్లోరిడాలో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు.ఆ తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లో న్యాయవాదిగా చేరారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో సివిల్ లాయర్‌గా చేరిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది.కాష్ తెలివైన లాయర్,పరిశోధకుడని ట్రంప్ ప్రశంసించారు.అమెరికాలో అవినీతిని బహిర్గతం చేయడం, న్యాయాన్ని, అమెరికన్లను రక్షించేందుకు ఆయన తన కెరియర్‌ను అంకితం…

Read More

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో ఐదో గేమ్ కూడా మరో డ్రాగా ముగిసింది. భారత యువ ఆటగాడు గుకేశ్ డిఫెండింగ్ చాంపియన్ చైనా క్రీడాకారుడు డింగ్ లిరెన్ లీ మధ్య జరిగిన ఐదో గేమ్ ఫలితం తేలకుండా పూర్తయింది. ఈ గేమ్ లో కూడా భారత సంచలనం గుకేశ్ దూకుడుగా ఎత్తులు వేస్తూ లీరెన్ తో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఈ గేమ్ లో ఇద్దరు ఆటగాళ్లు 40 ఎత్తుల తరువాత పాయింట్లు పంచుకున్నారు. ఇక ఈ ఛాంపియన్ షిప్ లో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి చెరొక విజయంతో 2.5-2.5 పాయింట్లతో సమానంగా ఉన్నారు. ఇంకా 9 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ముందు 7.5 పాయింట్లు గెలిచిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు.

Read More

నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు ఎన్టీఆర్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ పతకంపై వైవీఎస్ చౌదరి సతీమణి గీత నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఇంట్రడక్షన్ వీడియో విడుదల చేయగా మంచి ఆదరణ లభించింది.ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించగా.. చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు.ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి, కూచిపూడి నర్తకి, వీణ రావు కథానాయికగా నటిస్తుంది.ఈ మేరకు వీణ రావు పరిచయ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. అచ్చ తెలుగు అందాలరాశి మరియు కూచిపూడి నర్తకి✨️❤️Here's Magnificent and Beautiful First Darshan of @NewTalentRoars Production No. 1 heroine, @veenahrao 😍She is ready to enchant everyone❤️‍🔥▶️https://t.co/gbCGEYITRMDynamic director @helloyvs will present her in stunning… pic.twitter.com/daCnbwzD15— YouWe Media (@MediaYouwe) November…

Read More

2025 ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి హైబ్రిడ్ మోడల్ కు ఆతిథ్యం ఇవ్వనున్న పాక్ అంగీకారం తెలిపింది. అయితే దీనికి ఒక మెలిక పెట్టింది. భారత్ పాక్ కు వెళ్లడం నిరాకరించిన నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ ఒకటే పరిష్కారమని ఐసీసీ పేర్కొనగా… దీనిపై పాక్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. హైబ్రిడ్ మోడల్ కు సరే నని కానీ భవిష్యత్తులో తమ జట్టు కూడా ఐసీసీ టోర్నీలలో భారత్ కు వెళ్లకూడదని నిర్ణయిస్తే తమకు ఇదే విధంగా హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ లు ఏర్పాటు చేయాలని కోరింది. రెండు జట్లకు సమానంగా ఏ నిర్ణయం మైన ఉండాలని కోరింది. పాకిస్థాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కాగా, భధ్రతా కారణాలు రీత్యా బీసీసీఐ భారత జట్టును అక్కడికి పంపేందుకు నిరాకరించింది. భారత్ ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించే విధంగా ఐసీసీ, బీసీసీఐ ప్రతిపాదించగా.. పాకిస్థాన్…

Read More

రాజస్థాన్లో జరిగిన 51వ జెమ్ అండ్ జ్యూయలరీ అవార్డు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…తాము నిజాయితీగానే ఉన్నామని..నిబద్ధతతోనే వ్యాపారం చేస్తున్నామని గౌతమ్ అదానీ అన్నారు.అమెరికాలో తన కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద గౌతమ్ అదానీ తొలిసారిగా స్పందించారు.ఇటువంటి సవాళ్ళను ఎదుర్కోవడం ఇదేం కొత్త కాదని..మా మీద దాడి జరిగిన ప్రతీసారి మేము మరింత బలంగా వస్తామని ఆయన అన్నారు.ప్రతీ దాడి మమ్మల్ని మరింత బలపరుస్తుంది.ప్రతీ అవరోధం అదానీ గ్రూప్‌ను మరింత ధృఢంగా ఎదుర్కొని…ఎక్కువగా ఎదిగేందుకు తోడ్పడుతుందని అదానీ వ్యాఖ్యానించారు.

Read More