విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (ఎస్.సీ.ఆర్.) హెడ్ క్వార్టర్స్ నిర్మాణాలు వేగవంతం చేస్తున్న సందర్భంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ‘ఎక్స్’ లో లోకేష్ పోస్ట్ చేశారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కల చివరికి నిజమవుతోందని లోకేష్ పేర్కొన్నారు. Heartfelt thanks to Hon'ble PM Sri @narendramodi Ji and Minister for Railways Sri @AshwiniVaishnaw Ji for expediting the construction of the South Coast Railway (SCoR) zone headquarters in Visakhapatnam. This long-awaited dream is finally becoming a reality. pic.twitter.com/O9IEZLXHaA— Lokesh Nara (@naralokesh) November 25, 2024
Author: admin
నరసాపురం మాజీ లోకసభ సభ్యుడు,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న ఆయన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం విజయ్‌పాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే సీబీఐ కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలంటూ…రఘురామకృష్ణంరాజు ఇటీవల గుంటూరులో ఫిర్యాదు చేశారు.ఈ కేసులో మాజీ సీఎం జగన్,అప్పటి సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని నగరపాలెం పోలీసులు నిందితులుగా చేర్చారు.ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం గత నెలలో హైకోర్టును ఆశ్రయించగా విజయ్‌పాల్‌కు అక్కడ షాక్ తగిలింది.బెయిలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తాజాగా తనపై నమోదైన కేసును కొట్టవేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నఎదురుదెబ్బ తగిలింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోర్ 12-3తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ భారత బౌలర్ల ధాటికి పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేయగా.. ఆసీస్ 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 7 వికెట్లు కోల్పోయి 486 పరుగులు చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని 534 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు భారత బౌలింగ్ ముందు నిలువలేక పోయారు. లక్ష్య ఛేదనలో 238 పరుగులకు ఆలౌటయింది. టాప్ ఆర్డర్ ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. నాథన్ (0), పాట్ కమ్మిన్స్ (2), లబుషేన్ (3), ఉస్మాన్ ఖవాజా (4), ట్రావిస్ హెడ్ (89), మార్ష్ (47)లు కొద్దిసేపు నిలకడగా ఆడారు.…
ఈరోజు నుండి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ సమావేశాల ప్రారంభానికి ముందు విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ముప్పేట దాడి చేశారు.ప్రజలు పదే పదే తిరస్కరించినవారు పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నారంటూ ఘాటైన విమర్శలు చేశారు.కొందరు వ్యక్తులు చేతికింద మనుషులను పెట్టుకొని గూండాయిజం ద్వారా పార్లమెంటును నియంత్రించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.వారి చర్యలన్నింటినీ దేశ ప్రజలు గమనిస్తున్నారని,సమయం వచ్చినప్పుడు వారిని మళ్లీ శిక్షిస్తారని అన్నారు. ఈ మేరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ…సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన రెండు రోజుల తర్వాత ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రజలు దాదాపు 80-90 సార్లు తిరస్కరించిన వారు పార్లమెంటులో చర్చలు జరగనివ్వడం లేదు అని అన్నారు. మన రాజ్యాంగంలో పార్లమెంటు, మన ఎంపీలు ఎంతో ముఖ్యం…పార్లమెంటులో…
సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’. నటుడు నరేశ్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ దీనిని తెరకెక్కించారు.దిల్‌రాజు ప్రొడక్షన్స్ నిర్మించింది.తాజాగా ఇది ఫిలింఫేర్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్‌కు ఇది ఎంపికైంది.ఈ విషయాన్ని తెలియజేస్తూ సాయి ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టారు.తమ చిత్రానికి ఓటు వేయమని కోరారు.దీనికి సంబంధించిన వివరాలు షేర్ చేశారు.
తన పెళ్లి గురించి కీలక విషయాలు తెలియజేశారు నటుడు నాగచైతన్య.అన్నపూర్ణ స్టూడియోస్‌లోని తన తాతయ్య విగ్రహం ఎదురుగా ఈ పెళ్లి వేడుక జరగనుందని చెప్పారు.ఆయన ఆశీస్సులు తమపై ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతోనే కుటుంబసభ్యులు ఇలా ప్లాన్ చేశారన్నారు.తనకు కాబోయే సతీమణి శోభితా ధూళిపాళ్లతో జీవితాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు.శోభిత – చైతన్య ఎంతోకాలం నుంచి స్నేహితులు.పెద్దల అంగీకారంతో డిసెంబర్ 4న వీరి పెళ్లి జరగనుంది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఈ నెల 26న మాత్రం ఉభయసభలకు సెలవు ఉంటుంది. ఇక సమావేశాల నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం వల్లే దేశంలో సామాజిక, ఆర్థిక మార్పులు తీసుకురాగలిగామని అణగారిన వర్గాలకు సమున్నత స్థానం కల్పించామని పేర్కొన్నారు. ఎటువంటి వివక్ష లేకుండా అన్నివర్గాల ప్రజలు సమాన ఓటు హక్కు వినియోగించుకోవడానికి కారణం రాజ్యాంగమేనని అన్నారు. రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు. మన ఆలోచనలో ఉన్నత ప్రమాణాలు ఉన్నప్పుడే ప్రభుత్వ సంస్థలను గౌరవించగలమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈనెల 26న పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగే ‘రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభల సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారని, రాజ్యాంగ పీఠికను చదువుతారని…
2025 జనవరి 11-12 తేదీల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో యువ ఆలోచనల ‘మహాకుంభ్’ని నిర్వహించనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. దీనిని వికసిత భారత్ యువ నేతల సమ్మేళనంగా పిలుస్తామని వెల్లడించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని నిస్వార్థ యువతని రాజకీయాల్లోకి తీసుకు వచ్చి దేశ భవిష్యత్తును వారి చేతుల్లో పెట్టే లక్ష్యంతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాల నుండి ఎంపిక చేసిన సుమారు రెండు వేల మంది యువతీయువకులు దీనికి హాజరవుతారని, కోట్ల మంది యువత పరోక్షంగా పాల్గొంటారని చెప్పారు. తాజాగా జరిగిన’మన్ కీ బాత్’ ద్వారా ఆయన ప్రజలనుద్దేశించి రేడియోలో ప్రసంగించారు. ఎర్రకోట బురుజులపై తాను పిలుపునిచ్చిన రీతిలో లక్షమంది యువతను రాజకీయాల్లోకి రప్పించేందుకు అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగా ఈయువనేతల సదస్సు ఒకటని వివరించారు. దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు దీనిలో పాల్గొంటారని, తాను కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని…
తనదైన ప్రత్యేక గాత్రం, శైలితో అనతికాలంలోనే తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు గాయని మంగ్లీ. ప్రస్తుతం ప్రేక్షకుల హృదయాలను రంజింపజేస్తూ ముందుకు సాగుతున్న ఆమె తాజాగా ఒక పురస్కారం సొంతం చేసుకున్నారు. సంగీత ప్రపంచానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఇటీవల సంగీత నాటక అకాడమి నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి ఆమె ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అతిరథ మహారధుల సమక్షంలో ఆమె అందుకున్నారు. జార్జి రెడ్డి సినిమాలోని రాయల్ ఎన్ఫీల్డ్, అల వైకుంఠపురం చిత్రంలో రాములో రాములా, లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియాతో సహా ఆమె ఆలపించిన అనేక పాటలకు మంచి స్పందన లభించింది.
భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోరుకు సన్నద్ధమయ్యాడు. తన అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటూ అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగిన ఈ 28 సంవత్సరాల యువ కెరటంపై చెస్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.సింగపూర్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) తో అతడు ప్రపంచ టైటిల్ కోసం తలపడతాడు. 14 గేమ్ ల పోరులో భాగంగా నేడే మొదటి గేమ్. ప్రపంచ చెస్ టైటిల్ కోసం ఇద్దరు ఆసియా ఆటగాళ్లు తలపడడం 138 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ప్రపంచ టైటిల్ మ్యాచ్లో 14 రౌండ్లు ఉంటాయి. సుదీర్ఘంగా సాగే ప్రపంచ సమరంలో గుకేశ్ ఒత్తిడిని ఎలా తట్టుకుంటాడన్నదే ఆసక్తికరం.
