Author: admin

గోవాలో జరుగుతోన్న ‘ఇఫ్ఫీ’ వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.ఒక వృద్ధుడు తేజ సజ్జా కాళ్లు పట్టుకోబోయాడు.అసలేం జరిగిందంటే…ఇఫ్ఫీ వేడుకల్లో భాగంగా హను-మాన్‌ చిత్రాన్ని ప్రదర్శించారు.స్క్రీనింగ్‌ అనంతరం తేజ స్టేజ్‌ మీదకు రాగా…అక్కడే ఉన్న ఒక వృద్ధుడు అతడి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించాడు.వెంటనే తేజ స్పందించి నమస్కారం చేశాడు.చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ వల్ల ఈ సినిమా ఇంత గొప్పగా రూపుదిద్దుకుందని చెప్పారు.సినిమాపై ప్రేక్షకులు చూపిస్తో్న్న ఆదరణకు ధన్యవాదాలు చెప్పారు.

Read More

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఇంట్లో పనిచేసే దివ్య అనే అమ్మాయికి గవర్నమెంట్‌ ఉద్యోగం లభించింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ… దర్శకుడు సుకుమార్‌ భార్య తభిత పోస్ట్‌ పెట్టారు. ఆమెకు అభినందనలు తెలిపారు.ఆమె ఉన్నత శిఖరాలు అందుకోవాలని అన్నారు.దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.కృషి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏదైనా సాధించగలం అని పేర్కొన్నారు.మరోవైపు,పుష్ప ది రూల్‌ పనుల్లో సుకుమార్‌ బిజీగా పాల్గొంటున్నారు.

Read More

విడాకుల నేపథ్యంలో రెహమాన్‌పై వస్తోన్న విమర్శల గురించి ఆయన సతీమణి సైరా బాను స్పందించారు.ఆయన అద్భుతమైన వ్యక్తి అని అన్నారు.తప్పుడు ప్రచారాలతో ఆయన పరువు మర్యాదలకు భంగం కలిగించవద్దని రిక్వెస్ట్‌ చేశారు.తనకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని…ట్రీట్‌ మెంట్‌ కోసం ముంబయి వెళ్లాలని చెప్పారు.ఆరోగ్య సమస్యల వల్లే ఆయనతో కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

Read More

ఎన్‌సీసీ డే పురస్కరించుకొని మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.తాను క్యాడెట్‌గా ఉన్న రోజులను గుర్తుచేసుకున్నారు.‘‘ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎన్‌సీసీ పేరు వినగానే మనందరికీ మన కాలేజీ,అలనాటి జ్ఞాపకాలు గుర్తువస్తాయి.నేను కూడా ఎన్‌సీసీ క్యాడెట్‌నే. ఆ సమయంలో నేను పొందిన అనుభవం నాకెంతో అమూల్యమైంది.పూర్తి విశ్వాసంతో ఈ మాట మీకు చెబుతున్నాను.యువతలో క్రమశిక్షణ, సేవా గుణాన్ని, నాయకత్వ లక్షణాలను మరింత పెంపొందించడంలో దీని పాత్ర కీలకం’’ అని తెలిపారు.

Read More

అత్యంత వినోదాత్మక క్రికెట్ టోర్నీ ఐపీఎల్ కు వేలం ప్రారంభమైంది. కాగా, భారత యువ ఆటగాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు దక్కించుకుంది. రూ.26, 75 కోట్లకు పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్ ను కైవసం చేసుకుంది.కనీస ధర రూ.2 కోట్లు ఉన్న భారత పేసర్ అర్షదీప్ సింగ్ ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఐపీఎల్ మెగా వేలంలో ఇప్పటివరకు అమ్ముడైన ఇతర స్టార్ ఆటగాళ్ల వివరాలు పంజాబ్ కింగ్స్:యజువేంద్ర చహల్-రూ.18 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్:మిచెల్ స్టార్క్- రూ.11.75 కోట్లు గుజరాత్ టైటాన్స్:జోస్ బట్లర్- రూ.15.75 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్:కేఎల్ రాహుల్- రూ.14 కోట్లు గుజరాత్ టైటాన్స్:మహ్మద్ సిరాజ్- రూ.12.25 కోట్లు, కగిసో రబాడా- రూ.10.75 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్:డేవిడ్ మిల్లర్- రూ.7.50 కోట్లు ఆర్సీబీ:లియామ్ లివింగ్ స్టన్- రూ.8.75…

Read More

కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందనిఅమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా వసతి దీవెన డబ్బులు విడుదలచేయాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. పలు అంశాలపై ప్రభుత్వ తీరును ఎండగడుతూ ట్వీట్ చేశారు. దీనికి ఏపీ మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు.చిన్న పిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన తాను సుద్దపూసని అనడం విచిత్రంగా ఉంది అంటూ జగన్ కు చురకలంటించారు. గుడ్లు, చిక్కీలు మొదలుకొని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకూ మీరు నా నెత్తిన పెట్టి పోయిన బకాయిలు అక్షరాలా రూ. 6,500 కోట్లు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలన జగన్ ది అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్ బాల్ ఆడుకుంది మీరే అంటూ లోకేష్ జగన్ పై మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లింది విద్యాదీవెన,…

Read More

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. మూడోరోజు 487-6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 172-0తో మూడోరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ యశస్వీ జైశ్వాల్ 161 (297; 15×4, 3×6) శతకంతో సత్తా చాటాడు. ఆసీస్ తో ఆడిన మొదటి మ్యాచ్ లోనే ఈ ఘనత సాధించాడు. కే.ఎల్.రాహుల్ 77 (176; 5×4)లతో రాణించాడు. దేవ్ దత్ పడిక్కల్ 25 (71; 2×4) , వాషింగ్టన్ సుందర్ 29(94;1×4) కొద్దిసేపు నిలకడగా ఆడారు. పంత్ (1), ధృవ్ జురేల్ (1) విఫలమయ్యారు. ఇక సీనియర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 100 నాటౌట్ (143; 8×4, 2×6) లతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నితీష్ రెడ్డి 38 నాటౌట్ (27; 3×4, 2×6) బ్యాట్ ఝళిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.…

Read More

కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. చంద్రబాబు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం తనకు ఆవేదన కలిగించిందన్నారు. చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోందని ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారని ఆరోపించారు. వసతిదీవెన, విద్యాదీవెన నిలిపేసి, డిగ్రీ, ఇంజినీరింగ్‌, డాక్టర్‌ చదువులు చదువుతున్నవారినీ తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారని దుయ్యబట్టారు. వైయస్సార్‌సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాలో జమచేసే వాళ్లం. ఇలా గత విద్యాసంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికం వరకూ రూ. 12,609 కోట్లు ఒక్క విద్యాదీవెనకే ఖర్చు చేశాం. తలరాతలను మార్చేది చదువులు మాత్రమేనని…

Read More

ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ కీలక నాయకులపై సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెడుతున్నారని అంబటి విమర్శించారు.తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ…గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయన ఫిర్యాదు చేశారు.ఈ మేరకు అంబటి మీడియాతో మాట్లాడుతూ…వైసీపీ అధినేత జగన్‌తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై ఐ-టీడీపీ అనే పేరుతో అసభ్య పోస్టులు పెడుతున్నారని తెలిపారు.ఈ నెల 17వ తేదీ నుండి మూడు రోజుల పాటు అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవనీ అన్నారు.కానీ వైసీపీ క్యాడర్ పై మాత్రం 300 కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇలా వస్తాయని అనుకోలేదు అని కాంగ్రెస్ ఎంపీ,రాహుల్ గాంధీ అన్నారు.మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహాయుతి 232 సీట్లు, కాంగ్రెస్ తో కూడిన ఎంవీఏ కూటమి 52 సీట్లు గెలుచుకుంది.మహారాష్ట్రలో దారుణ పరాభవంపై రాహుల్ గాంధీ స్పందించారు.మహారాష్ట్ర ఫలితాలను విశ్లేషిస్తామని చెప్పారు.ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియా కూటమికి ఇంతటి మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.విజయం సాధించినందుకు గాను సీఎం హేమంత్ సోరెన్, పార్టీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు.

Read More