Author: admin

త‌న మాజీ భ‌ర్త‌, న‌టుడు నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకున్న త‌ర్వాత చాలామంది త‌న‌ని సెకండ్ హ్యాండ్ అని కామెంట్ చేశార‌ని న‌టి స‌మంత తెలిపారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె విడాకుల త‌ర్వాత త‌న‌కు ఎదురైన విమ‌ర్శ‌ల గురించి మాట్లాడారు.కార‌ణాలు ఏమైనా కావ‌చ్చు ఒక మహిళ విడాకులు తీసుకుంటే అంద‌రూ ఆమెను ఇబ్బందిక‌రంగా చూస్తారు. ఇష్టం వ‌చ్చిన మాట‌లు అంటారు.సెకండ్ హ్యాండ్‌, యూజ్డ్‌, జీవితాన్ని నాశ‌నం చేసుకుంది అన్న‌ట్లు మాట్లాడతారు.విడాకులు ఎందుకు తీసుకున్నా? అని ఆమె కుంగుబాటుకు గుర‌య్యేలా చేస్తారు.నిజం చెప్పాలంటే ఇది ఆమెతోపాటు ఆమె కుటుంబాన్ని కూడా ఎంతో బాధ‌కు గురి చేస్తుంది. జీవితంలో నేను ఎంతో బాధ‌లు ఎదుర్కొన్నా. ప్ర‌స్తుతం చాలా సంతోషంగా ఉన్నా.మాన‌సికంగా నేను ఎంతో ఎదిగా.వ‌ర్క్ పరంగా అద్బుతంగా ముందుకు సాగుతున్నా.జీవితంలో కొత్త అధ్య‌యాన్ని ప్రారంభించేందుకు ఆనందంగా ఎదురుచూస్తున్నా అని స‌మంత తెలిపారు.స‌మంత న‌టించిన రీసెంట్ ప్రాజెక్ట్ సిట‌డెల్‌..హ‌నీ బ‌న్నీ. స్పై, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా…

Read More

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్యస్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగందే కీలక పాత్రని టీడీపీ నేత ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభసందర్భంలో రాజ్యాంగ నిర్మాతలైన బిఆర్ అంబేద్కర్, న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ పేరుతో ప్రత్యేకంగా ఒక పుస్తకం రూపొందించి అందించబోతున్నట్లు లోకేష్ తెలిపారు. ప్రాథమిక హక్కులు, ఇతర అంశాల గురించి విద్యార్థి దశ నుండే సులభంగా అర్ధం అయ్యేలా చెయ్యడమే ఈ పుస్తకం లక్ష్యమని స్పష్టం చేశారు.

Read More

నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజును గుర్తు చేసుకుంటూ నిర్వహించుకునే ‘రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో మనం రూపొందించుకున్న భారత రాజ్యాంగం, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకే దిక్సూచి అనడంలో సందేహం లేదని చెప్పారు. భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు కలిసి మనుగడ సాగిస్తున్నాయంటే అది మన రాజ్యాంగం గొప్పతనమేనని పేర్కొన్నారు. అంతటి మహత్తరమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ అంబేద్కర్ మనకు ప్రాత:స్మరణీయుడని కొనియాడారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆ మహనీయుడికి నా ఘన నివాళి అర్పిస్తున్నాను. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పురోగమిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Read More

రాష్ట్ర శాసన వ్యవస్థలను డిజిటలైజేషన్ చేయటమే ప్రధాన ఉద్దేశ్యంగా నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ అమలుకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుల సమక్షంలో ఈ ఒప్పందంపై నూతన పార్లమెంట్ భవనంలో సంతకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సత్య ప్రకాష్ లు ఈ ఒప్పందంపై సభాపతుల సమక్షంలో సంతకాలు చేశారు.

Read More

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి సంకల్ప్ పథకం కింద రూ.77 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరి తెలిపారు. ఆయన లోక్ సభలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. 27 ఎంపిక చేసిన పాలిటెక్నిక్ కాలేజీల్లో మహిళల హాస్టళ్ల నిర్మాణానికి రూ.27 కోట్లు, 35 పాలిటెక్నిక్ల అభివృద్ధికి రూ.50.10 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ‘కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ పాలిటెక్నిక్’ పథకం కింద 29 పాలిటెక్నిక్లకు 2024 మార్చి నుండి 2026 మార్చి వరకు ఒక్కో దానికి ఏటా రూ.19.72 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Read More

ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 855 పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. వీటిలో 35 ప్రాథమిక, 27 ప్రాథమికోన్నత, 658 మాధ్యమిక, 135 మాధ్యమికోన్నత పాఠశాలలున్నట్లు చెప్పారు. ఆయన తాజాగా లోక్ సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ పాఠశాలలకు కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.1,056.44 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. కేంద్ర వాటా రూ.633.88 కోట్లలో రూ.293.66 కోట్లు ఈ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

Read More

ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని భారత్ తిరిగి సాధించింది. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో పేలవ ప్రదర్శనతో 3-0 సిరీస్ కోల్పోయి అగ్రస్థానం చేజార్చుకున్న భారత జట్టు బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి 61.11 విజయశాతంతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ చేతిలో ఘోర పరాజయంతో ఆస్ట్రేలియా (57.69) టాప్ ర్యాంకు కోల్పోయి రెండో స్థానానికి పరిమితమైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో శ్రీలంక (55.56), 4వ స్థానంలోన్యూజిలాండ్ (54,55), 5వ స్థానంలో దక్షిణాఫ్రికా (54,17), 6వ స్థానంలో ఇంగ్లాండ్ (40.79), 7వ స్థానంలో పాకిస్థాన్ (33.33), 8వ స్థానంలో బంగ్లాదేశ్ (27.50), 9వ స్థానంలో వెస్టిండీస్ (18.52) ఉన్నాయి.

Read More

డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ మరోసారి టైటిల్ నిలుపుకుంది. ఫైనల్లో 2-0తో నెదర్లాండ్స్ పై విజయం సాధించింది. ప్రపంచ నంబర్ వన్ యానెక్ సినర్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి సింగిల్స్ లో బెరిటిని 6-4, 6-2తో బొటిక్ వాండెపై గెలిచి ఇటలీకి ఆధిక్యం అందించాడు. రెండో సింగిల్స్ సినర్ 7-6 (7-2), 6-2తో గ్రిక్స్ఫూర్ ను ఓడించి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. సింగిల్స్ లోనే ఫలితం తేలడంతో డబుల్స్ మ్యాచ్ నిర్వహించబడలేదు. చెక్ రిపబ్లిక్ (2012, 2013) తర్వాత వరుసగా డేవిస్ కప్ గెలిచి ఇటలీకి సత్తా చాటింది.

Read More

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ చేతిలో ఓటమి చెందాడు. ఉత్కంఠభరితంగా జరిగిన ఆటలో లిరెన్ 42 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. ఇప్పుడు అతడి ఖాతాలో ఒక పాయింట్ చేరింది. ఈ గేమ్ లో గుకేశ్ తెల్ల పావులతో ఆడాడు. లిరెన్ నల్ల పావులతో ఆడాడు. టోర్నీలో మొదట 7.5 పాయింట్లకు చేరుకున్న ఆటగాడు విజేతగా నిలుస్తాడు. మిడిల్ గేమ్లో ముకేశ్ తడబడ్డాడు. భారత్ తరపున ఇప్పటివరకు విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచాడు. తదుపరి గేమ్ లో గుకేశ్ పైచేయి సాధించాలని చెస్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Read More

అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. వన్య ప్రాణులు పంటలను నాశనం చేయడం, ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండటం ఓ వైపు… మరో వైపు పొలాల దగ్గర వేసుకున్న విద్యుత్ కంచెలకు వన్య ప్రాణులు చనిపోతున్న క్రమంలో ప్రజల జీవనోపాధులకు, ప్రాణాలకు విఘాతం లేకుండా వన్య ప్రాణులను కాపాడుకోవాలని పవన్ సూచించారు. ప్రజలను రక్షించడంతోపాటు వన్యప్రాణుల భద్రతను చూడటంలో రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఏనుగులు వ్యవసాయ భూముల్లోకి రాకుండా కందకాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి ఆ పథకం ద్వారా ఈ పనులను చేపట్టాలని స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్ లైన్లను ఇన్సులేట్ చేసి తద్వారా వన్యప్రాణులకు.. ముఖ్యంగా ఏనుగులు ఎక్కువగా ఉండే మండలాల్లో విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదాన్ని నివారించడానికి తక్షణం…

Read More